మనకు తెలిసిన చరిత్రలో చెప్పిన దాని ప్రకారం ఆంగ్లేయుల పై జరిగిన తొలి సిపాయుల తిరుగుబాటు 1857 లో జరిగింది. కాని దీనికి సరిగ్గా పదేళ్ళ ముందె ఉయ్యాలవాడ నరసింహరెడ్డి ఆంగ్లేయుల అనిచివేతపై సమర శంఖం పూరించాడు, సామ్రాజ్యవాదులకు సవాలు విసిరాడు ప్రాణాలువొడ్డి పోరాడాడు. బ్రిటీష్ వాళ్ళ మీద తిరగబడ్డ మన తెలుగు తేజం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడలో జన్మించారు. తన తండ్రి పెద్దమల్లారెడ్డి తన తాత జయరామిరెడ్డి కోలికుంట్లకు పాలేగాళ్ళుగా ఉండేవారు. వీరికి 2000 సైన్యం ఉండేది వీరి ఆదీనంలో కడప, కర్నూలు, అనంతపురం, బెళ్ళారి జిల్లాలో 66 గ్రామాలు ఉండేవి. పాలేగాళ్ళు అనగా వీళ్ళు ఒక ప్రాంతానికి మకుటం లేని మహారాజులు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల రక్షనను వారే చూసుకునే వారు, మొదట్లో బందిపోట్ల నుండి దరి ప్రజలను రక్షించి ఆ ఊరికి రక్షన కవచంలా ఉండేవారు. అప్పట్లో రాయలసీమలో 80 మంది పాలేగాళ్ళు ఉండేవారు. వారసత్వంగా ఉయ్యాలవాడ నరసింహరెడ్డికి ఆ గ్రామాలు సంక్రమించాయి.
నిజాం రాజులు అప్పటికే రాయలసీమ మీద పట్టు సాధించారు, కర్ణాటక రాజుల నుండి యుద్ధభయం వలన వారిని వోంటరిగా ఎదురుకోవడం సాధ్యంకాదని గుర్తించి బ్రిటీష్ వారీ సైన్య సహకార పద్ధతికి తలొగ్గి వారికి రాయలసీమను ధారాదత్తం చేసారు. బ్రిటీష్ వారి పాలనలో పాలేగాళ్ళకు అక్కడి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి, పన్నులు కుడా బ్రిటీష్ వారికే చెల్లించే వారు. పాలేగాళ్ళను అనిచివేయడానికి బ్రిటీష్ వారు అనేక వ్యూహరచనలు చేసి వారిని సాయుధ ముఠాలుగా చిత్రీకరించి పాలేగాళ్ళ పతనానికి నాంది పలికారు.
బ్రిటీష్ వారి ఆగడాలను చూసిన ఉయ్యాలవాడ నరసింహరెడ్డి వారి మీద యుద్ధం చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఆ అవకాశం రానే వచ్చింది. శిస్తు రూపంలో వసూలు చేసిన సొమ్ముని తహశీల్దారుకు కట్టి తన వాటాను తీసుకురమ్మని తన దళారిని పంపాడు నరసింహరెడ్డి. ఆంగ్లేయుల అండ చూసుకొని తహశీల్దార్ ఎవరిని లెక్కచేసేవాడు కాదు, నరసింహరెడ్డి మా దెగ్గర బంటు అలాంటిది ఆ బంటుకి ఇంకో బంటా అని అవమానించి పంపించాడు. దీంతో ఆగ్రహం చెందిన నరసింహరెడ్డి తహశీల్దారు మీద దాడి చేసి తల నరికి అక్కడ ఉన్న పోలీసు బలగాలని హతమార్చి ప్రకాశం జిల్లా కంభం వైపు సాగాడు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన బ్రిటీష్ జనరల్ అప్పట్లొనే నరసింహరెడ్డి ఆచూకి తెలిపిన వారికి 5000 తల తెచ్చిన వారికి 2000 ప్రకటించారు. దింతో ఆగ్రహం చెందిన నరసింహరెడ్డి గిద్దలూరులో బస చేసిన బ్రిటీషు సైన్యాన్ని మట్టికరిపించి వారికి కొరకరాని కొయ్యలా తయారయ్యడు. ఒక రాత్రి పూట నరసింహరెడ్డి స్ధావరం మీద దాడి చేసి దొంగదెబ్బ తీసి ఆయన్ని ప్రాణాలతో పట్టుకుంది, ఇనుప సంకెళ్ళతో బంధించి వీధుల్లో ఊరేగించి ఇక ఎవరు అలా బ్రిటీషు వారి మీద తిరగపడకుండ హెచ్చరించారు.
నరసింహరెడ్డి మీద అనేక ఆరోపనలు నేరాలు మోపి ఉరిశిక్ష విధించింది, ఫిబ్రవరి 22, 1847 న బహిరంగంగా ఉరి తీసి నరసింహరెడ్డి తలను కోటగుమ్మానికి వేలాడదీయించారు. 2011 లో ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కధని చిరంజీవి తన 150వ చిత్రంగా తీస్తున్నారని వార్తలు ప్రచారం జరిగాయి, చివరికి అవి ప్రచారాలుగానే మిగిలాయి.
Source: 10TV