Contributed By Yeswanth Chinni
ఒక్కడై విద్యార్థి పదుల సంఖ్యలో నేర్చుకున్న సబ్జెక్టులు వందల సంఖ్యలో రాసిన పరీక్షలు వేల సంఖ్యలో హాజరు అయిన తరగతులు లక్షల్లో కట్టిన ఫీజులు ఒకరి కింద పనిచేయడానికి మాత్రమే పనికి వచ్చాయి.
ఇరవై ఏళ్ళు భుజాలు బలి అయిపోయేలాగా మోసిన బ్యాగులు ఆధునిక బానిసత్వానికి బలి కాకుండా కాపాడలేకపోయాయి. సమాజంలో ఆ నలుగురు ఏం అనుకుంటారో తెచ్చుకున్న మార్కులు సమాజం మార్పుకు కారణం అవ్వలేకపోయాయి.
బందువులలో పరువు కోసం తల్లిదండ్రులు రంకెలు వేస్తే వచ్చిన ర్యాంకులు, కాలేజిలో సీట్లు నిజమైన గమ్యాలకు అర్థం చెప్పలేకపోతున్నాయి. నీ బాగు కోసమే కదా ఈ మాట ముసుగులో కళ్ళు తెరిచి కన్న కలలకు తీరం తెలియకుండా చేస్తున్నాయి.
ఎత్తు అయిన అద్దాల భవనాల మధ్యలో ఉన్నతమైన ఆలోచనలు అంతం అయిపోయాయి కష్టం చేసి కడుపు కట్టుకొని కాలేజీకి కట్టిన డబ్బులు ఆ డబ్బుల వడ్డీకి ఏ మాత్రం సరిపోని నెల జీతం ముందు జీవిత ఆశయాలు చచ్చు పడిపోయాయి.