తెలుగు చదవటం రాకపోయిన, తెలుగు చదవటం తెలిసి వార్తా పత్రిక(వార్తా పత్రిక అనగా న్యూస్ పేపర్; దయచేసి మేము వార్త చదవం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి చదువుతాం అనే కుళ్ళు జోకులు వేయకండి) అయినా చదివే అలవాటు ఉన్న మన తెలుగు వాళ్ళందరికి తెలిసిన ఒక పేరు శ్రీధర్. ఆయన కార్టూన్ లలో ఎంత వ్యంగ్యం ఉంటుందో అంతే విషయం కూడా ఉంటుంది. ఈ మధ్య కాలం లో ఆయన వేసిన వాటిలోనుండి కొన్ని విషయం ఉన్న కార్టూన్ లు...అవే విషయాలపై మా తరహా స్పందనలు...
1. నల్ల ధనం పై ఎప్పుడూ ఏదో ఒక పార్టీ పోరాటం చేస్తూనే ఉంటారు కాని కేవలం వాళ్ళు ప్రతిపక్షం లో ఉన్నప్పుడు మాత్రమె.. ఎందుకంటే అప్పుడైతే ఏం చేసే అధికారం ఉండదు కదా!!!
2. ఇదీ ఇంజనీరింగ్ విధ్యార్ది గ్రహస్తితి.. ఇంజనీరింగ్ కాలేజీల పరిస్తితి....దేశం లోనే ఇంజనీరింగ్ కాలేజీల్లో మనమే నెంబర్ వన్ను(కాలేజీల సంఖ్య లోనే సుమా)!!
3. ప్రజల ఆరోగ్యం పై ప్రభుత్వానికి ఎంత భాద్యతో.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సరిగా ఉండదు కనుక ప్రవేటు కు వెల్లండని పరోక్షంగా ఇలా ప్రజలకి తెలియ చేస్తున్నారు... అర్ధం చేసుకోండయ్య.. వెళ్ళండయ్యా .. వెళ్ళ్ళండి !!!
4. ఇద్దరు మహిళల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావటం కన్నాకాలితో సూదిలో దారం ఎక్కించ్చటం చాలా తేలిక... అలాంటిది మహిళా బిల్లు మీద ఏకాభిప్రాయం అంటే మాటలా మరి...
5. పదేళ్ళు సొంత ఆలోచనలు అనిచిపెట్టి, వేరే వాళ్ళ మాటలే తనవి గా చెప్పటం అంటే ఘోర తపస్సు చేసినదాని కిందే లెక్క.... ఈయన మామూలు నాయకుడు కాదు...ఇదొ రకం (వ్యక్తుల గురించి వేయకూడదు అనుకున్నాం, కాని మన్మోహన్ గారు ఎవ్వరి మనోభావాలు దెబ్బ తీయరు కనుక వేద్దామని ధైర్యం చేసాం....)
6. మన నాయకులు ట్రెండ్ ఫాలో అయ్యే టైపు కాదు.. సెట్ చేసే రకం.. అవినీతి అంటే పదో పరకో వెనకెయ్యటం అనుకునేరు.. పరక కూడా మిగలకుండా పీల్చేయటం అన్నమాట...
7. అత్యాచారం అనే పదానికి పేటెంట్ కోసం తీవ్రం గా శ్రమిస్తున్నట్టు ఉన్నారు మనోళ్ళు....ఏం చేయగలం.. స్వతంత్ర భారతం బ్రదర్.. క్యాండీ క్రష్ రిక్వెస్ట్ లే ఆపలేం కదా ఇది ఈ దేశంలో.
8. అవునవును ఇవ్వన్ని అత్యవసరం కదూ... ఈ రోజుల్లో తిండి గూడు బట్ట కాదు అత్యవసరాలు, వై ఫై, లాప్టాప్, స్మార్ట్ ఫోన్ కదూ కావలసింది... అంతే అంతే !!
9. చాలామంది ప్రకారం మన దగ్గర చదువంటే జీవితం లో మొదటి ఇరవై ఏళ్ళు ఎదురు డబ్బులిచ్చే చేసే ఒక ఉద్యోగం మాత్రమె.. చదువు కి జ్ఞానానికి వ్యత్యాసం ఎప్పటికి అర్ధం అవుతుందో మనకు. ఆశకు కూడా హద్దు ఉండాలోయ్ అంటారా !!!
10. కప్పలకు పెళ్ళిళ్ళు, గాడిదలకు శోభనాలు, చెట్లకు శ్రీమంతాలు చేస్తే వర్షాలు ఎందుకు పడతాయ్ మాష్టారు... బుర్రలు గోద్రెజ్ లాకర్స్ లో భద్రం గా దాచినట్టు ఉన్నారే !!
11. ఏవండోయ్ ఇది విన్నారా..మన దేశం లో రైలు ప్రయాణాలను ప్రపంచం లోని అత్యంత సాహసోపేతమైన ఆటల్లో ఒకటి గా చేర్చటానికి సన్నాహాలు జరుగుతున్నాయంట !!
12. చరిత్ర లో స్వాతంత్ర పోరాటం గురించి చెప్పారు, పోరాటానికి కారణాలు చెప్పారు, ప్రాణాలు కోల్పోయిన వారి గురించి చెప్పారు.. కాని ఎవ్వరూ అసలు స్వాతంత్రం అంటే ఏంటో చెప్పలేదు.. తెలీక లేక తెలపటం ఇష్టం లేకా !? దీనికెవరు సమాధానం చెప్తారు మరి !?