ఒక పిల్లి గోడ మీద కూర్చొని ఆలోచిస్తుంది.. నేను, చిరుతపులి చూడటానికి ఒకేల ఉంటాము, ఇద్దరము వేగంగా పరిగెత్తగలము, చెట్లు ఎక్కగలము అందువల్ల "నేను కూడా చిరుతనే" అందరిని భయపెట్టి ఆధిపత్యం చెలాయిస్తా అని అనుకుంటుండంగా "దాన్ని చూసిన ఒక వీది కుక్క మొరగ గానే దానికి తెలియకుండానే వెనక్కి తిరిగి చుడకుండ పిల్లి పారిపోయింది".. పులిని ఇమిటేట్ చెద్దామనుకునే పిల్లులే కాదు.. తెలియక గొర్రెలను ఇమిటేట్ చెద్దామనుకునే, చేసే సింహాలు కూడా ఉన్నాయి, ఇక్కడ మీకో చిన్న కథ చెబుతా..
ఒక సింహపు కూన ప్రమాదవశాత్తు తన తల్లిని కొల్పోయి ఒక గొర్రెలమందలో కలిసింది ఆ గొర్రెలతోపాటు కలసి తిరిగేది, అది కూడా వాటిలాగానే గడ్డిమేసెది, తాను ఒక సింహం అన్న విషయం దానికి తెలియలేదు. సింహాలు మందపై దాడి చేసిన భయపడి వాటితోపాటు పారిపోయేది.. ఒకరోజు ఒక సింహం ఆ సింహపు కూనను పట్టుకొని ఈడ్చుకెళ్ళి నీటిలో తన నిజస్వరూపన్ని చూపించి నువ్వు ఒక సింహానివి నీ బ్రతుక్కి మిగిలిన జంతువుల బ్రతుక్కి తేడా వివరించింది.. అంతే ఇక అప్పుడు అర్ధం అయ్యింది తాను ఒక గొర్రెను కాను అడవినంతటిని పాలించే మృగరాజును అని.. తన శక్తిని తెలుసుకున్న సింహం గర్జించింది దిక్కులు ప్రెక్కటిల్లేలా గర్జించింది..
అలాగే నా స్నేహితుడు ఒకడున్నాడు. వాడికి ఒక స్టార్ హీరొలా పోలికలున్నాయి.. వాడి Parents,ఇంకొంత మంది Friends వాడ్ని ఆ హీరొతో పోలుస్తుండటం వల్ల వాడికంటు ఒక సొంత వ్యక్తిత్వం లేక ఆ Star Heroని అనుకరించాడు అతనిలానే తనని తాను ఊహించుకొని ఆ హీరోలా Behave చేస్తుండేవాడు.. ఆ హీరొ సినిమా Utter Flop అయినప్పుడు Inferiority Complex లో, సినిమా Super Hit అయినప్పుడు నేనే గొప్ప అని కొన్ని రోజులు బతికేస్తాడు.. ఇప్పుడు వాడు చదివిన చదువుకు 12,000 Salary వస్తుంటే 30,000 Salary వస్తుందని చెప్పుకు బతుకుతున్నాడు.. ఆ స్టార్ హీరో కి వచ్చేంతటి విలువ, గుర్తింపు తనకు రావాలని పాపం అలా అబద్దం చెప్పేంతటి స్థాయికి దిగజారిపోయాడు. కొన్నిసార్లు వాడు చేసే చేష్టలకు కోపం వచ్చినా కాని వాడి పరిస్తితిని తలుచుకుంటే భాద వెసేది..
ముందు ఇతరుల గురించి తెలుసుకోవడం కన్నా మన గురుంచి మనం తెలుసుకోవాలి.. ముందు మనమేంటో మనలోపాలేంటో పరిపూర్ణంగా తెలుసుకొని కష్టపడితే మనకంటు ఖచ్చితంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.. అప్పుడు ఇంకొకరిని ఇమిటేట్ చేసేంతటి ఖర్మదాపురించదు.. మన శక్తి మనం తెలుసుకొని మనకంటు దారి నిర్మించుకొని మనం పోరాటం సాగించాలి.. అంతేకాని ఒక వక్తిత్వం అంటు లేకుంటే మన దారి, మన లక్ష్యం తెలియదు.. అప్పుడే మిగితవారిని Imitate చేస్తుంటాం.. Inspire అవ్వాలి కానీ Imitate చెయ్యొద్దు.. అలా Copy చేస్తు ఇంకొకరిని దాటాలన్న కనీసం సమిపానికి రావలన్నా కూడ ఈ జన్మ సరిపోదు!
గుర్తుపెట్టుకో... ఎప్పుడయిన,ఎక్కడయిన Duplicate కంటె Original అందంగా, ధృడంగా ఉంటాయి..