హక్కుల కోసం, సమానత్వం కోసం కాదు ఇప్పుడు పుట్టక కోసం స్త్రీ పోరాడాల్సిన కర్మ దాపురించింది. మీ అమ్మ గురుంచి ఒక మంచి మాట చెప్పు అంటే ప్రతి ఒక్కరు దేవత,నా బలం అంటు పెద్ద పెద్ద పదాలు వాడుతుంటారు కాని రేపటి అమ్మను పుట్టనివ్వండి బతకనివ్వండి అంటే చాలమంది తల్లిదండ్రులు భయంతో వెనకడుగు వేస్తుంటారు.. ఇంకొంత మంది నీచులు ఐతే పిండ దశలో ఉన్నప్పుడే నిర్ధాక్ష్యన్యంగా హత్య చేస్తున్నారు.. మన భారతదేశంలోనే ఉత్తమ అగ్ర రాష్ట్రంగా ఎదుగుతున్న తెలంగాణలో..ఆడపిల్లల జననాలు చాల దారుణంగా పడిపోతున్నాయి.. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.
ఏదో మారుమూల పల్లెటూరు అంటే అక్కడ చదువుకున్నవారు తక్కువ అజ్ఞాణం ఎక్కువనుకుంటాం కాని గ్రామాలలో కాన్న రాష్ట్రరాజధానిలో ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి..! దేశంలోనే అత్యుత్తమ నగరంగా ఉండి మెట్రోపాలిటన్ సిటి నుండి కాస్మోపాలిటన్ సిటి గా ఎదుగుతున్న హైదరాబాద్ లో తెలంగాణ ప్రాంతలాన్నీటిలో కన్నా అత్యధికంగా శిశుమరణాలు జరుగుతున్నాయి. ఇక్కడ వెయ్యిమంది మగపిల్లలకు 914 మంది మాత్రమే ఉన్నారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.. ఎక్కడ అబివృద్ది ఉంటుందో అక్కడ తెలివితేటలుంటాయి కాని ఇక్కడ మాత్రం 2001(943-1000)లో కన్నా 2011(914-1000) శిశుమరణాలు ఎక్కువయ్యాయి. అలా మిగితా జిల్లాలో కూడా పరిస్థితి ఇలానే ఉంది.

పుట్టిన దగ్గరి నుండి మట్టిలో కలిసేంతటి వరకు మహిళలకు లక్ష చట్టాలున్నాయి కాని వాటి అమలులో ఉన్న నిర్లక్ష్యం మరే ఇతర చట్టంలో ఉండవు. ఉదా: వరకట్న నిషేదపు చట్టం ఉంది కాని దానిని అమలు చేయల్సిన పోలీసులు, లాయర్లు, రాజకీయ నాయకులు, ఎమ్.ఎల్.ఏ, మంత్రులు ఆకరికి జడ్జీలు కూడా వరకట్నాలను తీసుకుంటుంటే ఇంకా ఆ చట్టం ఎందుకు? వాటిని పక్కగా ఎవరు అమలుపరుస్తారు..? తల్లిదండ్రుల నుండి అబార్షన్లు చేసే డాక్టర్లు, స్కానింగ్ సెంటర్లు వాటిని పట్టించుకోని పోలీసులు, వారికి బుద్ది చెప్పలేని మంత్రులు వారిని నిలదీయయలేని మనం ఇలా అందరం ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మనమందరం కలిసి చంపేస్తున్నాం..! పాప అని తెలియగానే అబార్షన్లు చేయించడమో, లేదంటే అమ్మేయడమో, రోడ్డు మీద వదిలేయడమో చేస్తున్నారు ఇంకా దుర్మార్గులు ఐతే పుట్టినతర్వాత కర్కశంగా చంపేస్తున్నారు.. ఒక కృర జంతువుల కన్న ఉన్మాదుల మధ్య ఆ రేపటి అమ్మ ఏలా బ్రతకగలదు ? అమ్మయి అనగానే ఒక నష్టం అబ్బాయి అనగానే ఒక లాభం ఇది పూర్వం నుండి ఇప్పటికి సమాజంలో ఉన్న తీరు. ఈ పరిస్థితిని భయపెట్టి, శిక్షించి ఏ చట్టం కూడా నిర్ములించలేదు.. అవగాహన కల్పించి మహిళలకు సరైన గౌరవం, న్యాయం వస్తే తప్ప రేపటి అమ్మ చనిపోదు.. ఆరోజుల కోసం మనందరం పాటుపడదాం..
