Thanos last year release ayina Avengers Infinity War movie lo Villain. Oka Super Hero character ki yentha fan base vuntundho.. antha (anthakante yekkuva) fan base ni sampadhinchukunna Super Villian character ee Thanos. Marvel Cinematic Universe lone athi peddha, goppa villain ithanu. Peru ki antagonist ae kaani thanaku konni siddhanthalu, emotions vunnai...ave aa character ki Cult following ni tecchai... ala Thanoes fans lo okaraina oka writer thama Thanos gurinchi cheputhu Avengers ki Avengers fans ki raasina note ae idhi... P.S: Avengers End Game kosam marana waiting ikkada.
తండ్రి ప్రేమకి నోచుకోని ఒక బిడ్డ కథ ఇది తల్లి చేత ఛీత్కారింపుకి గురైన ఒక బిడ్డడి గాథ ఇది.. అందవికారంగా ఉన్నాడంటూ... ఆకతాయిల చేత బాధింప పడ్డ ఒక బాబు కథ... ప్రేమ పేరుతో మోసాగింప బడిన ఒక అభాగ్యుడి కథ.
తనో కల కన్నాడు.... అది కూడా విశ్వ శాంతి కోసం.... తనో సిద్ధాంతాన్ని నమ్మాడు.... అందుకోసం కష్టపడ్డాడు..
నమ్మిన సిద్ధాంతం కోసం కూతురిని వదులుకున్న త్యాగమూర్తి అతను.. లోకాన్ని ఏలే అతను... పెంచిన కూతురు కోసం కంటతడిపెట్టాడు.. తండ్రి చావుకోసం కుట్రలు పన్నితే... చిరునవ్వుతో క్షమించి వదిలేసాడు..
శత్రువుని కూడా చంపుతూ... నీ మీద నాకు గౌరవం ఉంది... అని సహృదయత చాటుకున్నాడు... క్రూరంగా చంపే అవకాశం ఉన్నా... చిటికెలో మాయం చేసి... So Called Super Hero లకి గౌరవప్రదమైన చావునిచ్చాడు.
ఈ విజయం.. దొంగ దెబ్బ తీసి సంపాదించలేదు... మగాడిలా పోరాడి సంపాదించుకున్నాడు.
ఇంత సాధించి.. అతనేమి విర్రవీగాలేదు....సూర్యుడిని చూస్తూ.... తన కర్తవ్యం గుర్తు చేసుకున్నాడు.
అలాంటి వాడి చావుకోసం సిగ్గులేకుండా ఎదురుచూస్తున్నారు..... ఈ నెలలో...
డబ్బు మదంతో హీరో అయినోడు ఒకడు.. ఒళ్ళు బలిసి హీరో అయినోడు ఇంకొకడు... వంశం, రక్తం అని నెపోటిజం ద్వారా హీరో అయినోడు, డ్రగ్స్ వాడి... పళ్లెం అడ్డుపెట్టుకుని... హీరో అయినోడు ఇంకొకడు...
వీళ్ళకి మీరు ఫ్యాన్స్....హుత్.... మగాడిలా నేరుగా వచ్చి కొట్టండి....ఒప్పుకుంటా.. Thanos గాడి మీద చిన్న గాటు పడ్డా...marvel గాడి M పగిలిపోద్ది.... - Sai Rajesh (Director Of Hrudaya Kaleyam)