Contributed By Sunil Kotagiri
“Leadership is about standing for the last person in the organization” ఈ కోట్ ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. బహుశా ఇది కిరణ్ బేడి ట్వీట్ చేయడము వలన ఏమో.ఆమెను నేను చాలా విషయాలలో స్ఫూర్తిగా తీసుకుంటాను కనుక, అది అంతగా నచ్చడంలో ఆశ్చర్యము లేదు.అలా నా మోబైల్ లో ట్విట్టర్ పేజును పైకి క్రిందకి జరుపుతూ సకలజనాలభిన్నాభిప్రాయల్ని చదువుతూ సమయాన్ని వెల్లబుచ్చుతుంటె ఇంట్లోంచి పిలుపు వినిపించింది. ఆ ట్విట్టర్ చదివే కార్యక్రమాన్ని పక్కన పెట్టి లోపలికి వెళ్ళాను విషయం ఏంటో తెలుసుకుందామని.ఎవరో అతిధులు వస్తున్నారట మధ్యాహ్నం భోజనానికి.అందుకని కొన్ని కూరగాయలు తెమ్మని ఆ పిలుపు యొక్క సారాంశం.సరే అని చెప్పి, బట్టలు మార్చుకొని ఎప్పుడూ కూడా తీసుకెళ్ళే సరంజామా అంతా పాంట్ జేబులో తీసుకొని బయలుదేరాను.
అలా ఇంట్లోంచి బయటకు వచ్చి, మా కాలనీ రోడ్డు మీద నడుస్తూ పాత జ్ఞాపకాలలోకి జారిపొయాను.ఎంత పాతవి అంటే, మా కాలనీ మొదలయ్యిన సంవత్సరానికి, అంటే సుమారుగా ఇరవై సంవత్సరాల క్రిందట విషయాలన్నమాట.మా కాలనిలోకి వచ్చిన మొదటి నాలుగైదు కుటుంబాలలో మాది కూడా ఒకటి.అప్పట్లో చాలా తిరిగి,వెదికి,చివరగా ఈ చోటు అన్ని విధాలా అనుకూలంగా ఉండడముతో ఇల్లు కొన్నుకున్నాను.ఆ తరువాత కాలం అనుకూలించడముతో బాగా అభివృధ్ది చెంది ఇప్పుడు ఎటు చూసినా అపార్ట్ మెంట్స్ వచ్చి మా చిన్ని కాలనీకి సరిహద్ధు గొడలలా నిలిచాయి.
ఇదంతా ఒక వైపు అయితే, మరో వైపు మా కాలనీలో వెలసిన కిరాణా షాపు.అన్ని కాలనీల్లోలాగానే మా దగ్గర కూడా, మేము వచ్చిన రెండు మూడు సంవత్సరాలలోనే కిరాణ షాపు వచ్చింది.ఇంక అంతే, అదే మాకు పెద్ద సూపర్ మార్కెట్ అయిపోయింది.ఏమి కావాలన్న దొరికేవి మరియు అందరికి కూడా చాలా సౌలభ్యంగా ఉండేది.నాకు ఇంకా గుర్తు, ఆ కిరాణ షాపు యజమాని సుందర్, అందం నీ పేరు పేరునా గుర్తించుకొని పిలిచెవాడు.అతనికి సాయం చేయటానికి కూడా తెచ్చుకున్న మురళీ కూడా అంతే.వాళ్ళిద్దరు అలా కలిపి పనిచేసుకుంటూ ఉంటే ఎంతో చూడముచ్చటగా ఉండేదీ. ఇద్దరికీ ఏమీ బంధుత్వం లేకపొయినా ఒకరిని ఒకరు అంతకంటే ఎక్కువగా గౌరవించుకుంటూ పనిచేసుకొనేవారు.సుందర్ అయితే దాని తరువాత మా కాలనీలోనే ఇల్లు కూడా తీసుకొని ఆర్థికంగా బాగ బలపడ్డారు.ఈ మధ్యన గత రెండు సంవత్సరాలునుంచి నేను ఇండియాలో లెకపొవడంతో ఆ షాపుకు వెళ్ళడం అవ్వలేదు.ఈ రోజు ఏదో సమయంలో ఒక్కసారి వాళ్ళని కలిసి రావాలి అని అనుకొని కూరగాయల దుకాణం దగ్గరకు వచ్చి ఆగాను.ఇంట్లొ చెప్పిన నాలుగైదు కూరగాయల రకాలు ఒకటికి రెండుసార్లు బాగా వేరుకొని,పుచ్చులు వంటివి ఏమి లేవని నిర్దారించుకొని,అతనికి దబ్బులిచ్చి ఇంటికి తిరిగి బయలుదేరాను.
ఒక పది అడుగులు వేసి ఉంటానేమో.నేను ఎవరినైతే కలుద్దామని అనుకుంటున్నానో అనుకొకుండా అతనే,అదేనండీ మురళీ ఎదురుపడ్డాడు.అప్పటికీ,ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదు, అయినా(రెండు) సంవత్సరాలలో, అంత పెద్ద తేడాలేమి ఉంటాయిలెండీ నా పిచ్చికాని. నన్ను గుర్తుపట్టి ఆగాడు.నేను కూడ దగ్గరకు వెళ్ళి ఏమిటి మురళి ఎలా ఉన్నావు?చాలా రోజులయ్యింది నిన్ను చూసి కానీ మీ షాపుకి వచ్చి కాని.నా మాటను మద్యలొనే తృంచివేస్తూ అన్నాడు- నేను ఆ షాపులో చెయ్యడము లేదండీ!ఈ మద్యనే మానేసాను.అదేంటి మురళీ,సుందర్ కూదా లేడా ఏమిటి!సుందర్ ఉన్నాడు,కాని నేనే బయటకు రావలిసి వచ్చింది.
అది వినగానే నాకు ఏదోలా అనిపించింది. మురళి కూడా చాలా నిరాసక్తి తో ఆ మాట చెప్పినట్లు అనిపించింది. సరే విషయం ఏమిటో తెలుసుకుందాం ఏమైనా సాయం చేయగలుగుతాం ఏమో చూద్దామని...మురళి, అలా కూర్చుని టీ తాగుతూ మాట్లాడుకుందాం రా అని దగ్గర ఉన్న టీ షాప్ కి తీసుకెళ్ళాను. టీ త్రాగుతూ చెప్పు మురళి ఏమైంది? ఏమైనా గొడవ జరిగిందా మీ మధ్య అంటూ సంభాషణ మొదలు పెట్టాను.
మొదట కొంచెం సంశయించాడు కానీ చెప్పడం మొదలు పెట్టాడు. సందీప్ గారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ పెరిగిన తర్వాత మా షాప్ కి దగ్గరలోనే ఇంకొన్ని కొత్త కిరాణా షాపులు మొదలుపెట్టారు. అంతవరకూ అద్భుతంగా నడిచిన మా షాప్ కి గిరాకీ తగ్గడం మొదలు పెట్టింది. అందులోనూ ఆ షాపులో క్రొత్తవి ఇవ్వడంతో వాళ్లు పెద్ద జాగాలు తీసుకుని చాలా విశాలంగా షాపులు ఏర్పాటు చేయడంతో చాలా మంది కస్టమర్లు అటు వెళ్లడం ప్రారంభించారు. దీనితో చాలా ఇబ్బందికి అసహనానికి గురైన సుందర్ నాతో చాలా విసుగ్గా ఉండేవాడు.
ఒకరోజు నన్ను పిలిచి నువ్వు కస్టమర్స్ ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అందుకే మనకి బిజినెస్ పడిపోయింది. నాకు తెలిసిన స్నేహితుడి దగ్గర ఒక మంచి బాగా పని తెలిసిన వ్యక్తి ఉన్నాడు అతని ని తెచ్చి నీకు సహాయం గా పెడతాను. నువ్వు అతనికి అన్నీ నేర్పించి తే మన ముగ్గురం కలిసి మన షాపును మళ్లీ నిలబెట్టుకో వచ్చు అన్నాడు నాకు సరే అనిపించి అలాగే నండి సుందర్ గారు నేను తప్పకుండా అన్ని విధాలా కృషి చేస్తాను. నాకు మాత్రం మీరు మీ షాపు తప్ప ఎవరున్నారు అన్నాను. టీ త్రాగడం పూర్తిచేసి గ్లాసు పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టాడు. నేను అడిగాను మురళి ఏమైనా బిస్కెట్ తింటావా అని. వద్దు సందీప్ గారు ఇప్పుడే మీ తీసుకోండి అంటూ కంటిన్యూ చేశాడు.
నాకు పెద్దగా బిజినెస్ పరిజ్ఞానం లేకపోయినా ఒక అనుమానం వచ్చింది. ఇప్పుడు సుందర్ ఇంకొక కొత్త అతనిని తీసుకొస్తే అతనికి కూడా జీతం ఇవ్వాలి కదా. అసలే బిజినెస్ లేకపోతే బాధపడుతుంటే ఇది ఏ రకంగా సహాయపడుతుంది. ఖర్చులు ఎక్కువ అవ్వడమే గాని ఏమి ప్రయోజనం ఉంటుంది అని చాలా సార్లు నాలో నేనే తర్జనభర్జనలు పడ్డాను. కానీ ఆ రోజు రానే వచ్చింది. కొత్త అతను వచ్చాడు, అతని పేరు కార్తీక్. అతనితో ఒకటి రెండుసార్లు మాట్లాడేసరికి అనిపించింది అతను చాలా మాటకారి అని ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకట్టుకోగలడు. అది మా యజమాని సుందరి కీ బాగా నచ్చింది చెప్పాలంటే మా బిజినెస్ ఇంతకు ముందు కంటే పెరగడం ప్రారంభించింది.
నాకు కూడా నా అనుమానం నిజంగానందుకు సంతోషంగా అనిపించింది, కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కార్తీక్ వచ్చిన ఆరు నెలల తరువాత ఒకరోజు రాత్రి షాపు కట్టేసే ముందు సుందర్ నన్ను పిలిచాడు. మురళి ఇక నువ్వు వేరే ఉద్యోగం ఏమైనా చూసుకో బిజినెస్ పెరిగింది కానీ మీ ఇద్దరికీ జీతం ఇవ్వడం వలన ఏమీ మిగలడం లేదు. షాపు అద్దె కూడా పెంచేశారు. అది వినగానే నా కాళ్లు చేతులు స్పందించినట్లు అయింది. ఏమి మాట్లాడాలో ఒక్క నిమిషం అర్ధం కాలేదు లేని శక్తి తెచ్చుకుని సుందర్ తో అన్నాను నాకు ఇప్పుడు వచ్చే జీతం కంటే మరో రెండు సంవత్సరాల వరకు పెంచక పోయినా పర్వాలేదు నేను మీ తోనే ఉంటాను.
రెండు సంవత్సరాల తర్వాత బిజినెస్ వృద్ధి చెందుతుంది కాబట్టి అప్పుడు ఏమైనా వీలు కుదిరితే అప్పుడు పెంచండి. సుందర్ నా మాటను కొట్టివేస్తూ ఇప్పటికైతే వెళ్లిపోవాల్సిందే నువ్వు అన్నట్టు రెండు సంవత్సరాల తర్వాత అభివృద్ధి ఉంటే నిన్ను తప్పక పిలుస్తాను అని షాపు లైట్స్ ఆపి షర్టు దించే కార్యక్రమంలో పడిపోయాడు. అలాగా ఆ రోజు నుంచి నాకు ఆ షాపు తో బంధం తీరిపోయింది అని నిట్టూర్చాడు మురళి.
కార్పొరేట్ వరల్డ్ కి అలవాటు అయినా నాకు అది కొత్తగా అనిపించలేదు కానీ ఒక అనుమానం మాత్రం వచ్చింది. మురళి నీకు అతను ఇచ్చే జీతం అంత ఎక్కువ కాదని నాకు తెలుసు దాని వలన సుందరికి పెద్ద ఇబ్బంది కూడా ఏమీ ఉండదు మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్టు. మురళి లేవడానికి తయారవుతూ సందీప్ గారు నాకు తెలిసింది ఏమిటంటే సుందర్ నా కంటే మూడు రెట్లు ఎక్కువ జీతం ఇచ్చి కార్తీక్ ని తీసుకు వచ్చాడు కానీ సరిగ్గా ఆరు నెలలు కూడా తిరక్క ముందే కార్తీక్ తన జీవితం ఇంకా పెంచమని డిమాండ్ చేశాడట.
అప్పటికే అతని మీద బాగా గురి కుదిరింది ఉన్న సుందర్ అతనిని పంపించడం ఇష్టం లేక నన్ను పంపించేశాడు ఇది సందీప్ గారు జరిగిన కథ ఇక నేను బయలుదేరుతాను అండి ఇక్కడ దగ్గరిలోనే ఉన్న ఇంకో షాప్ లో జాయిన్ అయ్యాను అని వెళ్ళిపోయాడు మురళి.
మన దేశం కూడా మారిపోతుంది అభివృద్ధి చెందిన దేశాలలో లాగా ఆర్థిక విషయాలు మానవసంబంధాలను డామినేట్ చేస్తున్నాయి ఇందులో ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పలేము. కానీ జీవితకాలాన్ని అందులో ఒక వ్యక్తి పని చేసే కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే మన అవసరాలు ఉన్న ఆర్థిక వనరులు బేరీజు వేసుకుంటే ఇలాంటి విషయాలలో ఇంకా సున్నితంగా ఉండవచ్చునేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ టైం వృధా చేయకుండా ఇప్పుడే సుందర్ ని కలిసి మాట్లాడితే అతని ఆలోచనలు కూడా తెలుసుకోవచ్చు. అప్పుడు తీరికగా విషయాన్ని ఎనలైజ్ చేయవచ్చు అనుకుంటూ షాపు వైపు దారి తీసాను.
షాప్ దగ్గరికి వెళ్లి చూస్తే ఏవో కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి సుందర్ కూడా లేనట్లు ఉన్నాడు. షాప్ పెద్దగా మారలేదు గానీ నేమ్ ప్లేట్ మారినట్లు ఉంది. షాప్ కూడా కిరాణా షాప్ లా కనిపించలేదు. ఇలా నేను అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంటే హలో సార్ ఏం కావాలి అని అడిగాడు షాప్ లో నుంచి. ఆ ఏమీ లేదు ఇది వరకు ఇక్కడ సుందరి ఉండేవాడు కదా ఇప్పుడు లేడా అని అడిగాను. లేదు సార్ షాపు మేము కొనుక్కున్నాం అతను ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. అరే ఏమైంది అతనికి ఏమైనా కుటుంబ సమస్యలు వచ్చాయా అని అడిగాను. అదేం కాదు అండి అతను తెచ్చిపెట్టుకున్న అసిస్టెంట్ కబుర్లు చెప్పి అందర్నీ ఆకట్టుకునే వాడు కానీ ఎక్కువమంది కస్టమర్స్ వచ్చేసరికి అతను వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోయాడు సార్. దానితో వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ సమయం వెయిట్ చేయవలసి వచ్చేది. ఇది నచ్చక నెమ్మదిగా షాప్ కి రావడం తగ్గించేశారు తరువాత సుందర్ అతనిని మార్చాలని చూశాడు కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇక ఎక్కువ నష్టం భరించలేక షాప్ మాకు అమ్మేసి వేరే దగ్గరికి వెళ్లి పోయాడు, మేమేమో ఈ స్టేషనరీ షాప్ పెట్టాను కిందటి సంవత్సరం. ఓ అలాగా అని అక్కడి నుంచి బయలుదేరాను. నాది సహజంగానే ప్రతి విషయాన్ని దీర్ఘంగా ఆలోచించి, విశ్లేషించే మనస్తత్వం కావడంతో, దాని గురించి ఆలోచిస్తూ ఇంటి వైపు అడుగులు వేస్తున్నాను.
అప్పుడు గుర్తు వచ్చింది కొద్దిసేపటి క్రితం కిరణ్ బేడీ ట్వీట్ చేసిన కొటేషన్. లీడర్షిప్ అంటే ఆ సంస్థ ఉన్నంతవరకూ, అందులో ఉన్న ఆఖరి ఉద్యోగి వరకు వారి బాధ్యతలు తీసుకోవడం అన్నది. ఈ కాలంలో ఇది కరువైపోతుంది. భారతీయ సంస్కృతిలో ఒకరికి ఒకరు చేదోడువాదోడుగా ఉండడం అనేది మనం నేర్చుకున్నది మరియు అమలు పరిచింది. కానీ ఇప్పటి ఆలోచనా విధానం మారింది. సరిహద్దులు దాటి ప్రయాణాలు చేస్తున్న మనము కొత్త వాణిజ్య సంస్కృతికి బాగా అలవాటు పడుతున్నాము.
ఇక్కడ నా సంశయం ఒక్కటే మన సంస్కృతిని మరిచిపోయి ఈ వ్యాపార ధోరణి అలవర్చుకోవాలి లేక మన సంస్కృతిని గౌరవిస్తూ తగిన రీతిలో వ్యాపార వాణిజ్యాలు కొనసాగించాలా? ఏదైనా సంస్థ కానీ వ్యాపారం కానీ ఒకరి వలన అభివృద్ధి చెందవు. అలాగని అందరూ ఒకలా పని చేయలేరు ఎవరు నైపుణ్యాలు వారివి. ఆ రకంగా ఒక వ్యక్తిని అవసరం ఉన్నంత వరకు వాడుకొని వదిలేసే కంటే, వారిని మారిన అవసరాలకు తగ్గట్టు ఎలా వాడుకోవాలో కొద్దిగా ఆలోచిస్తే ఇలాంటి సమస్యలు ఉండవేమో. అలా అనుకుంటూ ఫోన్ చెక్ చేద్దామని ఓపెన్ చేసాను. స్క్రీన్ పైన ఒక అలర్ట్ కనిపించింది "major MNC has sacked 10000 employees." ఓ గాడ్ అని నిట్టూర్చి ఇంట్లోకి అడుగు పెట్టాను.