ఇంట్లో ఉండి రెండు, మూడు Blankets కప్పుకున్నా కాని చలి తగ్గడం లేదేంట్రా బాబు అని అనుకుంటున్నాం.. అన్ని ఉన్నాకూడా మన పరిస్థితే ఇలా ఉంటే ఇంకా రోడ్డుప్రక్కన పడుకునేవారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. మనలో చాలామంది వారిని అలా చూస్తూ ఏమి చేయలేకపోతున్నామే అని బాధపడుతూ వెళ్ళిపోతామే కాని నిజంగా మన వంతు సహాయంగా ఏమి ఇవ్వలేకపోతున్నాం.

ఇదే అవస్థను హైదరాబాద్ మియాపూర్ లో ఇంజనీరింగ్ చదువుతున్న అమిత్ పాండే(21) చూశాడు.. ఎలాగైనా వీరికి సహాయం చేయ్యాలని అనుకున్నాడు. Pocketలో చూసుకుంటే Pocket Money చాలా తక్కువగా ఉంది. తన Friendsని అడిగినా గాని అదే Situation. ఇక లాభం లేదని తనతో పాటు తన 20మంది స్నేహితులతో కలసి రెండు గ్రూపులుగా కాలనీలలో Funds Collect చేయాలని అనుకున్నారు. అలా మియాపూర్ కి ఒక గ్రూప్, శేరలింగం పల్లికి మరో గ్రూప్ గా బయలుదేరారు.

డబ్బులడిగి ఇబ్బంది పెట్టడం కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న పాత న్యూస్ పేపర్లను వారిచ్చే విరాళంగా తీసుకున్నారు. మొదట Students ఇలా అడగడం చూసి వారు సంశయించినా గాని వారి ఆశయం నచ్చి పాత న్యూస్ పేపర్లను ఇవ్వడం మొదలుపెట్టారు. అలా రెండు గ్రూపులుగా రెండు ఏరియాలలో Collect చేసిన దాదాపు 1500 కేజీల పేపర్ మొత్తం అమ్మగా వచ్చిన డబ్బుతో పేదలకు Blankets అందించారు. గుర్తించిన 250 పేదలకోసం ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలని అమిత్ ఇంకా తన స్నేహితులు సిద్ధంగా ఉన్నారు.

కష్టాలు అని అనుకుంటాం కాని నిజానికి మనముంటున్న సమాజంలోనే మనం ఊహించలేనంత కష్టాలను అనుభవిస్తున్న వారు చాలామంది ఉంటారు. మనం వారి జీవితాలను మార్చలేకపోవచ్చు కాని వారు జీవితంలో అనుభవిస్తున్న కష్టాలకు ఆసరాగ సహాయం అందించవచ్చు. మన అనవసర ఖర్చులను తగ్గించుకుని చేసే కొంత సాయమైనా వారికెంతో ఆనందాన్ని ఇస్తుంది.. మాకోసం ఎవరో ఒకరు ఉన్నారనే భరోసనిస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.