23 సంవత్సరాల ధీరజ్ చేసిన ఈ మినియెచర్స్ అన్నీ కూడా డబ్బు కోసం తయారుచేయలేదు, మానసిక శాంతి(మెడిటేషన్) కోసం తయారుచేశాడు. కోటి మందిలోను మనల్ని ప్రత్యేకంగా వేరుగా చూపించేది మనలోని టాలెంట్ అన్నది ధీరజ్ సిద్ధాంతం. అందుకే జ్ఞానం పెరిగిన నాటి నుండి ఈ మినియెచర్స్ రూపొందిస్తున్నాడు. ముందుగా చాక్ పీస్ తో తయారుచేశాడు, ఆ తర్వాత మరింత ప్రాక్టీస్ తో ఇలా పెన్సిల్ మీద అద్భుతాలను సృష్టిస్తున్నాడు. ఇప్పటి వరకు వందల సంఖ్యలో మినియెచర్స్ రూపొందించి వండర్ వరల్డ్ రికార్డ్, వజ్ర వరల్డ్ రికార్డ్ అందుకోవడంతో పాటుగా భారత రాష్ట్రపతి కోవింద్ గారికి సైతం అభిమాన మినియెచర్స్ ఆర్టిస్ట్ గా మన్ననలు అందుకున్నారు. ధీరజ్ లో ఎంతటి టాలెంట్ ఉందో అంతే స్థాయిలో సమాజం పట్ల ప్రేమ కూడా ఉంది. "షేర్ ఏ మీల్" పేరుతో ఇప్పటికీ 350 రోజుల నుండి ప్రతిరోజూ ఒకరికి భోజనాన్ని అందిస్తున్నాడు. ఒకపక్క NAAVIGO లో MDగా ఉద్యోగం చేస్తూనే మరోపక్క తన దగ్గరికి వచ్చే ఔత్సాహిక ఆర్టిస్టులకు కూడా మినియెచర్స్ లో శిక్షణ ఇస్తుంటాడు.
ఏ ఇనిస్టిట్యూట్ లో కోచింగ్ తీసుకోకుండా ఇంటర్నెట్ ద్రోణాచార్య ద్వారా తనకు తానుగా నేర్చుకుని రూపొందించిన కొన్ని అద్భుతాలు..
ప్రఖ్యాతిగాంచిన టెడ్ ఎక్స్ లో ధీరజ్ స్పీచ్:
ధీరజ్ రూపొందించిన మరిన్ని అద్భుతాలను ఇక్కడ చూడవచ్చు: Dheeraj's ARTtitude.