This Letter To Chiranjeevi From A Hardcore Fan Will Surely Make You Emotional!

Updated on
This Letter To Chiranjeevi From A Hardcore Fan Will Surely Make You Emotional!
Contributed By Srinivas Bathini ఏం రాసినా ఓం రాసి మొదలెట్టమంటారు పెద్ద్దలు, అలాగే ప్రపంచంలో ‘సినిమా’ అనేది ఒకటి ఉందని నాకు ఓం రాసి పరిచయం చేసింది మాత్రం అన్నయ్యే, ప్రపంచాన్ని అమ్మ పరిచయం చేసినట్టే, సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసింది, కొంతమందికి దాన్ని పిచ్చిగా మార్చేసింది మాత్రం అన్నయ్యే... చిన్నపుడు కాస్త కుప్పిగంతులు ఏసినా, చిన్నపాటి డాన్స్ లు ఏసినా, ఎవడితో అయినా దెబ్బలాడటానికి వెళ్ళినా... అందరూ ఒకే మాట “నువ్వేమైనా పెద్ద చిరంజీవి అనుకుoటుoన్నావారా?” ఎవరీ చిరంజీవి?? ఇంకా సరిగ్గా ఊహ కూడా తెలీని time, చిన్నపుడు ఒకరోజు అమ్మ, నాన్న ఆటో లో ఎక్కడికో వెళ్తున్నారు, tickets దొరుకుతాయో లేదో అని వాళ్ళు tension పడుతున్నారు, తొందరగా పోనీ అని ఆటో వాణ్ని తొందర పెడుతున్నారు, అరుపులు, కేకలు, ఈలలు, గోలల మధ్య ఎలాగోలా లోపల enter అవటం అంతా తెలీకుండా జరిగిపోయింది. లోపల Hall లో అయిదు వందల మంది, screen మీద ఒక్కడు... ఆ ఒక్కడు కనిపించిన ప్రతిసారి అవే అరుపులు, అవే కేకలు. ఆరోజు అర్ధమయింది ఆయన పేరు చిరంజీవి అని, ఆ అరుపులు, కేకలకి కారణం అభిమానం అని, ఆ 500 ల మంది ఆయనకీ fans అని, ఆ క్షణం నుండి నేనూ అందులో ఒకడిని అని. త్రివిక్రమ్ గారు చెప్పినట్లుగా 150 సినిమాల వల్ల అన్నయ్య ఇచ్చింది కేవలం ఆనందం మాత్రమే కాదు, జ్ఞాపకాలు. అందరికీ అవి కేవలం సినిమాలు మాత్రమే కావచ్చు, నాకు మాత్రం జ్ఞాపకాలు. ఒక్కటీ, రెండు కాదు... మర్చిపోలేనన్ని. life లో 1st time new year కి ఎవడు greeting card ఇచ్చాడో గుర్తులేదు కాని, ఆ card మాత్రం గుర్తుండిపోయింది... దాని మీద ఉంది అన్నయ్య ఫొటోనే. ఎవరెవరితో ఆడానో గుర్తులేదు కాని, చిరంజీవి 1000, బాలక్రిష్ణ 750, నాగార్జున 500, వెంకటేష్ 250... అని ఆడిన చీటీల ఆట గుర్తుండిపోయింది... అన్నయ్య పేరు వల్లే. inter లో hostle లో join అయ్యేవరకి తెలీదు వేరే హీరోస్ కి కూడా fans ఉంటారని, వాళ్ళతో చేసిన ప్రతి fan war గుర్తుంది... అన్నయ్య వల్లే. school, college లో ఏం చదువుకున్నామో గుర్తులేదు, కాని అప్పుడు కొట్టిన బుంకులు గుర్తుండిపొయాయ్... అన్నయ్య సినిమా release day ల వల్లే. twinkle twinkle little star, Chiranjeevi Mega star – పెద్దయ్యాక కూడా twinkle twinkle Rhyme గుర్తుండిపోయింది... అన్నయ్య వల్లే. మాకు ఇది 150 కాబట్టి స్పెషల్ కాదు, ఇందులో మీరు ఉన్నారు కాబట్టి స్పెషల్. hit, flop, remake, freemake ఏది అయితే మాకేంటి... అందులో మీరు ఉన్నంతవరకి. ఇంత చెప్పావు politics లో fail కదా, ఇంకా ఉందా ఆ అభిమానం అంటే... తెల్లవారకముందే, ఊపిరి కూడా ఆడని line లో నిలబడి, చిరిగిన చొక్కాలతో, లాఠీ దెబ్బలు తిని, సంపాదించిన ticket తో చూస్తే వచ్చిన అభిమానం అది, అంత ఈజీగా పోదు. ఈ generation పిల్లలకి చిరంజీవి అంటే తెలీకపోవచ్చు, వాళ్ళని ఇప్పుడు No1 హీరో ఎవరంటే ఒకరి పేరు చెప్తారు, Acting లో Best ఎవరంటే ఒకరి పేరు చెప్తారు, Fights లో Best ఎవరంటే ఒకరి పేరు చెప్తారు, Dance లో Best ఎవరంటే ఒకరి పేరు చెప్తారు... But ఒకప్పుడు వీటిలో ఏది అడిగినా ఒక్కడి పేరే చెప్తారు. ఇప్పుడు ఒక్కోదానికి ఒక్కొకరు ఉన్నారు, అప్పుడు అన్నిటికి Reference చిరంజీవే. అసలు చిరంజీవి అంటే ఏంటంటే? పాతికేళ్ళు opposite heros కి No1 position అనే thought కూడా రాకుండా చేసిన హీరో, ఒక పదేళ్ళు ఆ seat నుండి పక్కకి జరిగితే ఇప్పటికీ ఎవరూ కూర్చోలేకపోయిన position హీరో, పాటలని బ్రేక్స్ కింద వాడుకునే జనాల్నికేవలం పాటల కోసమే theatres కి రప్పించిన హీరో. Khaidhi 150 కి మేము just release date కోసమే waiting, result కోసం కాదు, దానితో మాకు అవసరం లేదు, talk తో సంబంధం లేదు. మాకు సినిమా ఎలా ఉంది అని కాదు, సినిమాలో ఎవరు ఉన్నారనేదే matter. life లో కొన్ని గుర్తుపెట్టుకోవల్సినవి ఉంటాయి, కొన్ని అసలు మర్చిపోకూడనివి ఉంటాయి, అందులో నాకు అన్నయ్య ఒకరు. చిన్నపుడు నాన్న తరువాత ఇంకో హీరో అంటే చిరంజీవే, For 90’s kids chiranjeevi is not just a hero, he is an emotion. twinkle twinkle little star, Chiranjeevi Mega star. East or west Chiranjeevi Best. (పదేళ్ళ ముందువరకి ప్రతి theatre బయట వినిపించిన ఈ నినాదం, ఈ Jan 11 కి మళ్ళి వినిపించబోతుంది) ఈ సంక్రాంతికి వస్తుంది just movie కాదు మా memories, అయినా... మా చిన్నతనం నడుచుకుంటూ మళ్ళీ theatres కి వస్తుంటే, ఎగబడి వెళ్ళిపోతాం కాని talk కనుక్కుని వెళ్తామా. Thank you for the memories అన్నయ్య... love you always... Jai Hindh. Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.