కాళ్లకు చెప్పులు లేవు, దొక్కలో గింత బువ్వలేదు.. ఐనగాని వారిని ఎవరు నడిపించారంటే దుఃఖమే నడిపించింది!! గుండెల మీదున్న బాధలు, భయల కంటే మోస్తున్న లగేజీ పెద్ద బరువేమి కాదు!! ఇంటికెళ్లాక నీ పెళ్ళాన్ని, పిల్లొడ్ని తన్ని కోపం చల్లార్చుకో!! వందల కిలోమీటర్లు నడవలేక చెప్పులు చచ్చిపోయాయి, డాంబరు రోడ్డు అరికాళ్ళను కాల్చుతుంటే, మట్టిరోడ్డు వందల రౌతులతో అడుగడుగునా గుచ్చుతుంది. మట్టి రోడ్డుకు, డాంబర్ రోడ్డుకు అరికాళ్లను సమానంగా పంచాలి. వీళ్ళు కనీసం వీళ్ళ ప్రపంచంలోనూ హీరోలు కాదు, వీళ్ళు పనివాళ్ళు!! రేపటికోసం దాచుకోలేక ఏ రోజుకారోజు ఆహారం సంపాదించుకుని తిని బతికే అమాయకపు జంతువులు. వీళ్ళు చచ్చిపోయాకనే ఈ దేశపు అభివృద్ధి జరుగుతుంది, అంత వరకు మీ అభిమాన నాయకుల పరువు తీస్తూ ఉంటారు. ఛి ఛి ఏమ్ బతుకులు రా మీవి, వచ్చే జన్మలో ఐనా మా దేశంలో పుట్టి మా ఇజ్జత్ తియ్యకండి!! వలస కార్మికుల నడకపై ఆదేశ్ రవి గారు రాసి, పాడిన పాట ఇక్కడ చూడవచ్చు