(ఈ వెబ్ సైట్ ఇప్పటికీ 80% పూర్తయింది. 100% పూర్తయ్యేవరకు కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల ప్రతి ఒక్క ఫీచర్ ను పూర్తిగా వివరించడం లేదు.)
"విశ్వనాథ్" (9652549003) మన తెలుగబ్బాయే, Proper సూర్యాపేట. నాన్న నీలం శ్రీనివాస్ గారు SBI బ్యాంక్ లో పనిచేస్తారు. విశ్వనాథ్ మిత్రులు, బంధువులలో చాలామంది విదేశాలకు వెళ్ళిపోయారు. 71% తో ఇంజినీరింగ్ పూర్తిచేసిన విశ్వనాథ్ అనుకుంటే USA వెళ్ళిపోవచ్చు కాని వెళ్ళిపోడు. ఎందుకంటే మనోడికి దేశభక్తి, ఆత్మాభిమానం కాస్త ఎక్కువ కనుక.. ప్రపంచంలో అత్యదిక జనాభా ఉన్న చైనా మానవవనరులను సరిగ్గా ఉపయోగించుకుంటుంది. అమెరికా, జపాన్ లాంటి దేశాల కంపెనీలు కూడా ఉత్పత్తి రంగంలో చాలా కంపెనీలు చైనా మీదనే ఆధారపడుతున్నాయి, అన్ని రంగాలలో చైనాకు పోటీ ఇస్తున్న మన దేశం ఎందులో తక్కువ.? అంతెందుకు చైనా నే ప్రత్యేకంగా తమకంటూ సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకున్నది.. Facebook(recent example data leakage by Cambridge Analytica ) మన సమాచారాన్ని దొంగిలించి వారికి అవసరమైన విధంగా వాడుకుంటున్నదన్నది అందరికీ తెలిసిన విషయమే.. ఇలాంటి రకరకాల అంశాలే ప్రత్యేకంగా GeTogether (Working Title) సోషల్ మీడియా ను నిర్మించడానికి విశ్వనాథ్ ను ఉసిగొల్పింది.
విశ్వనాథ్ తయారుచేస్తున్న మన సోషల్ మీడియాలోని కొన్ని ప్రత్యేకతలు:
ప్రపంచంలో ఎవ్వరితోనైనా వారి భాషలలో వారు మాట్లాడుకోవచ్చు:
ఒకవేళ మనం ఎక్కడో ఫ్రాన్స్ దేశంలో ఉన్న వ్యక్తితో స్నేహం ప్రారంభిద్దాం అని అనుకుంటున్నామనుకోండి ఆ వ్యక్తికి ఫ్రెంచ్ తప్ప ఇంగ్లీష్ రాదు మనకు తెలుగు/english తప్ప మరో భాష రాదనుకోండి.. అప్పుడు మన మధ్య అనుబంధానికి భాషే అడ్డంకిగా ఉంటుంది కదా.. మన సైట్ లో మాత్రం భాష అడ్డంకిగా ఉండదు. ఎలా అంటే "మనం English అక్షరాలలో అతనికి మెసేజ్ చేస్తే ఫ్రెంచ్ అక్షరాలలో తనకు మెసేజ్ కనిపిస్తుంది. అలాగే తను ఫ్రెంచ్ లో మెసేజ్ చేస్తే మనకు తెలుగులో మెసేజ్ కనిపిస్తుంది. ఏంతో బాగుంటుంది కదా ఈ ఫీచర్. ఎవరి భాషను వారు కాపాడుకుంటూ ఇంగ్లీష్ మాట్లాడకపోతే బతకలేం అనే నానుడిని ఈ ఒక్క ఫీచర్ తోనూ చెరిపేయవచ్చు.
No Spy:
అందరు హిల్లరీ క్లింటన్ అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలు కాబోతుందని ఊహించారు. కాని ట్రంప్ గెలిచాడు. కారణం ఏంటో తెలుసా Facebook. అవును అమెరికా దేశస్థులు Facebook open చేయగానే ట్రంప్ కు సంబందించిన positive posts కనపడేలా చేశారని, facebook ను బాగా వాడుకున్నాడని ఒక రకమైన వాదన.. సాక్ష్యాలతో సహా కొన్ని మీడియా సంస్థలు(మనదేశంలో కూడా) బహిరంగంగా వెల్లడిచేశాయి అందువల్లనే ఎవ్వరూ ఊహించని విధంగా కొద్దిశాతం ఓట్లను ట్రంప్ తనవైపుకు మార్చుకున్నాడని అంటుంటారు. రాజకీయ పార్టీలు ఇదే పద్దతిని మన దేశంలోనూ ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతెందుకండి "మనం గూగుల్ లో, లేదంటే అమెజాన్ లో ఏదైనా ప్రొడక్ట్ గురుంచి సెర్చ్ చేస్తే వెంటనే దానికి సంబంధించిన యాడ్ మన facebook timeline లో కనిపిస్తుంది కదా.. ఇలా మనం ఫలానా రాజకీయ పార్టీకి చేసే పోస్ట్ లు, opinion లు ప్రతి ఒక్కటి కూడా facebook పరిశీలిస్తోంది. మన గురుంచి మన అభిరుచుల గురుంచి మన కన్నా ఎక్కువ facebook కే ఎక్కువ తెలుసు..
విశ్వనాథ్ కేవలం వీటన్నిటి మీదనే సుమారు 2 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశాడు. ఇప్పుడు జుకర్ బర్గ్ ఐనా మన మెసెంజర్ లోని మెసేజెస్ చూడగలేడేమో కాని విశ్వనాథ్ అలా చూడలేని ఫీచర్ ను ఇందులోకి తీసుకువచ్చాడు. కనీసం ఫ్రెండ్ అయితే తప్ప వారి పోస్ట్స్ కూడా మనం చూడలేము, ఇంకొకరిని బ్లాక్ చేయకుండానే మన పోస్ట్స్ ఫలానా వారికి చూడకుండా ఒక వినుత్నమైన ఆప్షన్ కూడా ఇందులో ఉంది. యూజర్ సేఫ్టీ, వారి స్వేచ్చ కోసమే ఈ సైట్ ను రూపొందిస్తున్నారు కనుక Facebookలో ఉన్న రక్షణలేమిని దృష్టిలో ఉంచుకునే ఎన్నో ప్రత్యేకతలను తీసుకువస్తున్నాడు.
One way Messaging by Admin:
మీరు ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించారు.. దానిని ప్రమోట్ చెయ్యాలనుకుంటున్నారు. మిగిలిన సైట్స్ లో ఐతే "Sponsored" తో మన పేజ్ నేమ్ తో కనిపిస్తుంది. ఇందులో ఐతే మీరు ఆ లింక్ admin కు పంపితే మీరు ఎంచుకున్న లొకేషన్ లో, ఎంచుకున్న ఏజ్ గ్రూప్ వారందరికి వారి టైమ్ లైన్ కు వెళ్లిపోతుంది. ఇది కూడా యూజర్ కి రోజుకు ఒకే ఒక్క యాడ్ పంపబడుతుంది యూజర్ కు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా..
ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి.. ఫ్రెండ్స్ కోసం ఒక సెర్చ్ బాక్స్, తెలియని వ్యక్తుల కోసం మరొక సెర్చ్ బాక్స్, దేశ విదేశాలలోని వ్యక్తుల మధ్య ఆత్మీయబంధం కొనసాగడానికి ఫీచర్స్ ఇలా ఎన్నో ఎన్నోన్నో.. ఇదే ఆర్టికల్ లో మరిన్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేసే ఆప్షన్ల గురుంచి కూడా వివరించాలని ఉంది కాని కొన్ని కారణాల వల్ల బహిర్గతం చేయదలుచుకోవడం లేదు. ఈరోజు ప్రతి ఒక్క యువకుడు కాదు కాదు చదువుకున్న ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. వాడుతున్న వారందరిలో మెజారిటీ వ్యక్తులు సోషల్ మీడియాలో ఎక్కడో ఒక చోట సభ్యులు. సోషల్ మీడియా మన జీవితాలను, దేశ అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ఆర్టికల్ ఉద్దేశ్యం 26 సంవత్సరాల విశ్వనాథ్ దేశ ప్రజల సమాచారానికి రక్షణ ఇస్తూ ఉపయోగపడే సైట్ ను నిర్మిస్తున్నాడని మాత్రమే కాదు సైట్ నిర్మాణానికి తన బిజినెస్ పార్టనర్స్ కాని ఇన్వెస్టర్స్ కోసం ఎదురుచూస్తున్నాడు.
తన website ని use చేసుకుని ఒక గిన్నిస్ రికార్డ్ ను కూడా క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారు. అలాగే ఒక 5 నుండి 6 సంవత్సరాల వరకు సరిపడ updates కూడా రాసి పెట్టుకున్నాడు. పైన మీరు చదివిన ఫీచర్స్ చాలా తక్కువ.. కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల పూర్తిగా వివరించడం లేదు. మీకు విశ్వనాథ్ రూపొందిస్తున్న GeTogether (Working Title) లో భాగస్వామి గా భాగమయ్యి మిగిలిన సైట్ నిర్మాణానికి ఉపయోగపడితే మీకు, మన దేశానికి ఎంతగానో లాభం చేకూరే అవకాశం ఉంటుంది..
విశ్వనాథ్ ను చేరుకోవడానికి..
ఫోన్: 9652549003
Email ID: Vishwanathneela8055@gmail.com