మన India లో సుమారు రోజుకు 50 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు...అంటే ప్రతి 30నిమిషాలకు మనకు అన్నంపెట్టె రైతు చనిపోతున్నాడు. గత 20 సంవత్సరాలలో 3,00,000 రైతులు తమని తాము చంపుకున్నారు... కోట్లల్లో ఇంకా జీవశ్చవాలుగా తమవారికోసం బతుకుతున్నారు కేవలం తమవాళ్ళని ఒంటరిగా ఈ భూమి మీద వదలలేక...చైనా తర్వాత ఇండియానే ప్రపంచానికి ఆహారం పండిస్తుంది, 60% భారతీయుల ప్రధాన జీవనాదాయం వ్యవసాయం. కాని ప్రమాదం ఎంతస్థాయిలో ఉందంటే వీళ్ళల్లో 62% రైతులు ఇప్పటికిప్పుడు వ్యవసాయాన్ని వదిలి పట్టానానికి వెళ్ళి ఎదోఒక పనిచేసుకోవాలని సిద్ధంగా ఉన్నారట....
వ్యవసాయం అంటే ఏదో వందల ఎకారాలు ఇక్కడ ఎవ్వరికి లేవండి మహా అయితే పదుల సంఖ్యలో ఉంటాయి అంతే. కేవలం 5ఎకరాలకన్నా తక్కువ ఉన్నవాళ్ళు 60% ఉంటే, 5 ఎకరాల కన్నా ఎక్కువ పొలం ఉన్నవాళ్ళు 19%, ధనిక రైతులు మాత్రం 14%, అసలు ఒక్క గజం భూమిలేని కౌలు రైతులు 7% గా ఉన్నారు. పేరుకు ఉచిత విధ్యుత్ అని చెప్పిన ఆ కరెంట్ రోజుకు 6గంటలు కూడ మన తెలుగురాష్ట్రాలలో ఉండదు దీనికి తోడు వర్షాలు లేక, బ్యాంక్ డబ్బు కట్టలేక, అప్పులు, నకిలి విత్తనాలు, నకిలిఎరువులు ఆకరికి అన్ని కష్టాలు దాటి పంట పండినా కూడా సరైన ధర రాక ఆకరికి పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాకుంటే ఇంక ఆ రైతులకు ఏది దిక్కు??
చదువుకున్న ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు మన దగ్గర ఎంత బ్లాక్ మనీ ఉంది?, బ్యాంక్ నుండి అప్పు తీసుకొని ఇంకా ఒక్క రుపాయి కట్టకుండా ఉన్న కుబేరులు ఎంతమంది ఉన్నారు అని. కాని ఏ ఒక్క అధికారి నిలదీయడు బిక్కు బిక్కు మని బతుకుతున్న ఒక సాధారణ రైతు మీదనే వీళ్ళందరి వీరత్వం వారు పండించిన పంట తిని బలం పెంచుకుని చివరికి రైతులనే చీల్చి చెండాడుతున్నారు. సిగిరేట్ ఆల్కహాల్ వీటిని తయారు చేసేవాడు కోటిశ్వరుడు అవుతున్నాడు ఇవ్వేం లేకపోయినా మనం బతకగలం కాని మనల్ని బతికిస్తున్న రైతు పరిస్థితి ఎలా ఉంది? ప్రతి పక్షాలకు ప్రభుత్వానికి మధ్య ఒక ఆటలో అరటిపండులా మారుతున్నాడు. రైతుల చావులమీద ప్రభుత్వాలను ఏలుదామనుకుంటున్నా వాళ్ళే...
రైతులు బతకాలంటే స్వతంత్రం రావలన్నారు...
నెహ్రృ రావలన్నారు...
ఇందిరా గాంధీ రావలన్నారు...
రాజీవ్ గాంధీ, సోనియ, మన్మోహన్ రావలన్నారు..
వాజ్ పేయ్ ప్రధాని కావలన్నారు ...
N.T.రామరావు రావలన్నారు, Y.S.R CM కావలన్నారు...
నీతి మంతుడైన మోడి PM కావలన్నారు..
తెలంగాణా రావలన్నారు, KCR, చంద్రబాబు CM కావలన్నారు...ఇప్పుడు పవన్ కళ్యాన్, రాహుల్ గాంధీ, జగన్, ఇంకా KCR మనవడు రావలంట...
ఎప్పటి దాక ఈ రైతుల హత్యలు?
ఎప్పుడు రా రైతు బతికేది??
నాలాంటి రైతు బతుకు తన పిల్లలకు రావద్దురా భగవంతుడా అని వాళ్ళని ఉద్యోగాల కోసం City కి పంపుతున్నారు...
రైతు పొలంలో పంటలు పండటం లేదు వాళ్ళ శవాలు పండుతున్నాయి...
మన భారతదేశంలో దొంగతనలు చేసెవాడు హాయిగా ఉన్నాడు ఆకరికి వ్యభిచారం చేసెవారు కూడా,
కాని పంటను కన్నబిడ్డాలా పెంచే మన తండ్రిలాంటి రైతు ఏం పాపం చేశాడు? ఎందుకు చచ్చి పోతున్నాడు??