(Contributed by విక్రo బొల్లo)
నీ కాళ్ళపైన నువ్వు నిలపడాలి అని దేవుడు చెపితే, మోకాళ్లపైన నీ కొండ ఎక్కుతాను నేను అడిగింది ప్రసాదించు అని వేడుకునే అవివేకం నీది.
అంతా నీ అరచేతిలో ఉంది అని దేవుడు చెపితే, అరచేతిలో కర్పూరం వెలిగించి నీకు హారతి ఇస్తాను నన్ను గొప్ప వాన్ని చేయు అని కోరుకునే వెర్రితతనము నీది.
నీ మంచి కోరే స్నేహితుణ్ణి నమ్ముకో అని దేవుడు చెపితే, లేదు నేను చిలక జోతిశ్యమ చెప్పే వాడి మాటలే నమ్ముతాను అనే మూర్కత్వము నీది.
ఆకలి విలువ తెలుసుకో అదే జీవిత సూత్రాన్ని నేర్పిస్తుoది అని దేవుడు చెపితే, నీకోసం ఉపవాసం ఉంటాను నన్ను ఉద్దరిoచు అని అనేoత అనాలోచిత తత్వము నీది.
నీ బార్యని బాగా చూసుకో అని దేవుడు చెపితే, నా బార్యని బలి ఇస్తాను నాకు లంకె బిందెలు ప్రాసాదిoచు అని వేడుకునే దేబె నీది.
దేవుడంటే మనకి మంచి, చెడులు నేర్పే గురువు. వివేకం తెలిసిన జీవి ఒకటి భూమిపై ఉండాలనే ఉద్దేశముతో నిన్ను సృజిoచాడు. లేదా కుక్కవో, నక్కవో అయ్యి పుట్టుoడేవాడివి. త్రేతాయుగములోని మనుషులకి, యోగ్యమైన జీవితం ఎలా గడపాలో చూపించి, తప్పు చేసిన వాడిని హతమార్చడానికి ఒక రాముడు పుడతాడు అని నిరూపిoచేదే రామావతారo! ద్వాపర యుగములో, గీతోపదేశo చేసి మానవ విలువలను పెంచింది కృష్ణావతారo! కలియుగ మనుషులకు జీవన పటము చూపించింది, వెంకటేశ్వర అవతారo!
దేవుడంటే నీకు వరాలు ప్రసాదించే యంత్రము కాదు. నీకు జీవన మార్గము చూపించే పటము. అగనిత పాపాలు చేసి, పన్నెండేoడ్లకి ఒకసారి వస్తున్న పుష్కరాలలో స్నానము చేస్తే, చేసిన పాపాలు అన్నీ పోతాయి అనుకుoటే, పైనుండి చూసే దేవుడు నీలా వెర్రి వాడు కాదు. దేవుడినే గందరగోళపరిచిన నీ వెర్రితనాన్ని కొలిచే కొరముట్టు లేదు. ఈ సమాజానికి కావాల్సింది నువ్వు కాదు, ఈ కూపస్దమండూక జీవన శైలికి స్వస్ది చెప్పే అభినవ శ్రీ శ్రీ లు.
వాళ్ళు పుట్టాలని కోరుకుంటూ, పుడతారని ఆశిస్తూ!
Why did GOD Make You a Human Being and Not Any Other Living Being?
