(Article info source: Namasthe Telangana)
కూచిపూడి మన తెలుగువారి ఆస్తి. భారతదేశ సంప్రదాయానికి చెందిన ప్రధాన నృత్యాలలో కూచిపూడి కూడా ఒకటి. ఈ ప్రాచీన కళ కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో క్రీ.పూ 2వ శతాబ్ధంలో ఆవిర్భవించింది. ఇంతటి ప్రాచీనమైన కూచిపూడి నృత్యంలో 40 సంవత్సరాలకు పైగా చేసిన సేవలకు గాను డా.పద్మజారెడ్డి గారికి సంగీత నాటక అకాడెమీ గౌరవం దక్కింది. రాష్ట్రపతి చేతులమీదుగా ఈ అవార్ఢును అందుకున్నారు. దాదాపు 250 మంది వివిధ విభాగాలలో పోటిపడితే ఈ అవార్ఢు మన తెలుగు మహిళకు రావడం నిజంగా మనకు గర్వకారణం. ఈ పురస్కారం కేవలం ఆమె చేసిన నాట్యానికి మాత్రమే కాదు, నాట్యం ద్వారా ఎన్నో సమస్యలను ఈ దేశానికి తెలియజేసినందుకు, వాటిపై పోరాడినందుకు కూడా.

కూచిపూడి అని మాత్రమే కాదు భరతనాట్యం లాంటి సంప్రదాయకమైన నాట్యంలో రామాయణ, మహాభారతంలోని కథలను నృత్యాల రూపంలో ప్రదర్శిస్తారు.. కాని డా.పద్మజారెడ్డి గారు మాత్రం భ్రూణ హత్యల నివారణ, మహిళల సమస్యలు, ప్రకృతి, ఏయిడ్స్ పై అవగాహన లాంటివెన్నో సమస్యలను కూచిపూడి నృత్యంతో మేళవించి సామన్య ప్రజానీకానికి అర్ధమయ్యే రీతిలో తన టాలెంట్ తో ఎన్నో ప్రదర్శినలిచ్చారు. కృష్ణాజిల్లా పామర్రు లో జన్మించారు పద్మజా గారు. అక్కడి నుండి కూచిపూడి గ్రామం అత్యంత సమీపంగా ఉండటం వల్లనే కాబోలు చిన్నతనంలో తాతయ్య, అమ్మమ్మ ప్రోత్సాహంతో కూచిపూడి నాట్యం మీద ప్రేమ పెంచుకుని నృత్యం నేర్చుకున్నారు.

తండ్రి హైదరాబాద్ లో రేడియాలజిస్ట్, దాంతో అక్కడి నుండి హైదరాబాద్ కు రావడం జరిగింది. కూచిపూడి ఊరిలో గురువులకు కొదువ లేదు మరి హైదరాబాద్ ? అదృష్టవశాత్తు ప్రముఖ నృత్యకారిని శోభ నాయుడు గారు ఇక్కడే అకాడమీ ప్రారంభించడంతో పద్మజానే మొదటి శిష్యురాలైనారు. పదేళ్ళు దాటకముందే కూచిపూడిలో విశేష ప్రతిభ కనబరిచి ప్రదర్శనలు ఇవ్వడం మొదలుబెట్టారు. మనలో ఏ టాలెంట్ ఉంటుందో దాని మీదే ఎక్కువ కష్టపడతాం మిగితావాటి మీద అంతగా దృష్టిని కేంద్రీకరించలేము, అలాగే చిన్నప్పటి నుండి కూచిపూడి నే దైవంగా భావించి నేర్చుకుంటున్న పద్మజా గారు కూడా చదువులో కాస్త వెనుకబడినా బి.ఏ పూర్తి చేశారు. తను ప్రదర్శించే కూచిపూడి నాట్యానికి ప్రజలు సమ్మోహితులు అవ్వడంతో ఆ కళలోని గొప్పతనం ద్వారా కూచిపూడి మీద మరింత గౌరవం పెరిగింది.

40 సంవత్సరాలకు పైగా సాగిన సుధీర్ఘ నాట్య ప్రస్థానంలో ఇప్పటి వరకు భారతదేశంతో పాటు 100 ఇతర దేశాలలో, 3,000కు పైగా వివిధ ప్రదర్శనలిచ్చి హంస అవార్ఢు, నట విశారద, దశాబ్ధపు నర్తకి లాంటి పురస్కారాలను అందుకున్నారు. శ్రీ కృష్ణ దేవరాయులు యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ ను కూడా అందుకున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న సంగీత నాటక అకాడమీ పురస్కారం మాత్రం అత్యున్నతమైనది. నాట్యరంగంలో విశేష సేవలకు గాను ఈ అవార్ఢును బహుకరిస్తారు. నాట్య ప్రదర్శనల రూపంలో దేశ విదేశాలలో ఎంతోమంది అభిమానులను సంపాదించడమే కాకుండా దాదాపు 500 మంది కూచిపూడి విద్యార్ధులను నిష్నాతులగా తీర్చిదిద్ది ఈ దేశానికి అందించారు. వినోదం మాత్రమే కాకుండా విజ్ఞానంతో ప్రజలను చైతన్య పరుస్తున్న డా.పద్మజారెడ్డి గారికి అభినందనలు.


Dance Performance at UKTA:
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.