This Short Story About A Girl's Confusion On Getting Into Relation After A Break Up Is Something Every Girl Can Relate To!

Updated on
This Short Story About A Girl's Confusion On Getting Into Relation After A Break Up Is Something Every Girl Can Relate To!

ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా వాడ్ని ప్రాణం విలువ ఏంటో తెలియచెప్పి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. మనిషికి మానవత్వం నేర్పేది మతం అవ్వాలి కానీ మనసులు విరిచి మనుషులను దూరం చేసేది కాదు. ఒక్కరిగా ఉన్న ఇద్దర్ని ఒంటరి ని చేసింది ఆ మతం. ఒకరిని వదిలి ఒకరం నిమిషం కూడా ఉండలేని మేము, తను ఇంక రాడని, కలవలేనంత దూరం వెళ్లిపోయాడని, తెలిసి కన్నీరు ఇంకిపోయినా బాధ మాత్రం తగ్గట్లేదు.

కాలం ఒకరిని దూరం చేస్తే ఇంకొకరిని పరిచయం చేస్తుంది. అబ్దుల్ బాధను మిగిల్చిన నా గతం, అర్జున్ నాకు ఒక కొత్త లోకాన్ని చూపించిన నా జీవితం లోని ఒక నూతన అధ్యయనం. నయన ప్రకాష్, మాటల్లో చెప్పలేని బాధని నా కవితల్లో కధల్లో పంచుకునే ఒక కవిని . నాలో నాకే నాతో నాకే జరిగే అంతర్గత సంఘర్షణను సంభాషణలుగా రాసె రచయిత్రిని. పాతికేళ్ళు నిండిన ఒక పడుచు పిల్లని, ఒకరి ప్రేమకు దూరమై మరో ప్రేమకు దగ్గరవ్వాలా వొద్దా అని నాలో నేను కుమిలిపోతున్న ఒక ఆడ పిల్లని.

‘అప్పుడు వాడితో తిరిగింది, ఇపుడు ఇంకొకడు. తర్వాత ఎవడు బలవుతాడో?' 'ఈ కాలం అమ్మాయిలు చాలా ఫాస్ట్ రా బాబు, వైఫై పాస్ వర్డ్ లు మార్చినంత ఈజీ గా మార్చేస్తున్నారు అబ్బాయిలని' 'వాళ్ళకేంట్రా మనోళ్లు అమ్మాయి మంచిగుంటే చాలు క్యూ లు కడుతున్నారు, వాళ్ళు విచ్చలవిడిగా ఈ అమాయకులని వాడుకుంటున్నారు'

“ప్రేమ” కలి కాలం లో అతి పెద్ద బూతు పదం. బయటకి చెప్పలేం , వాడకుండా ఉండలేం. అబ్దుల్ తో ఉన్న రోజులు ప్రతి క్షణం నా ముందు మెదులుతూ ఉంటాయి. నలుగురితో ఉన్న నా వెంటే ఉండే ఆలోచన అబ్దుల్. నన్ను కాదని వెళ్లినా మళ్ళీ వస్తాడు అనే ఆశ అబ్దుల్. పెళ్లి దాకా వెళ్లిన మా ప్రేమ పంతాల వల్ల ఆగిపోయింది.

"ఇంకా వాడిని మర్చిపో ఎంత కాలం వాడి గురించే ఆలోచిస్తావ్? నీకోసం ఎవరో ఒకరు వస్తారు, నీకేం తక్కువ” నా కళ్ళలో నీరు రాకుండా అప్పటి ఓదార్పు మాటలు అవి.

"అబ్దుల్ వదిలి సంవత్సరం కూడా కాలేదు అపుడే ఇంకోక్కడ్ని పట్టేసింది.” నా కళ్లలోని ఆనందాన్ని చూడలేక వస్తున్నా ద్వేషపు మాటలు ఇవి.

నను వదిలి వెళ్లినప్పుడు అబ్దుల్ ని వేలెత్తి చూపని సమాజం, నేడు అర్జున్ నా జీవితం లోకి వచ్చినందుకు నన్ను జులాయి అని ముద్ర వేసింది. తిరుగుబోతు అని నానా మాటలు అంటుంది. ప్రేమ ఒకసారి మాత్రమే పుట్టాల? లేదా అమ్మాయిలకి మాత్రమే ఇలానా ? ఒకడు మోసం చేసి వెళ్ళిపోతే జీవితాంతం ఒంటరిగా గడపాలా ? ఆడ దానికి మరో తోడు వెతుకోవటం తప్పా ?

ఎలా ఉండాలి ఎవరితో ఉండాలి , ఈ జీవితం నాదైన సమాజం దీన్ని పాలిస్తుంది. ఇది నా కథ , ప్రేమ ఊబి లో కూరుకున్న ప్రతి అమ్మాయి కథ. సమాజం ఎన్ని మాటలు అంటున్న మనసులో పట్టలేనంత బాధ నింపుకుని పెదవి పై చిరు నవ్వు నటిస్తున్న ఒక ప్రేయసి గాధ, బాధ. మనిషి ఉన్న మనసు చంపుకుని జీవచ్ఛవంలా పడిఉన్న ఒక పిరికి ఆడదాని వ్యధ.

ఎదురెళ్లి ఒంటరినవ్వాలా ఒదిగుండి ఒకటిగఉండాల మనసు చంపుకొని బ్రతకాలా? మౌనంగా సహిస్తుండాలా? ఓ అక్షరమా నా సహనానికి నువ్వే సాక్ష్యం నా భయానికి బాధకి నువ్వే ప్రతిరూపం ఓ అక్షరమా నీకు నమస్కారం నిజామా మౌనమా చెప్పు దీనికి పరిష్కారం

Being a girl is not that easy.They are the real warriors. They have to fight against society's decisions, expectations, rules, dreams. The society is always ready to point out them if they choose to be different. They are girls they have dreams, they have life to live. To the society which bounds them in all ways "IT'S HER CHOICE" to be different. Let them be. Respect their decisions, respect their dreams, respect their opinions, RESPECT THEM.