Every Son/Daughter Must Read This Father's Version Of 'Naa Saavu Nen Sastha Neekenduku'!

Updated on
Every Son/Daughter Must Read This Father's Version Of 'Naa Saavu Nen Sastha Neekenduku'!

15 ఫిబ్రవరి,2018.

ఎప్పటిలాగే ఆరోజు కూడా మా షెడ్ తెరిచి, అందులో నాన్న వాడకుండా వదిలేసిన rx 100 ని రిపేర్ చేస్తున్నా. ఎందుకో ఆ రోజు చాలా boring గా, నిస్సత్తువగా, చిరాకు గా అనిపించింది, లేవడం time బాలేదేమో అని అనుకుని, ఫోన్ లో S/o సత్యమూర్తి సినిమాలోని "ఛల్ ఛలో ఛలో.... " పాట రిపీట్ మోడ్ లో వింటున్నా. అమ్మా నాన్న మీద 24 ఏళ్ళు వచ్చినా ఆధారపడి బ్రతుకుతున్నా అన్న ఫీలింగ్ మళ్ళీ రోజూ లాగే వచ్చింది నా బుర్ర లోకి.

కాసేపు కళ్ళు మూసుకుని అసలు B.Tech అయ్యాక ఇన్ని సంవత్సరాలు ఏ పనీ చెయ్యకుండా ఉండీ తప్పు చేసానా .... అసలు జీవితం లో ఏం జరుగుతుంది అని ఆలోచిస్తున్నా. ఈలోపులో tyre పంక్చర్ అయిన సౌండ్ వచ్చింది, లేచి షెడ్ బయటికి వచ్చేసరికి మా మావయ్య ఆ పంక్చర్ అయ్యిన బైక్ ని బయట పార్క్ చేసి మా ఇంటిలోపలికి వస్తున్నాడు, కనీసం ఆయన ముందు నేను నుంచున్నా , నన్ను ఏ మాత్రం పట్టించుకోకుండా. నేను కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా నా ఛల్ ఛలో ఛలోసాంగ్ వింటున్నా.

(ఇంటి లోపల ....... )

నాన్న: ఏంటి బావ గారు sudden గా చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చారు. ఎలా ఉన్నారు.

మావయ్య: ఏంలేదండీ, ఇప్పుడే మార్కెట్ కి వెళ్తుంటే బైక్ సరిగ్గా మీ ఇంటి ముందే ఆగిపోయింది, పంక్చర్ అయ్యినట్టుంది. ఎలాగో వచ్చా కదా కనబడి వెళ్దాం అని ....

నాన్న: ఓహో .... ఇంకేంటండి విశేషాలు ? మీ వాడు ఎలా ఉన్నాడు, హైదరాబాద్ ఏ నా ?

మావయ్య: హా అవునండీ, ఏముంటాయండీ విశేషాలు, ఎదో దేవుడి దయవల్ల వాడికి గవర్నమెంట్ జాబ్ రావడం ..... మాకున్న సకం కష్టాలు తీరినట్టే ఇంక .

నాన్న: పోంలెండి, ఇంక మీరు మీ గవర్నమెంట్ జాబ్ నుండి రిటైర్ అయినప్పుడు కొడుకు మీద బెంగ ఉండదు.

మావయ్య: ఇంతకీ మీవాడి సంగతి ఏంటి ? జాబ్ ఏదైనా చూస్కోమనచ్చు కదండీ, రోజులు చాలా ఫాస్ట్ అయిపోయాయి. అన్నీ వాట్సాప్ లోనే .... ఇదిగో ఈ ఫోన్ మావాడు మొన్న sudden గా ఇంటికి పార్సెల్ పంపాడు చెప్పాపెట్టకుండా.... మీవాడిని కూడా గవర్నమెంట్ జాబ్ లో settle అయిపోమనండి, డబ్బే డబ్బు.

(బయటినుంచి చూస్తున్న నాకు నాన్న మాటల్ని బట్టి ముఖం లో ఆనందం తగ్గింది అని గమనించా ... )

పిల్లల్ని కాళీ గా ఉంచకూడదు బావగారు. ఇదొక కంపెనీ లో జాయిన్ అవ్వమండీ, కాళీ గా మాత్రం అస్సలు ఉంచద్దు బావ గారు. మొన్నే వాట్సాప్ లో చూసా, కాళీ ఎక్కువైపోయి పిల్లలు facebook లో అమ్మాయిలతో చాలా చెత్తలా behave చేస్తున్నారంట. ఏంటో ఈ పిల్లలు.

(నాన్న ముఖం లో కోపం వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అయన నవ్వు తో cover చేసేస్తున్నారేమో అని నాకు doubt వచ్చింది )

నాన్న: పోనీ మా వాడికి మీరే ఏదైనా చూసిపెట్టండీ జాబ్ అది .... ఏమీ అనుకోకపోతే ...

మావయ్య: అయ్యో అదెంత పనండీ , జాబ్ మేళ లాంటి వాటికి పంపుదాం, లేదంటే గవర్నమెంట్ జాబ్ కి మావాడు సలహాలు ఇస్తాడు మీ వాడికి, ఎలాగో ఇద్దరిదీ ఒకే వయస్సు కదా...

నాన్న: ఇలాగే కదండీ మన కొడుకుల భవిష్యత్తుని నాశనం చేస్తున్నాం.....

(Damnnn .... అస్సలు expect చెయ్యని dialouge నాన్న నోటి నుంచి రావడం విని అవాక్కయ్యా!)

మావయ్య: అదేంటండి, అలా అంటారు (మావయ్య voice లో base పెరిగింది).

నాన్న: ముమ్మాటికీ మీలాంటి తండ్రుల వల్లనే దేశం లో ప్రతీ వాడు డబ్బుకోసం, పేరు కోసం గవర్నమెంట్ జాబ్ లేదా, ఎక్కువ డబ్బులిచ్చే కార్పొరేట్ జాబ్స్ కే ప్రయత్నిస్తున్నారు. అది వాళ్ళ తప్పు కాదు, ముమ్మాటికీ మీదే. Facebook లో ఎవడో ఎక్కడో చేసిన పని ని అందరికి వర్తింపజేసే cheap మెంటాలిటీ మీది.

మావయ్య: అయ్యో బావ గారు .... అలా అనలేదండీ నేను.

నాన్న: మీరు ఎలా అన్నా , మీవాడు తోపు ఐతే మీ ఇంట్లో పొగుడుకోండి, మీ ఇంట్లో ఫోటో కట్టి పూజ చేస్కోండి. వాట్సాప్ లో ఏది పడితే అది వస్తే ఫాస్ట్ ఎలా అవ్వుద్దండీ ? నెట్ లో ఉన్న వీడియోలు, matter ఇందులో పెడితే మనం చూస్తాం తప్ప, అది ఫాస్ట్ కాదు. Smart phone చేతిలో ఉంటే మీరు స్మార్ట్ అయిపోరు, మీ కొడుకు విలువ, అతన్ని కనుక మీరు చదవగలిగితే అప్పుడు అవుతారు మీరు స్మార్ట్. ఎదో చుట్టం గా వచ్చినవారు, చుట్టం గా వెళ్లిపోకుండా మాకెందుకండీ మీ అతి అంతా.

మావయ్య: ....... (మావయ్య కి చెమటలు తప్ప మాటలు రావట్లేదు )

నాన్న: ఒకటి గుర్తుంచుకోండి, దేని విలువ దానికి ఉంటుంది, దేన్నీ compare చెయ్యద్దు, చెయ్యలేం కూడా. ఎవడికో GATE ర్యాంక్ వచ్చిందని , మన కొడుకుని తిట్టడం ఎంత అమాయకత్వమో , ఎవడికో గవర్నమెంట్ జాబ్ వచ్చిందని మన కొడుకుని తక్కువచేసి మాట్లాడటం ఎంత అమాయకత్వమో, గవర్నమెంట్ జాబ్ చేసినోడే తోపు అని లేదా BTech అవ్వగానే జాబ్ వచ్చేవాడే తోపు అని అనుకోవడం అంతే అమాయకత్వం. మనం మంచి వ్యక్తిత్వాలు గా తయారుచెయ్యాలి కానీ డబ్బు మనిషిలా, రిటైర్ ఐతే గవర్నమెంట్ ఎప్పుడు ఆ సకం డబ్బు ఇస్తుందా అని కాదు. టాలెంట్ ని గుర్తించలేదు కాబట్టే దేశాన్ని ఇలా తయారుచేస్తున్నాం.

మావయ్య: (కోపం తో లేచి ... ) ఐతే మీరు మీ కొడుకు టాలెంట్ ని భలే గుర్తించారు, అందుకే BTech అయ్యిన 2 ఏళ్ళు తర్వాత కూడా జాబ్ రాలేదు.

నాన్న: ఇప్పటివరకు నేను చెప్పింది మీకేం అర్ధమయ్యింది ? నా కొడుకుకి తన మనసులో మా మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు అనే ఫీలింగ్ ఉంది అని నాకెప్పుడో తెలుసు, కానీ ప్యాచ్ పడిన సెకండ్స్ లోనే టైర్ ని బాగుచెయ్యగల cream తయారు చేసే అంత టాలెంట్ ఉంది అని , దానికి పేటెంట్ కూడా apply చేసాడని తెలిసాక నేను తనని అలాగే వదిలేసా. నాకు తెలిసీ మీ బైక్ కి ప్యాచ్ పడిందని మీరు ఇక్కడికి వచ్చి ఇంత సేపు ఉన్నారు, నా guess కరెక్ట్ అయితే ఈపాటికే మీ బైక్ రెడీ గా ఉండుండాలి.

(మావయ్య నా వైపు వస్తున్నాడు ...... )

నాన్న: వాడి thought కి మా వాడు patent కూడా apply చేసాడు, కానీ ఆ patent రావడానికి కనీసం రెండేళ్లు పడ్తుంది . ఓ మర్చిపోయా మీకు పేటెంట్ అంటే తెలీదు కదా, వాట్సాప్ లో రాలేదనుకుంటా..... ఏ దారిలో వచ్చారో అదే దారిలో ఇంటికెళ్లి, మీ గవర్నమెంట్ జాబ్ పుత్రుడిని అడగండి చెప్తాడు.....

మావయ్య: . . . . . .. . . . . . .. . . . . . . .. . .. . . .. . .