An Important Lesson That The Epic Ramayana Teaches Us!

Updated on
An Important Lesson That The Epic Ramayana Teaches Us!
(Written by విక్రం బొల్లం) రామాయణం అంటే పిడకల వేట అనుకునే వెర్రి వాడు కూడా, సీత దేవి ఆరోజు లక్ష్మణరేఖ దాటకపోయుంటే, బహుకాలిక చిక్కుల్లో పడుండేది కాదు అనే అంటాడు. కాని వాడికి ఏమి తెలుసు, ఆరోజు జానకి దేవి లక్ష్మణరేఖ దాటకపోయున్డుంటే, రాక్షస సంహరణ జరిగుండేది కాదు, వానరులు సైతం క్షత్రియుల్లా పోరాడగలరని తెలిసుండేది కాదు, ఆంజనేయుడు తన భలాన్ని తానే గుర్తించుండేవాడు కాదు, అహల్య శాపవిముక్తురాలు అయ్యుండేది కాదు, మ్రానులతో క్రూరమృగాలతో నిండిఉన్న పర్ణశాల పవిత్ర పున్యాక్షేత్రం అయ్యుండేది కాదు, రామనామము మహాసముద్రానికి వారధి అయ్యుండేది కాదు, కాయపుష్టిగల వాలి సైతం చిన్న బానానికి లోబడిపోగలడని తెలిసుండేది కాదు, ఇంకా నాకు గుర్తులేనివి, నాకు తెలియనివి ఎన్నో ఎన్నెన్నో! ఆ రోజు సీతాదేవి తెలియక చేసిన తప్పులోంచి అపారమైన ఒప్పులు పురుడు పోసుకున్నాయి! అందుకే తప్పు చేసానని బాధ పడకు. ఒక తప్పులోంచి అనంతమైన ఒప్పుల్ని పుట్టించే శక్తి మానవరూపం దాల్చిన నీకు మాత్రమే ఉంది. పడుతూనే నడక నేర్చుకున్నావ్, చెడుతూనే బుధి తెచుకున్నావ్. ఆకలి అంటే ఏంటో తెలియని వాడు ఆహారాన్ని ఆస్వాదించలేడు అదేవిధంగా ఓటమి తెలియనివాడు గెలుపుని అనుభవించలేడు. తప్పు చేయడానికి ప్రయత్నించకు, చేసిన తప్పుని వృధాగా పోనివ్వకు!