Contributed By Krishna Prasad
గోదావరి నిజంగా ఈ పేరులోనే ఎదో ఒక తెలియని మత్తుందండి... మీరు చెపితే నమ్మరు గాని మన గోదారోల్ల మాటల్లో ఎంత ఎటకారం వుంటుందో వాళ్ల మనసుల్లో అంతకు మించి మమకారం ఉంటుందండి ఆయ్... నమ్మరా అండి! అయితే మీకు తెలిసిన చుట్టాలు గాని, స్నేహితులు గాని గోదావరి జిల్లాలో వుంటే ఒకసారి ఏళ్ళిరండి మీరే అంటారు.. అయ్ !బాబోయ్... ఈ గోదారోల్లు చాలా గొప్పోల్లండి బాబు అని. అలాగే మీరు వెళ్ళినప్పుడు ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ గొట్టం కాజా, రాజమండ్రి గంగరాజు పాలకోవా ఇలా ప్రతి ఊర్లో నోరూరించే వంటకాలను రుచి చూడటం మర్చిపోకండి. ఈ ఊసులన్ని కూసేపు పక్కన పెడితే మన "తూర్పు గోదావరి" జిల్లాలో... మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాల్సినవి కొన్ని ముఖ్య ప్రదేశాలు ఉన్నాయి అవి ఏంటంటే....
1. కోరంగి మడ అడవులు - కాకినాడ
2. రంపా, జలతరంగి జలపాతాలు - మారెడుమిల్లి
3. అన్నా చెల్లెళ్ల గట్టు - అంతర్వేది
4. దిండి రిసార్ట్స్
5. ధవళేశ్వరం బ్యారేజ్
6. పింజరి కొండ జలపాతాలు
7. సిరివాక వెదురు పాకలు - పాపికొండలు, కొల్లూరు
8. చించినాడ బ్రిడ్జి
9. గోదావరి బ్రిడ్జి
10. ఉప్పాడ బీచ్
ఇవే కాకుండా ఇంకా చాలా ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయండీ ఆయ్... Image Source : Google