వయోలిన్..లేదా ఫిడేలు.! దీని మూలం సుమారు 16వ శతాబ్దం అయ్యుండవచ్చు గానీ భారతదేశానికి రావడానికి దీనికి మరో 300 ఏల్లు పట్టింది. ఇప్పుడు వయోలిన్ లేని ఏ శాస్త్రీయ సంగీత కచేరీని మనం అస్సలు ఊహించలేం. వయోలిన్ ప్రాముఖ్యత ఏంటి? వయోలిన్ తో సృష్టించినంత సున్నితమైన సంగీతాన్ని మరే సంగీత పరికరంతో కూడా అసాద్యమేనంటే అతిశయోక్తి కాదేమౌ..! రాక్,జాజ్ లాంటి వెస్టర్న్, వెస్టర్న్ క్లాసికల్ సంగీతమే కాక హిందుస్థానీ, కర్ణాటక సంగీతం లాంటి భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని కూడా వయోలిన్ తో సృష్టించడం, వాయించడం సాద్యం అవుతుంది. అసలు వాద్య పరికరాలతో శాస్త్రీయ సంగీతం అంటే వీణ, నాదస్వరం, వేణువు అని చెబుతారు (ఆ తర్వాతే వయోలిన్, మాండలిన్, శాక్సాఫోన్ లాంటివి వచ్చాయి).
పైగా శాంతరసము, శృంగారరసము, రౌద్రరసము లాంటి నవరస భావాలను వయోలిన్ తీసుకవచ్చినంతగా మరే సంగీత పరికరంతో కూడా సాధ్యం కాదు. అందుకే సినీ సంగీతం లో కూడా ఈ మద్య ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ విదేశీ సంగీత పరికరాన్ని! ముఖ్యంగా మన మనసు చికాగుగా, ఆందోళన గా ఉన్నప్పుడు వయోలిన్ సంగీతం ప్రశాంతత ను చేకూరుస్తుంది! ఆధ్యాత్మికత భావాన్ని కలగజేస్తుంది. అందుకే ఈ మద్య "మ్యూజిక్ థెరపీ" లో కూడా వాయులీనాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ సంగీతం లో వయోలిన్ ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు! మొదట కచేరీలలో గాయకులను అనుసరించడానికే పరిమితమైనా ఆ తర్వాత వయోలిన్ తో Solo గా కచేరీలు చేసేంత ప్రాముఖ్యతను కల్పించారు కొందరు మహా విద్వాంసులు..! వారిలో మన తెలుగు వారైన "ద్వారం వెంకటస్వామి నాయుడు" ఒకరు..! ఆయన్ని భారతీయ వయోలిన్ పితామహుడిగా పేర్కొంటారు. తెలుగు వారైనందుకు మనమంతా గర్వించదగ్గ గొప్ప కళాకారుడాయన. ఆయన గురించి కొన్ని విశేషాలు.
1. ఆయన బెంగుళూరు లో జన్మించారు,విశాఖపట్నం లో పెరిగారు, వెల్లూరులో తన మొదటి కచేరీ తో అరంగేట్రం చేశారు. ఇలా ఆయనకు ఆంద్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మూడు రాష్ట్రాలతో అనుభందం ఉంది.
2. దేశంలో వయోలిన్ తో మొట్టమొదటి సోలో కచేరీలు చేసింది "ద్వారం వెంకటస్వామి నాయుడు" గారే.
3. దేశవ్యాప్తంగా కచేరీలు ఇచ్చి "ఫిడేలు నాయుడు" గా ప్రసిద్ది పొందిన ఈయనను రవీంద్రనాద్ ఠాగూర్ లాంటి ప్రముఖులు కూడా కొనియాడారు.
4. సున్నితంగా, వినసొంపుగా అత్యధిక సమయం వయోలిన్ పై బో ప్లే చేయడంలో ద్వారం గారు నిష్టాతులు.
5. మొదట 1936 లో విజయనగరం లోని సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా నియమితుడై ఆ తర్వాత అదే కళాశాలకు ప్రదానోపాద్యాయుడయ్యారు.
6. ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలోని తప్పులు మీకు తెలుస్తాయి. రెండు రోజులు మానితే మీ సంగీతంలోని తప్పులు శ్రోతలకు తెలుస్తాయి - అని ఈయన చెప్పిన సూత్రాన్ని ఇప్పటికీ ఉదాహరణగా చెబుతారు విద్యార్థులకు.
7. పద్మ పురస్కారం అందుకున్న మొదటి సంగీత కళాకారుడు "ద్వారం" గారే..1957లో ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది. ఆయన జ్ఞాపకార్ధం తపాళా శాఖ స్టాంప్ ను కూడా రిలీజ్ చేసింది.

