Contributed By Pranaya
Episode 1 - Click Here Episode 2 - Click Here Episode 3 - Click Here
నాకు జాబ్ రావడంతో ఇద్దరం హ్యాపీ. కానీ పోస్టింగ్ హైద్రాబాద్ కి దూరంగా వచ్చింది. దాంతో మా మధ్య దూరం పెరిగింది. తనకి టైం ఇవ్వట్లేదని బాధపడ్డాడు. నిజమే, అందులో నా తప్పు కూడా ఉంది. ముందులాగా కలవడం కుదరట్లేదు. మాట్లాడటం తగ్గి పొట్లాడటం ఎక్కువైంది. తను అనే మాటలు తట్టుకోలేక కొన్ని రోజులు మాట్లాడటం మానేశా. ఉండలేక మళ్ళీ నేనే మాట్లాడాను. ఇలా ఎన్ని సార్లు జరిగిందో తెలియదు.
సంవత్సరం తరవాత తనకి జాబ్ వచ్చింది. పోస్టింగ్ బెంగుళూరు లో. ఇప్పుడైనా మా మధ్య గొడవలు తగ్గుతాయి అనుకున్న. అనుకున్నట్టే జరిగింది. మళ్ళీ పాత అర్జున్ ని చూసా. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు లేదు. మళ్ళీ గొడవలు. ఇష్టంలేకున్నా నీకోసం జాబ్ చేయాల్సి వస్తుంది అని ప్రతిదానికి నన్నే అనడం మొదలుపెట్టాడు. ఎన్ని మాటలు అన్న పడ్డాను. ఇలానే సంవత్సరం గడిచింది.
మనసులో ఎన్నో ఆలోచనలు. ప్రేమ మొదలైనపుడే మధురంగా ఉంటుందని తెలుసు. కానీ ప్రేమ లో బాధ కూడా మధురంగానే ఉంటుందని అర్థం చేసుకున్నాను. అర్జున్ నాకు దూరమైపోతాడేమో అన్న భయం నన్ను పిచ్చిదాన్ని చేసింది. అప్పుడు అర్థం అయింది విషం కంటే మన ఆలోచనలే చాలా ప్రమాదకరం అని.
వెంటనే అర్జున్ ని కలిసి మా పెళ్లి గురించి మాట్లాడలనుకున్నాను. కలవాలి హైద్రాబాద్ రమ్మన్నాను. కుదరదన్నాడు. మాట్లాడటం ఆపేసాడు. నెంబర్ బ్లాక్ చేసాడు. ఎం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అంత తప్పు ఎం చేసాను నేను అని పిచ్చిదాన్ని అయ్యాను. స్ట్రెస్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఇద్దరం పెళ్లి చేసుకొని అర్జున్ తనకిష్టమైన సెరి కల్చర్ స్టార్ట్ చేయాలని, నేను మా ఊరిలో ఒక చిన్న అనాథ ఆశ్రమం పెట్టాలని కలలు కన్నాం. అవన్నీ కలలు గానే మిగిలిపోతాయేమో అని భయమేసింది.
ఎలా అయినా అర్జున్ ని ఒక్కసారి కలవాలని నేనే బెంగుళూరు వెళ్లాలని డిసైడ్ అయ్యాను. అదే విషయం తనకి మెయిల్ చేసాను. "అర్జున్, ఈ ఆరు సంవత్సరాల ప్రేమ నాకు ఎన్నో అనుభూతుల్ని ఇచ్చింది. ఆ ప్రేమని, నిన్ను మర్చిపోలేక నీకోసం, మన ప్రేమకోసం వస్తున్నా. నువ్వు వచ్చి కలుస్తావన్న నమ్మకం తో నీకోసం ఎయిర్పోర్ట్ లొనే ఎదురుచూస్తూ ఉంటా." కానీ రిప్లై లేదు.
డైరీ చదవడం అయిపోయింది. కానీ ఇంకా నా ప్రశ్నలకి జవాబు దొరకలేదు. అన్షు అర్జున్ ని కలిసిందా.? తర్వాత ఏం జరిగింది.? ఇవి ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వెంటనే మౌనిక కి ఫోన్ చేసి అర్జున్ వర్క్ చేసిన ఆఫీస్ ఎక్కడో తెలుసుకున్నాను. నెక్స్ట్ ఫ్లైట్ కి బెంగుళూరు వెళ్లి అర్జున్ ఫ్రెండ్ వంశీ ని కలిశాను.
"అర్జున్ కి అన్షు అంటే చాలా ఇష్టం. దూరం వాళ్ళ ఇద్దరి మధ్య ఇంకా దూరాన్ని పెంచింది. అప్పుడే అర్జున్ ఆఫీస్ లో ఒక అమ్మాయి తో ఎక్కువ మాట్లాడటం స్టార్ట్ చేసాడు. కొన్ని రోజులకే ఆ అమ్మాయి జస్ట్ టైంపాస్ కోసమే తనతో ఫ్రెండ్షిప్ చేసిందని తెల్సుకున్నాడు. తప్పు చేశానని చాలా బాధపడ్డాడు. వెంటనే అన్షు ని కలవాలని, తనని క్షమించమని అడగాలని స్టార్ట్ అయ్యాడు. కానీ ఆక్సిడెంట్ రూపం లో వాళ్ళ మధ్య దూరం ఇంకా పెరిగింది. తిరిగి కొలుకోడానికి రెండు నెలలు పట్టింది. ఈ జాబ్ వల్లే అన్షు కి దూరం అయ్యానన్న బాధ తో జాబ్ వదిలేసాడు." అని వంశీ చెప్పాడు.
అన్షు అర్జున్ కోసం బెంగుళూరు ఒచ్చిన సంగతి వంశీ కి చెప్పాను. కానీ వంశీ ఇక్కడికైతే రాలేదు అన్నాడు. వెంటనే వంశీ ని తీసుకొని అర్జున్ వాళ్ల ఊరు స్టార్ట్ అయ్యాను. (ఇంకా ఉంది, మళ్ళీ రేపు ఇదే టైముకి)