Contributed By Pranaya
Episode 1 - Click Here Episode 2 - Click Here Episode 3 - Click Here Episode 4 - Click Here
అర్జున్ ని కలిసి జరిగిందంతా చెప్పాను. తనకి ఆక్సిడెంట్ అయిన విషయం తెలియక అన్షు బెంగుళూరు వచ్చిన విషయం చెప్పగానే అర్జున్ కళ్ళలో నీళ్ళు, అన్షు ని చూడాలన్న ఆరాటం కనిపించాయి. కానీ తను ఎక్కడ ఉంది అన్న ప్రశ్న కి సమాధానం నా దగ్గర లేదు.
వెంటనే అర్జున్ అన్షు ని చూడాలి వెళ్దాం అన్నాడు. కానీ ఎక్కడికి.? మాట కూడా మాట్లాడకుండా అర్జున్ బైక్ తీసాడు. నేను, వంశీ తన వెంట నడిచాము. ఆరు గంటల తరవాత అన్షు వాళ్ల ఊరు చేరుకున్నాం. కానీ వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉంది. కనుక్కుంటే ఇప్పుడు అక్కడ ఉండట్లేదు అని తెలిసింది.
ఎం చేయాలో తెలియక బేకరి షాప్ ముందు కూర్చొని ఆలోచిస్తున్న సమయంలో అన్షుమాలిక అని వినిపించింది. తిరిగి చూస్తే ఒక అమ్మాయి. నీ పేరు అన్షుమాలికా అని అడిగాడు అర్జున్. కాదు మా అక్కయ్య పేరు, ఇవ్వాళ తన బర్త్డే అందుకే కేక్ తీసుకెళ్తున్న అని చెప్పి వెళ్ళిపోయింది. అవును ఈరోజు అన్షు బర్త్డే అని అర్జున్ అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి ని ఫాలో అయ్యాము.
అది ఒక అనాధ ఆశ్రమం. లోపలికి వెళ్లిన అర్జున్ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి తన కళ్ళలో నీళ్ళు ఆపుకోలేకపోయాడు. అర్జున్ ని చూసి పరుగెత్తుకు వచ్చిన ఆ అమ్మాయి ని తన గుండెలకు హత్తుకొని ఒక చిన్నపిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయే అన్షుమాలిక.
అన్షు ని చూసిన నేను ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. తనకి ఎం కాలేదు. క్షేమంగా ఉంది. బెంగుళూరు ఎయిర్పోర్ట్ లో రోజంతా అర్జున్ కోసం ఎదురుచూసి ఇంక రాడని తిరిగి వచ్చి తన జ్ఞాపకాలతో బతుకుతుంది.
బెంగుళూరు వెళ్ళాక కూడా తనని కలవడానికి రాని అర్జున్ ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని ప్రయత్నించలేదు అన్షు. ఆక్సిడెంట్ నుండి రికవరి అయ్యాక కూడా అర్జున్ అన్షుని కలవడానికి ప్రయత్నించలేదు. ఇదంతా చూస్తుంటె "నా జీవిత గమ్యం" నాకిష్టమైన కథలు రాయడం అని చెప్పడానికి దేవుడు అర్జున్ అన్షులను నాకు పరిచయం చేశాడా..? లేక ఆరు సంవత్సరాల స్వచ్ఛమైన అన్షు అర్జున్ ల ప్రేమను గెలిపించడానికి వాళ్ళకి నన్ను పరిచయం చేశాడా..? అనిపిస్తుంది. ప్రశ్నలతో మొదలైన నా ప్రయాణం ప్రశ్నలతోను ముగుస్తుందని అనుకోలేదు.
మనస్ఫూర్తిగా ఒక పని చేసినా, ఒక వ్యక్తిని ఇష్టపడ్డా పంచభూతాలు ఆ పని ని విజయవంతం చేయడానికి, ఆ వ్యక్తిని దగ్గర చేయడానికి సహాయం చేస్తాయి. ఇది ఎక్కడో చదివాను. ఈరోజు చూసాను.
అర్జున్ అన్షు కలవకపోయి ఉంటే వాళ్ళ తీపి గుర్తులన్ని ఇద్దరికి చేదు జ్ఞాపకలుగానే మిగిలిపోయేవి, కలిశారు కాబట్టి ఈ ప్రయాణం లో వాళ్ళ కి ఎదురైన చేదు అనుభవాలు కూడా మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మనం ఇష్టపడి పని చేసే ప్రయత్నంలో, వేసే అడుగులు తడబడినా, గెలిచాక అవి తీపి గుర్తులుగానే ఉండిపోతాయి. తడబడిన అడుగులకు తలవంచితే తీపి గుర్తులుగా మిగిలిపోవాల్సినవి చేదు నిజాలై వెంటాడతాయి.
చివరగా ఒక్క మాట, చేసే పని పై నమ్మకం, పట్టుదల ఉన్నప్పుడు చీకట్లో నువ్వు వేసే ప్రతి అడుగుని నీ గమ్యం వైపు నడిపించడానికి ఆ దేవుడు ఎదో ఒక రూపం లో చిన్న దీపాన్ని నీ జీవితంలో కి పంపిస్తాడు... నా లైఫ్ లో అది అన్షు..
ప్రేమతో మీ ప్రణయ...