Contributed by భరద్వాజ్ గొడవర్తి
పాప్ మ్యూజిక్ కోసం మ్యూజిక్ వెతికితే, చెవికి వినపడిన అమ్మ లాలి పాటలాగా ఎంత చక్కగున్నావే, ఓ పాట ఎంత చక్కగున్నావే..
తెలుగు పాటలోన తెలుగు వింటుంటే, అక్షరం గుండె పులకించినట్లు, ఎంత చక్కగున్నావే, ఓ పాట ఎంత చక్కగున్నావే..
ఐటెం సాంగ్ ల మధ్య, ఎంకి పాటలాగా, ఎంత చక్కగున్నావే..
చంద్రబోసుని పదరచనలాగా, ఎంత చక్కగున్నావే..
అనుభూతిలాంటి పాట అందించిన, dsp నవ్వులాగ, ఎంత చక్కగున్నావే..
...........
ఓ సుకుమారుని ఆలోచనవి నువ్వు, చదివిన జీవనం నుండి వచేసినావు, తెర పైకి దూకేసినావు ఎంత చక్కగున్నావే..ఓ పాట ఎంత చక్కగున్నావే..
చంద్రబోసుని కలానివి నువ్వు, సందర్భాన్ని గుండెలో నింపేసినావు, పాటకే ఊపిరి అందించినావు, ఎంత చక్కగున్నావే, ఓ పాట ఎంత చక్కగున్నవే..
తెలుగు తెరపైన నిన్ను దృశ్యంగా చూస్తుంటే, ఎంత చక్కగున్నావే..తెరకే అందాన్ని తెచ్చేస్తుంటే, ఎంత చక్కగున్నావే
అచ్చమైన తెలుగు పాట కోసం పరితపిస్తున్న, ఎనభైయేళ్ల ప్రాయం లాగ, ఎంత చక్కగున్నావే
పసిబిడ్డ పలికేటి మొదటి మాటలాగా, మొదటి మాటలోన అమ్మ నవ్వులాగ, ఎంత చక్కగున్నావే
..
అందమైన అక్షరాలకు, సొగసైన సంగీతం సమకూరుస్తుంటే, ఆడపిల్ల శ్వేతచ్చావాయువులాగ ఎంత చక్కగున్నావే...
అచ్చమైన పల్లెపాటకు, అందమైన దృశ్యరూపం తోడైతే, తడిసిన మట్టి సోయగంలా ఎంత చక్కగున్నావే..
పెద్ద స్టార్లు పాత్రల్లో జీవిస్తుంటే ఎంత చక్కగున్నావే..
గడిచిన కాలం తెరపై పాత్రవుతుంటే ఎంత చక్కగున్నావే..
......
పాప్ మ్యూజిక్ కోసం ఇమ్యూజిక్ వెతికితే, చెవికి వినపడిన అమ్మ లాలి పాటలాగా ఎంత చక్కగున్నావే, ఓ పాట ఎంత చక్కగున్నావే..