Contributed By Sowmya Uriti
కళ్ళు మూయగానే నా కళ్ళ ముందుకొస్తుంది.. కొత్త లోకం లోకి నన్ను తీసుకువెళ్తుంది..
ఇష్టమైన వాటిని చూపించి పరవసింపచేస్తుంది.. కష్టం కలిగించే వాటిని చూపించి బాధపెడుతుంది..
కొన్ని సార్లు ప్రశాంతతని పరిచయం చేస్తుంది.. కొన్ని సార్లు నా భయాన్ని బయట పెడుతుంది..
ఒక్కోసారి మేలుకోగానే తనని తలచుకునేల చేస్తుంది.. ఒక్కోసారి దరికి రాగానే మెలుకువ తెప్పించేస్తుంది..
నిజమైతే బాగుండును అనిపించేవి కొన్ని చెప్తుంది.. నిజం కాదు అని ఊపిరి పీల్చుకునేలా కొన్ని చెప్తుంది..
తను చూపిన దాన్లో ఎదో అర్ధం వేతకమంటుంది.. తను అర్ధం లేని వ్యర్ధమైన వాటిని చూపించనంటుంది..
తన రాకకు కారణం తెలుసుకోవాలనిపించేలా చేస్తుంది.. తన పుట్టుక ఎక్కడో తప్ప ఎందుకో తెలియనీయకుండా చేస్తుంది..
కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.. సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతుంది..
నా కలంతో రాయమంటుంది తన గురించి ఇలా.. తనే 'కల'...