ఫార్మల్ గా మాట్లాడుకునే బాష బయటి ప్రపంచం కోసం ఉపయోగిస్తే ఇంటికొచ్చేసరికి, మన ప్రాంతం వారిని కలుసుకున్నప్పుడు, లేదంటే మన సొంతూరుకి వెళ్ళినప్పుడు మామూలు వాడుక బాష, యాసలో మాట్లాడుకుంటాం. అది ఏ ప్రాంతమైనా కాని, ఏ బాష కాని, యాసలో దాపరికం లేకుండా మనస్పూర్తిగా మాట్లాడవచ్చు. ప్రతి బాష కున్నట్టే మన తెలంగాణకు ఒక ప్రత్యేక యాస ఉంది. కాని మిగిలిన వాటికన్నా మన తెలంగాణ బాష, యాస ప్రత్యేకం. దశాబ్ధాలుగా సాగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటం, నిజాం రాజులపై తిరుగుబాటు ఉద్యమం లాంటి అనేక ఉవ్వెత్తున్న ఎగిసిన ఉద్యమాలన్నీటిలో మన తెలంగాణ సోదరులు తెలంగాణ యాసలోనే ఉద్యమ పాటలను, ఉద్యమ సాహిత్యాన్ని వాడారు.. ఆ బాష యాసలోనే ఉద్యమాన్ని నడిపించారు.. ఆ యాసలోనే ప్రజలలో ఉద్యమ స్పూర్తిని రగిలించారు.
తెలంగాణ ఉద్యమాల చరిత్రలో అంతటి గొప్ప స్థానం ఉన్న బాష, యాస కనుమరుగు కాకూడదనే ఆరాటంతో ఇప్పుడు డిక్షనరీని రూపొందించి భవిషత్ తరాలకు కోసం ఈ డిక్షనరీని వారధిగా ఉంచాలని భావిస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ బృందం ఇంకా బాష యాసపై పట్టున్న తెలంగాణ మేధావులు, కవులు ఈ డిక్షనరీని తయారుచేయడంలో తమవంతు సహకారాన్ని అందిస్తున్నారు.. ప్రతి ఒక్క తెలంగాణ పదం కోసం అవసరమైతే మారుమూల గ్రామాలలో పర్యటించి లక్ష కన్నా అంతకన్నా ఎక్కువ పదాలు ఉండేలా ఈ డిక్షనరీని తయారుచేయబోతున్నారు. ఈ డిక్షనరీ లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అన్ని పదాలు ఉంటాయి. వచ్చే సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(2018,June 2) నాడు ఈ డిక్షనరీని విడుదల చెయ్యడానికి కృషి చేస్తున్నారు.
తెలంగాణ డిక్షనరీ నమూన:






















