నీకు ఆపద వస్తే మీ అమ్మ నాన్న లేదా నీకు తెలిసినవాళ్ళు, నీ హీరోకి ఆపద వస్తే అవతలవారి మీద విరుచుకు పడేలా ఒక అభిమానిగా నువ్వు. మరి ఒక అడవికి ఆపద వస్తే ? "ప్రతిరోజు ఒక ఫుట్ బాల్ గ్రౌండ్ అంత అడవి మన ప్రపంచంలో తగ్గిపోతుంది". త్రేతయుగంలో శ్రీరాముడికి, ద్వాపరి యుగంలో పాండవులను అమ్మాలా తన ఒడిలో దాచుకున్నది అడవి.. ఇప్పుడు మన ప్రాణాలను తన అడవిలో పెరిగే చెట్లరూపంలో ఒక డాక్టర్ లా కాపాడుతుంది అలాంటి అడవి ఇప్పుడు నాశనమవుతుంది. నోరు లేని ఆ అడవి అరణ్యరోదనని గుర్తించి మొక్కలను నాటి పెంచి పెద్ద చేస్తున్న పయెంగ్ కి వందనం.. తనతో పాటు ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ లో కలిసి చదువుకున్న Friends అందరు ఇంజనీర్స్ గా జాబ్ చేస్తున్నారు విలాసవంతమైన భవనాలలో తమ జీవితాన్ని ఆనందిస్తున్నారు.. కాని జాదవ్ మొలాయి పయెంగ్ మాత్రం అడవిని ఒక తండ్రిలా పెంచుకుంటు వెళ్తున్నాడు.. నిజానికి ఎవ్వరికి రాని ఇలాంటి ఆలోచన పయొంగికి మాత్రమే ఎందుకు కలిగిందో ఒకసారి తెలుసుకుందాం.
పయెంగ్ స్వగ్రామం అస్సాం రాష్ట్రం లోని ముజోలి జిల్లాలోని అరుణ చప్రి గ్రామం. 1979 లో తన గ్రామంలో విపరీతమైన వరదల కారణంగా వారి ఊరంతా తుడిచిపెట్టుకు పోయింది..జాదవ్ పయెంగ్ వాళ్ల గ్రామం పక్కనుంచే బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంటుంది.. కొన్ని రోజులకి వరదలు తగ్గి నది మధ్య లోని ఇసుకదీవులు వేడెక్కడంతో వేడికి తట్టుకోలేక కొట్టుకొచ్చిన ఆ జలచరాలు అక్కడ పెద్ద సంఖ్యలో సమాధి అయ్యాయి.
అక్కడికి దగ్గరలోనే ఉండే జాదవ్ వాటిని చూసి చలించి పోయాడు.. వెంటనే అటవీ అధికారుల వద్దకు వెళ్లి ఆ ఇసుక తెన్నెల వద్ద అడవిని పెంచితే ఇటువంటి పరిస్థితి రాదని చెప్పారు వాళ్ళు.. దీనిని నిర్మంచడానికి కొంతమందిని సహయానికి అర్ధించిన కూడా హేళనగా చులకనగా అతని మాటలను పట్టించుకోలేదు ’ఈ ఇసుక నేలళ్ళో ఏ విధమైన మొక్కలు పెరగవు అంతగా చేయాలనుకుంటే నువ్వే అక్కడ వెదురు లాంటి మొక్కలు ఏవైనా నాటి చూడు..’ అని సలహా ఇచ్చారు.
ప్రపంచానికి వేలుగు నిచ్చె సూర్యుడు చంద్రుడు ఒక్కరే ఒంటరే అలా నేను కూడా ఒంటరిగానే వెలుగునిస్తానంటు ఒక్కొక్క మొక్కను నాటడం మొదలు పెట్టాడు.. ఒక్కరోజు రెండురోజులు నెలలు కాదు ఏకంగా 30 సంవత్సరాలకు పైగా మొక్కలను నాటి వాటి యొగక్షేమాలను చూసుకుంటున్నాడు. ఈ 30 సంవత్సరాలలో దాదాపు 1360 ఎకరాలలొ అడవిని నిర్మించాడు ఇంకా నిర్మిస్తున్నాడు.. ఇప్పుడు ఈ అడవిలో భారతదేశానికే గర్వకారనమైన రాయల్ బెంగాల్ టైగర్స్, దాదాపు 120 ఏనుగులు, ఎలుగుబంట్లు, పాములు, కుందేళ్ళు వంటి జంతువులకు అడవిని వాటి ఇంటిగా నిర్మిచాడు.. ఇంకా 1,000 రకాల వృక్ష సంపద వల్ల దేశ విదేశాల నుండి పక్షులు వలస వస్తున్నాయి..
ఆయన ప్రాంతంలోని ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు సాక్షాత్తు అబ్ధుల్ కాలం యే అతని కృషిని చూసి సంబ్రమాశ్ఛర్యాలకు లోనయ్యారు "Forest Man Of India" అనే బిరుదుతో అతన్ని కీర్తించారు.. అతని సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ తో గౌరవించింది.. ఇప్పుడు తన ప్రతిభను ప్రపంచమంతా గుర్తించి స్పూర్తిని పొందుతుంది.. ఇంతలా దేశానికి సేవ చేస్తున్న పయెంగ్ తిరిగి ప్రతిఫలంగా ఒక్కటే కోరుకుంటున్నారు.. దేశంలోని ప్రతి స్కూల్ ఒక కొత్త నియమం పెట్టాలి.. అదే ప్రతి విద్యార్ధి సంవత్సరానికి రెండు మొక్కలను నాటాలి ఇలా చేయకుంటే అతను తన క్లాస్ లో ఫైయిల్ అయినట్టుగా ప్రకటించేట్లుగా ఒక విధానం తీసుకురావాలని కోరుకుంటున్నారు.. దీని వల్ల వాతావరణం బాగుండటమే కాకుండా చిన్నతనం నుండే పిల్లలకు ఒక అవగాహన వస్తుంది అని..
Mumbai July 17 :- Former President of India, Bharatratna, A P J Abdul Kalam felicitating Jadav Payeng during diamond jubilee celebration of Shanmukhananda Fine Arts in Mumbai. ( pic by Ravindra Zende )
ఒకసారి ఎవ్వరితో కాకుండా మనతో మనమే మాట్లాడుకుందాం.. ఊహ తెలిసిన నాటి నుండి ఇప్పటివరకు మనం ఎన్ని చెట్లు నాటాము..? ఇంకా ఎన్ని చెట్లనుండి మనం ఉపయోగం పొందాము అని? జవాబు ఎవ్వరికి చెప్పకండి మీకు మీరు చెప్పుకొండి.. అప్పుడు మనకు తెలుస్తుంది మనం చేయల్సింది ఎంత ఉంది అని..