మీరెప్పుడైనా Push-ups చేశారా..? మన Body weight లో ఉన్న కొంత బరువును బలంగా ఉన్న రెండు చేతులతో లేపడానికే చాలా అవస్థ పడుతుంటాం. నిజానికి శరీరంలో కొంత బరువును లేపడమే ఇంత కష్టంగా భావిస్తే శరీర బరువు మొత్తం ఒంటి కాలితో మోస్తూ 1.89 మీటర్ల ఎత్తుకు ఎగరడమంటే మాటాలా..? కాని ఇది ఒక వికలాంగుడు సాధించాడు.. ఈ ఘనతకు అతను ఎంత కష్టపడి ఉంటారు.. ఆ అంగవైకల్యంతో బాధను ఓర్చుకుని పారాలింపిక్స్ లో బంగారు పతకం సాధించి దేశ జెండాను ప్రపంచస్థాయిలో రెపరెపలాడించిన కటిక పేద అథ్లెట్ "మరియప్పన్ తంగవేలు" తన ఓటమిని ఎలా ఓడించాడో తెలుసుకుందాం..
తంగవేలుది మన తమిళనాడు రాష్ట్రం సాలెం నుండి 50కిలోమీటర్ల దూరంలోని పెరియావడంగట్టి అనే ఒక పల్లెటూరు. పుట్టుకనుండే తంగవేలు వికలాంగుడు కాదు, పోలియో ద్వారా కూడా ఇది సంభవించలేదు.. తనకు 5 సంవత్సరాల వయసులో రాంగ్ రూట్ లో వచ్చిన ఒక బస్సు అతని కుడికాలు మీదనుండి పోవడంతో అతను వికలాంగుడు అయ్యాడు. చిన్నప్పటి నుండే ఆటల్లో చురుకుగా ఉండే తంగవేలు ఒక కాలు ఆసరా లేకపోయినా తనలోని ఆటలపై ఉన్న మమకారాన్ని పొగొట్టుకోలేదు. "కొడుకు అలాంటి పరిస్థితిలో ఉంటే ఏ తండ్రైనా మానసికంగా ఆర్ధికంగా అండగా ఉండాలనుకుంటారు కాని మరియప్పన్ తండ్రి మాత్రం ఈ కష్టాలు ఈ కుటుంబం నాకు అవసరం లేదు అని ఇల్లు వదిలి పారిపోయాడు." కన్నతల్లే తంగవేలుకు అమ్మా నాన్న అయ్యారు. అమ్మలా బాగోగులు చూసుకుంటూ నాన్నలా కష్టపడి వీది వీది తిరుగుతు కూరగాయలు అమ్ముతూ నాన్నలా కష్టపడేవారు.
చిన్నప్పటి నుండి ఆటల్లో తంగవేలు ప్రతిభ కనబరిచేవాడు అందుకు అనుగూనంగా ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ తీసుకునేవారు. అలా కోచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో హైజంపింగ్ లో మెళకువలు నేర్చుకున్నారు. "ఈ ఆటల వల్ల మన కడుపు నిండుతుందా చదువుకుంటే ఏదైనా ఉద్యోగం దొరుకుతుందని తల్లి ముందు నచ్చచెప్పినా" తంగవేలు మాత్రం 'లేదమ్మా నేను ఖచ్చితంగా స్పోర్ట్స్ లో ఉన్నతమైన స్థాయికి ఎదుగుతా నీకు దేశానికి మంచిపేరు తీసుకువస్తా అని చెప్పేవారు."మొదట తల్లి కాస్త భయపడ్డా తర్వాత కొడుకు ఆత్మవిశ్వాసం ముందు తన అపనమ్మకం తొలగిపోయింది." అలా కొడుకుకోసం ఎంతో కష్టపడ్డారు కొన్ని సంవత్సరాల క్రితం తంగవేలు అనారోగ్య సమస్యలకై తన స్థాయికి మించి 3 లక్షల వరకు అప్పు కూడా చేశారు. "పేదవానికి కష్టమే ఆస్థి, పట్టుదలే వెన్నంటి ఉండే వెలకట్టలేని స్నేహితులు" అన్నట్టుగా తంగవేలు ఈ పారాలింపిక్స్ కోసం విపరీతంగా కష్టపడ్డారు ఒంటి కాలితో ప్రాణాలకు తెగించి చేసిన పోరాటానికి ఆ దేవుడు కూడా అడ్డురాలేదు..! సెప్టెంబర్ 9న జరిగిన ఫైనల్స్ లో 1.89 మీటర్ల హై జంప్ చేసి భారతదేశం తరుపున స్వర్ణ పతకం సాధించారు.
120 కోట్ల భారతీయులలో ఒక్కరు కూడా ఒలంపిక్స్ లో బంగారు పతకం గెలుచుకోలేరా అన్న ప్రశ్నలకు ఈ తంగవేలు ఒక బలమైన సమాధానంగా నిలిచారు. 21 సంవత్సరాల తంగవేలును ఇప్పుడు సాధారణ పౌరుడు దగ్గరి నుండి భారత రాష్ట్రపతి వరుకు ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన 2కోట్ల బహుమానంతో తన జీవితం మారిపోయింది. ఐతే మిగితా అథ్లెట్లకి మన తంగవేలుకు ఒక చిన్న తేడా ఉంది.. "రియో ఒలంపిక్స్ లో పతకాలు గెల్చుకున్న క్రీడాకారులందరికి స్వచ్చంద సంస్థలు, రాష్ట్రప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలు, వివిధ వ్యక్తులు కోట్ల రూపాయల ఆర్ధిక ప్రోత్సాహకాలు అందించాయి కాని వారిలో దాదాపు ఏ ఒక్కరు కూడా డొనేషన్ల రూపంలో ఏ ఒక్కరికి సాయం అందించలేదు..! కాని మన తంగవేలు మాత్రం తను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో వసతులకై 30 లక్షల రూపాయలు విరాళం అందించారు" ఈ ఒక్క ఉదాహరణ చాలు ఇక్కడ వికలాంగులు తంగవేలా..? లేక మిగితా వారా అని చెప్పటానికి..!
కొడుకు అవిటితనం చూసి ఎక్కడ పోషించాల్సి వస్తుందో అని భయపడి పారిపోయిన తాగుబోతు తండ్రి ఇప్పుడు భారతదేశమంతా తంగవేలుని గౌరవిస్తుంటే ఆయన ప్రస్తుత ఆలోచన పరిస్థితి ఎలా ఉందో...?!
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.