(Contributed By Sai Kartheek)
సున్నిపిండి స్నానాలు, సున్నిత సావాసాలు కుంకుడు పళ్ళు, కుంకుమ బొట్లు
జీవితపు మొదటి రోజుల్లో అర్థం కాలే ఈ వ్యంగ్య విన్యాసాలు.
సరిగా ఆరవ తరగతి అనుకుంటా సరిపోల్చడం మొదలుపెట్టారు
పరిణితి దాటినా తరవాత పరిమితులెన్నో అడ్డొచ్చాయి
పద్ధతి గొడుగులో పెరగాలంటే పెద్దగా గొడవలు పెట్టరాదంట
మగవానితో మాట్లాడకూడదంట అటు వైపు చూపు తిప్పరాదంట
ఇన్ని రోజులు జాతి, కుల, మతలే భేద భారాలనుకున్నాను లింగభేదమే ప్రాముఖ్యమైన పనికిరాని బేధం
బడిలో కానీ, పనిలో కానీ పోలికేగా పోల్చడానికి
ప్రతి దినం ఏది చేతగాని ఆడపిల్లనేనని గుర్తుజేస్తున్నాయీ
పని లో పడి, కాలం మరిచి సాయం కాలం, రాతిరి ఆయే
గాలి తగ్గినది పయ్యకు గాయం అయినది
ఇక ఇంటికి నడకే దిక్కు త్రోవ దూరం బానే ఉన్న తోడు ఎవరు లేరని భయమూ ఉంది
ధైర్యం అంటబెట్టుకొని నగరం నిద్రిస్తున్న వేళ నడుస్తున్న నే నొంటరిగా
అమానుషం, అనుమానుషం, చుట్టూరా వెనక చూడలేదు, వణికి ఆగలేదు
గాలికి ఎదో గాయం అయినట్టు ఊపిరికేదో చిహ్నాలందే
నిశ్శబ్దపు వాహనాలు నా దిక్కుకే వస్తున్నాయి
కలుగలేదు ఈ భావన ఎప్పుడూ కదలలేదు ఆ చోటునుండి ఇప్పుడు
మాటలు వింటుంటే మగవారేనని మంది బానే ఉన్నారని అవగతమైంది
వేగం పెరిగిన పరుగులకి వివేకం తగ్గుతున్న నడకలు
ఉంగరాల జుట్టు మీద ఉడుంపట్టు పట్టినాడు
కంగారులో కళ్ళు తెరవాలి నోరు అరవాలే
లాగెను నన్ను సులువుగా లావుగా లేను అవునుగా
క్షణంలో వాహనం లోనికి క్షమాపణం అడగలేని చోటికి
శ్వాసలో ఆయాసాలు పలచబడిన ఆలోచనలు చమటలు చిమ్ముతున్నాయి చర్మం చమ్మబడుతుంది గుండె అంకెల ఆంక్షలు మించి కొట్టుకుంటుంది జుట్టుకు వేసిన జడ, చిక్కుముడై నొప్పితెస్తుంది
వణుకుతున్న వళ్ళుతో వినతి చేస్తున్న వనిత నేనని వయసు ఇరువదేనని వివాహం కాబోతోందని
వదిలి వేయాలనుకున్న విసుకు ఏదైనా చెంది
మత్తు ఏది ఇవ్వకుండానే వస్త్రాలపై శస్త్రచికిత్సలు
ఆగాలా, అడగాలా, అరవాల ఎంచుకునే స్వతంత్రం ఇవ్వక కళ్ళు మూసేసారు నోరు నొక్కేశారు చేయి కట్టేసారు
వంద వేగంలో వాహనం మొదలైంది చోటుతేలీదు చెప్పడానికి చాటుగా దాగి చూడడం తప్ప
ఆరుగురు పట్టే బండిలో తొమ్మిది మంది అరువుగా దొరికే వస్తువును నే కాదు అయినా ఇరుకుగా ఉంది, ఇబ్బందిగా ఉంది
ముప్పది నిమిషాల తరవాత వచ్చిందో స్థలం ముప్పేదో ముంచుకువచ్చిందని సూచించే వాత్సల్యం
ఎత్తుకు పోయారు అటుగా ఓ వైపుకి ఎత్తున ఉన్న ఆ ఇంటి పైకి
బరువే లేని బట్టలు భారం అయినాయి అప్పుడు(వాళ్లకి)
చేదు పెదవి రుచులని అనుభవిస్తున్నా జాతి నక్క నాలుకల స్పర్శను చవిచూస్తున్న
మహాభారతంలో పాంచాలికి శ్రీ కృష్ణుడు దిక్కైతే మన భారతంలో ఈ ఆళికి ఏ కృష్ణుడు దిక్కు
ఎదో మర్మం లోని దూరే నొప్పిగా ఉంది, నోరు మూసింది
మూడు రోజులు నిర్విరామం మిక్కిలి సమయం, ఎక్కిలి ఆగమనం
కడుపున తిండిలేదు కంట తడి ఆరలేదు
వరుసలు మరీనా మారని కార్యం
సాగె కొనసాగే కసిగా ఆ సఖ్యం
వాంగ్మూలం లేకుండానే విడుదల వచ్చినట్టు
సమరం ఓడిన స్వాతంత్రం సాధించినట్టు
బయటపడ్డా బలిగాక
ఇదంతా కథే వింటున్నట్టు కలే కంటున్నట్టు ఉంటే బాగుండేదేమో బాధుండకపోయేదేమో....