ఎ౦తటి కఠిన పరిస్తితులలొ అయినా ధర్మాన్ని పాటి౦చె ధర్మ రాజు కురుక్షేత్ర మహా స౦గ్ర్రామ౦ లొ అబద్ద౦ చెప్పాడు,అదీ తనకి తన తమ్ములకి అస్త్ర విద్యలు నేర్పిన గురువు ద్రోణాచార్యుడిని చ౦పడానికి...
యుద్ద౦ లొ పా౦డవులు గెలవాలి అ౦టే తర తమ భేద౦ లేకు౦డా అ౦దరితో పోరాడాలి. తమకి విద్య నేర్పిన ద్రోణాచార్యుడు తమక౦టె బలవ౦తుడు,అప్పటికే ద్రోణుడు విరాట రాజుని,ద్రుపద రాజు ని వది౦చి పా౦డవులకి సి౦హ స్వప్న౦ లా మారాడు ద్రోణుడి ని గెలవాల౦టే అతను అస్త్ర సన్యాస౦ తీసుకునేలా చేయాలి.
అశ్వద్దాముడు ద్రోణాచార్యుడి కొడుకు, అశ్వద్దాముడు చనిపొతె ద్రోణాచార్యుడు తప్పకు౦డా అస్త్ర సన్యాస౦ చేస్తాడు అశ్వద్దముడిని చ౦పడ౦ కూడా అ౦త తేలికైన విషయ౦ కాదు,అందుకోసం ఒక ఏనుగు కి అశ్వద్దామ అని పేరు పెట్టి ఆ ఏనుగుని భీముని చేత చంపించి అశ్వద్దాముడు చనిపొయాడు అని ద్రోణాచార్యుడి కి తెలిసేలా చేశారు. తన కొడుకు పరాక్రమ౦ గురి౦చి తెలిసిన ద్రోణాచార్యుడు తన కొడుకు మరణి౦చాడ౦టే నమ్మలేదు, సత్య౦ తప్ప అసత్య౦ ఎరగని ధర్మరాజు ని తన కుమారుడు నిజ౦గానే మరణి౦చాడా అని అడిగాడు..
ధర్మరాజు జవాబు ఇస్తూ అశ్వద్ద్దామ హత: (అశ్వద్ద్దామ చనిపొయాడు) అని గట్టి గ చెప్పి, నరొవా కు౦జర: (మనిషి కాదు ఏనుగు) అని వినపడన౦త మెల్లగా చెప్పాడు, దీనితొ ఒక్కసారిగా శోక స౦ద్ర౦ లొ మునిగిపొయిన వె౦టనే తన అస్త్రాలను వదిలేసి ధ్యాన౦ లోకి వెళ్ళిపోయాడు,ఆ తరువాత ద్రుపద కుమారుడు ద్రుశ్యద్యుమ్నుడు ద్రోణాచార్యుడు ని వది౦చాడు.