నాలుగు వేదాలలో ని ఒకటైన ఋగ్వేదం లో ఒక సూక్తం ఉంది.
"ఇంద్రం మిత్రం వరుణం అగ్ని మాహుహుఔతో దివ్యహ –సుపర్ణో గరుత్మాన్
ఏకం –సత్ విప్రా బహుదా వదంతి అగ్నిం –యమాన్మాత రిష్వా న మాహుహు "
భావం:
ఈ సత్యా న్ని ఇంద్ర ,మిత్ర ,వరుణ ,అగ్ని ,సుపర్ణ ,ర్ణయమ ,మాత రిశ్వ అంటే వాయువు గా పిలుస్తారు. కానిసత్యం ఒకటే .వివిధ నామాలతో పిలువ బడుతోం ది .ఈ ఏకీకృత శక్తి నే వేదం ‘’సత్ ‘’అన్నది. అందుకే వేదం‘’ఏక మేవా ద్వితీయం బ్రహ్మ ‘’అంటే సృష్టి కర్త ఒక్కడే .రెండవదైన వేరొక శక్తి అంటూ ఏదీ లేదు అని అర్ధం .
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో శాశ్వతంగా నిలిచే వాటిని పంచభూతాలు అంటారు. కానీ అవన్నీ ఒకటే.. వాటి వివిధ రూపాలే అని, వేదాలు ఎందరో జ్ఞానులు తత్వ వేత్తలు చెప్పారు.. ఇలా ఒక తత్త్వాన్ని (philosophy) మూలంగా తీస్కుని వచ్చే సినిమాలని ఫిలాసఫీ ఫిక్షన్ (philosophy fiction) అంటారు. తెలుగు లో చాలా అరుదు గా వచ్చే ఇలాంటి సినిమాలలో ఒకటి ఏకం.
డ్రీమెషిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో, గ్లోబల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డ్స్ గెలుచుకుంది ఈ సినిమా. ఈ నెల 29 న విదూడలైన ఈ సినిమా చాలా మంచి ప్రశంసలను అందుకుంటోంది.
మనలో అయిదు రకాల మనుషులు ఉంటారు. ప్రపంచం లో మార్పు కి కారణమయ్యి, ఆ మార్పు లో భాగం అవ్వాలి అనుకునేవారు కొందరుంటారు. ఈ ప్రపంచం జరిగేవి జరుగుతుంటాయి వాటి ని అలానే ఉండనివ్వాలి అని కొందరంటారు. ఈ ప్రపంచం లో జరిగేదంతా మాయ అనుకునేవారు కొందరు. ఈ ప్రపంచం, సమాజం గురించి భయపడుతూ ఉండేవాళ్ళు కొంతమంది, ఈ ప్రపంచం నన్ను చూసి భయపడాలి అనుకునేవాళ్లు కొంతమంది. ఇలా అయిదు రకాల మనుషులను, పంచభూతాలతో అన్వయిస్తూ.. ఈ కథ రాసుకున్నారు, దర్శకుడు వరుణ్ వంశి.
అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, అదితి మ్యాకల్ ముఖ్య పాత్రధారులుగా చేసిన ఈ సినిమా లో, తనికెళ్ళ భరణి గారు ఒక ప్రధాన పాత్ర పోషించారు. తక్కువ బడ్జెట్ లో తీసిన ఈ సినిమా కోసం, భరణి గారు నిజమైన స్మశానం లో ఈ పాత్ర ని పోషించారు. ఆయన చెప్పిన కొన్ని డైలాగ్స్ ఎంతో లోతు గా ఉంటాయి. ఈ సినిమాల లో ని ఎక్కడి మానుష జన్మం అనే అన్నమయ్య కీర్తన ఉంటుంది.. ఆ పాట కూడా వినడానికి చాలా లోతైన అర్థం తో ఉంటుంది..
మనిషి గురించి. జీవన విధానం గురించి ప్రశ్నించే తత్వాలు ఎన్నో, మన లో ఉన్న చెడు ని మంచి వైపు కి మార్చే సాధనాలు ఇవి. ఎవరు ఏ భాషలో ఏ విధంగా చెప్పిన అందరూ చెప్పే వాటికి అర్థం ఒక్కటే. అన్ని ఒక్కటే, అందరు ఆ ఏకం లో నుండి పుట్టిన వాళ్ళమే, అక్కడే ఏకం అవ్వాల్సిన వాళ్ళమే అని.. అలాంటి తత్త్వాలని ఎందరికో చేరువ చెయ్యదానికి ప్రయత్నంగా నిలిచినా ఈ సినిమా కి తగినంత గుర్తింపు రావాలి.