Here Are A Few Reasons Why LOVE Needs To Be Celebrated Unconditionally!

Updated on
Here Are A Few Reasons Why LOVE Needs To Be Celebrated Unconditionally!
(article by REJETI PRAVEEN KUMAR)

1. యెంత లేట్ అయినా...మనం ఇంటికొస్తామని, తనకి ఆకలేస్తున్నా అన్నం కూడా తినకుండా గుమ్మం దగ్గరే నిల్చొని మన కోసం వేచి చూసే అమ్మ. దెబ్బ మనకి తగిల్తే ...అదేమిటో నొప్పి అమ్మకి తెలుస్తుంది...! ఏదో ఒకరోజు బ్రహ్మ ని అడగాలి అనిపిస్తుంది... "సెలవే లేని ఆ జీవికి అసలు అలసటే రాకుండా ..ఎలా తయారు చేసావయ్యా?? ఓ పక్క రక్తం చెమటగా పోతున్నా....పట్టనట్టు పనిలో మునిగిపోయే అంతటి ఓపికను ఎలా ఇచ్చావయ్య?" అని (దేనికి సాటి రాని స్వచ్చమైన పిచ్చి ప్రేమ..అమ్మ ప్రేమ ఒక్కటే... )

2. మనం అడిగినప్పుడు మనముందు తిట్టేసినట్టు కనబడుతూ...అమ్మ దగ్గరకి వెళ్లి....వాడికి రేపు కాలేజీ కి వెళ్ళేప్పుడు ఇచ్చేయ్ అని..అమ్మ చేతిలో డబ్బులు పెట్టే నాన్న . (అసలు ఈ ప్రేమకు ఒక పేరు...గాని...అర్ధం గాని చెప్పడం చాలా కష్టం)

3. ఎప్పుడో ఊరు వెళ్తే గాని మనకి వాళ్ళు గుర్తుకు రారు!...ఎందుకో మనమంటే అంత పిచ్చి ప్రేమో వాళ్లకి...! మనకి యెంత వయసు వచ్చినా మన బుగ్గలు పట్టుకు నిమిరేసి...సంబర పడిపోయి...మనం వచ్చామని మనకి ఇష్టమైనవన్నీ చేసి తినిపించేస్తారు...మన నాయినమ్మలు, అమ్మమ్మలు...! (ఇది రుణమే తీర్చుకోలేని ప్రేమ)

4. రారా ! ఇలా వచ్చి నా పక్కన కూర్చో..! ఇప్పుడేం చదువుతున్నావు? అవునా? శభాష్....మన వంశం పేరు నిలబెట్టాలి...ఏమిటి? అర్ధమైందా? ఇగో ఈ వంద రూపాయలు ఉంచు... అని ఇచ్చే తాతయ్యలు అందరికి ఉంటారు.... (మనకి లేక కాదు...వాళ్లకి ఎక్కువ అయ్యి కాదు...! అంతకన్నా గొప్ప ఆశీర్వాదం మనకి ఏ గుడికి వెళ్తే దొరుకుతుంది?!..మనమంటే ఎదో గొప్ప వాళ్లకి... ఎదో ....! ఏదో తెలియని వెర్రి ప్రేమ...!)

5. వేళా పాళా ఉండదు..! విషయం ఏమి ఉండదు...! కాని నిత్యం ఏదో ఒక విషయం లో కొట్టుకోడమో..గొడవ పడటమో చేస్తుంటాం...! అన్న చెల్లి అక్క తమ్ముళ్ళు ..! గొప్పగా చెప్పుకుంటాం....మన ఫ్రెండ్స్ అందరికి ...రేయ్ చూడరా ....ఈ గిఫ్ట్ మా చెల్లి ఇచ్చింది ....మా వాచ్ అన్నయ్య కొని ఇచ్చాడు... అంటూ పిలిచి మరీ చూపించేస్తాం...! నిజానికి ఇంటి ఆడ బిడ్డకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తున్నప్పుడు కన్నవాళ్ళకి ఎలా ఉంటుందో గాని ఒక అన్నయ్యకి గాని తమ్ముడుకి గాన, అడిగి చూడండి...ఆ క్షణం వాళ్ళకి అసలు మనసులో ఎలా ఉంటుందో...ఒక కడుపులో ప్రాణం పోసుకుని ఒకే ఇంట పెరిగిన రెండు ప్రాణాలు ఇకపై ...ముందులా కలిసి ఉండలేమని తెలిసిన ఆ క్షణం ....ఆ ఫీలింగ్ వేరు అక్షరాల్లో చెప్పడం చాలా కష్టం భయ్యా..! (ఈ ప్రేమ ను పూర్తిగా దాచుకొను లేము...పూర్తిగా బయటకి చెప్పలేం....ఎప్పటికి....)

6. తను కట్టాల్సిన exam fees కి లాస్ట్ డేట్ కావచ్చు....! తనకంటూ లైఫ్ లో ఏదో ఒక గొప్ప డ్రీమ్ ఉండి ఉండచ్చు...అయినా ..."రేయ్ ముందు నువ్వు నోరు మూసుకొని ఈ డబ్బులు తీసుకో.."! అంటూ తనకన్నా ఎక్కువ నిన్నే నమ్మి నీకె పెద్ద పీట వేసి తనకోసం భద్రం గా దాచుకున్న డబ్బుని నీకు ఇచ్చేస్తాడు ఓ మిత్రుడు.

"నేనిది చెయ్యగలనా?" అనే అనుమానం నుండి "నువ్విది చెయ్యగలవు రా...." అన్న ధైర్యాన్న నమ్మకాన్ని మనలో నింపగల మిత్రుడు ఉన్న ఏంతో మంది మనలో ఉన్నారు.... ఇది ఒక ఉదాహరణ...మాత్రమే... తను బీద వాడే అయినా తన మిత్రులకు శ్రీమంతుడయిన ఇలాంటి స్నేహాన్ని చిన్ని విషయాలకు దూరం చేసుకున్న ప్రతి వాడు గొప్ప మూర్ఖుడే! వయసు, కులం ఎప్పటికి ఒక అడ్డంకి కాదు...స్నేహానికి.

ఒక నిముషానికి మనలో మనం గొడవ పడొచ్చు...కాని బయటోడు యెవ్వడు మన వాడిని ఏమన్నా అంటే...అస్సలు ఊరుకునే సమస్యే లేదు. "స్నేహం అనే బలమైన వంతెన పై ప్రయాణం చేసేవారికి భయం అనే మాటకి అర్ధం తెలియదు...అలాంటి ప్రేమాభిమానాలు ఉండే స్నేహం దొరికిన వాళ్ళు నిజమైన ధనవంతులు...అలంటి మంచి స్నేహాన్ని చేజేతుల దూరం చేసుకునే వాళ్ళు....నిజమైన బీద వాళ్ళు!"

అమ్మ...నాన్న..తోబుట్టువు....తాత అమ్మమ్మ..ఇంతేనా??? మిగతా బంధాల్లో ప్రేమ ఉండదా? అని ప్రశ్నిస్తే.....ఇన్ని చెప్పాక కూడా మిగిలిన బంధాలలో ప్రేమను అన్వేషించే ఆలోచన ఇంకా మీకు రాలేదా?అని నా జవాబు. ఇంతకన్నా ఎక్కువ చెప్తే కృష్ణ వంశీ సినిమా అంటారు....శ్రీకాంత్ అడ్డాలా కి శిష్యుడంటారు. ఎలా అనుకున్నా...పర్లేదు గురూ ఎందుకంటె... సినిమాలు చూసి మనుషులు కొత్తగా నేర్చుకోవట్లేదు... మనుషుల జీవితాల్లోంచే సినిమా కధలు పుడతాయి.

చివరిగా....

బంధాలు అనేవి మనం కొన్ని సృష్టించుకున్నవి కావచ్చు...కొన్ని దేవుడిచ్చినవే కావచ్చు....కాని దూరాల్ని మాత్రం మనమే పెంచుకుంటాం.... దూరం కావడానికి కారణాలని మనమే వెతుక్కుంటాం... మనం ఎక్కడో ఉండచ్చు....మనం ప్రేమించే వాళ్ళు..మనల్ని ప్రేమించేవాళ్ళు మన పక్కనే లేక పోవచ్చు...ఒక సినిమా చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గుర్తొస్తే...వాళ్ళని తలుచుకుని మన కంటి చివరంచు నుంచి వచ్చే రెండు కన్నీటి చుక్కలే అసలైన ప్రేమ!

"పిచ్చి పిచ్చి బంధాలకు ప్రేమ అని పేరు తగిలించి....లోకానికి ....నిజాలకి ....జనాలకి దూరంగా చీకటి దుప్పటి కప్పుకుని బ్రతికే బ్రతుకు ఒక బ్రతుకే కాదని, ఒక మనిషి జన్మ ఎత్తినందుకు నడవాల్సిన బాట ఇది కాదని తెలిసి తన దారిని మార్చుకున్న వాడు ధన్యుడు!"