ఐఐటి, ఐఐఎమ్ లలో చదివి విదేశాలకు లేదా తమ సొంత జీవితం కోసం కృషిచేయడం వరకే కాకుండా సమాజ అభ్యున్నతి కోసం మన తోటి యువత పాటుపడుతుంది. నిజంగా ఇది ఎంతో ఆనందించగల పరిణామం.. ఈ కోవలోకే మన Fundukate టీం చేరింది. FunduKate ఇంతకీ అంటే ఎంటీ అని అనుకుంటున్నారా.? Fun + Educate = FunduKate (kate అంటే స్వచ్చము అని అర్ధం). జూన్ 15 2017లో స్థాపించబడిన ఈ సంస్థలో NIT, IIM లాంటి భారతదేశం గర్వించదగ్గ విద్యాలయాలలో చదువుకున్న వ్యక్తులున్నారు. వీరందరి లక్ష్యం ఒక్కటే రేపటి నవ భారతావనికి అన్ని రకాలుగా ధృడత్వం కలిగిన పౌరులను అందించడం.
ఎలా ప్రారంభమయ్యింది.? ఒక్కసారి మన అభిప్రాయాలను సంఘానికి వివరిస్తే ఆ సంఘమే మనలాంటి వ్యక్తులను ఆ లక్ష్యానికి అందిస్తుంది. "తాను ఎదుగుతూ తనతో పాటు తోటివారిని ఎదుగుదలకు ఉపయోగపడాలి" అనే మనస్తత్వం కలిగిన శర్వాని(B.Tech, NIT Calicut) Fundukate కూ మూల కారణమనే చెప్పుకోవచ్చు. తన ఆలోచనలను అభిప్రాయాలను మిత్రులు శివకుమార్(MBA - IIM Indore), పావని(B.Tech, NRI Institute of Technology), షామిలి(B.Tech), భగత్(B. Tech, JNTUK- UCEV) లతో చర్చించడం వారు కూడా విద్యార్ధులను ఎలా ఉన్నతంగా తీర్చగలం లాంటి వాటిపై వివరంగా పరిశోధన చేయడం అభిప్రాయాలు పంచుకుని ఈ Fundukate మొదలుపెట్టారు.
FunduKate లో వీరు నిర్వహించే పోటీలు మరియు వాటి వివరాలు: FunduKate ద్వారా వివిధ వినూత్నమైన పోటీలు, లెక్చర్స్ మరియు వర్క్ షాప్ తయారుచేసి అన్నిపాఠశాలలో నిర్వహిస్తున్నారు. ప్రతి పోటీ పిల్లలలో దాగి ఉన్న స్కిల్స్ ను టెస్ట్ చేయడానికి తయారుచేయబడినది.
Competitions: • LogIQ: ఈ పోటీ ద్వారా పిల్లల లాజికల్ రీజనింగ్ స్కిల్స్, IQ లెవెల్స్ తెలుస్తాయి. వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ ని మాథ్స్ సబ్జెక్టుకి ఎంతబాగా జోడించి ప్రశ్నలు సులువు చెయ్యగలుగుతున్నారో అర్ధం అవుతుంది. ఈ పోటీలో పాల్గొనడం ద్వారా వారి ఆలోచన విధానం మెరుగుపడుతుంది. • FAM: విద్యార్థులు ఏ విషమైన ఎంత త్వరగా అర్ధం చేసుకుంటున్నారు, వారికి తెలిసిన దానిని అందరికి అర్ధం అయ్యేలాగా ఎలా ప్రదర్శిస్తున్నారు అన్నది ఈ పోటీద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. • Eloquent: ఈ పోటీ ద్వారా పిల్లల ఆంగ్లబాషా ప్రావీణ్యత, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తెలుస్తాయి. పోటీలో పాల్గొనడం ద్వారా కొత్త పదజాలం సులువుగా నేర్చుకుంటారు. • Duos detective: విద్యార్థులు ఎంత క్లిష్టంగా ఆలోచిస్తున్నారు, ఎంత విశ్లేషణ చేస్తున్నారు అన్నది ఈ పోటీ ద్వారా మనకు తెలుస్తుంది. • Stress Test: పిల్లలు వాళ్ళకి బాగా తెలిసిన విషయాన్ని ఒత్తిడికి గురి అయినప్పుడు ఎలా ప్రదర్శిస్తున్నారు అన్నది ఈ పోటీ ద్వారా తెలుసుకోవచ్చు. • Memory Master: పిల్లల జ్ఞాపకశక్తి, పరిశీలనాశక్తి ఎలా వున్నదో ఈ పోటీ ద్వారా మనకు తెలుస్తుంది. • Creative Champ: పిల్లల సృజనాత్మకశక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్, ఎలా వున్నదో ఈ పోటీ ద్వారా మనకు తెలుస్తుంది.
Workshops: • Crafts: పిల్లలో దాగి ఉన్నరూపకల్పన సామర్థ్యం, గ్రహణశక్తి, వినూత్నంగా ఆలోచించడం వంటి గుణాలు ఈ వర్క్ షాప్ లో పాల్గొనడం ద్వారా పెరుగుతాయి. వాళ్లలో ఆసక్తి, సహనం పెరుగుతుంది. • Sketching: పిల్లలు వారి ఊహలని, ఆలోచలని అందంగా, అర్ధవంతంగా ప్రదర్శించడం ఈ వర్క్ షాప్ లో పాల్గొనడం ద్వారా నేర్చుకుంటారు.
విద్య నేర్పించడంలో ప్రత్యేకత: • ఒత్తిడి లేని విద్య ప్రతి విద్యార్థికి ఉండాలి. ఎలక్ట్రిక్ పరికరాల నుంచి వారి ద్రుష్టి మళ్లించి, ఒక ఇమాజినరీ ప్రపంచం నుంచి దూరంగా, సహజత్వానికి దగ్గరగా పాఠాలని ఆసక్తిగా నేర్పిస్తారు. • స్కూల్ విద్యార్థులకు సిద్ధాంతమైన జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ వీరు దాన్నిఅమలుచేసే విధంగా నేర్పిస్తారు. • ప్రతీ పోటీకి ప్రత్యేకమైన లక్ష్యం ఉండేటట్లుగా తయారుచేస్తారు. వీరి ప్రతీ పోటీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. • ప్రజ్ఞానసూచి(IQ : intelligence quotient) ఎంత ఉంది?: ఒక సామాన్య విద్యార్థి కష్టపడీ చదివితే మంచి మార్కులు వస్తాయి, కానీ ఒక చురుకైన విద్యార్థి చదవకపోతే మార్కులురావు. ఒక విద్యార్థి చురుకుదనం ఎంత ఉంది అని లెక్కించే పోటీలు లేవు. మా పోటీల వలన విద్యార్థులు ఎంత త్వరగా, సమర్దవంతంగా, చురుకుగా సమాధానం ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. • ఎంత జ్ఞానం పాఠ్యంశాల ద్వారా పెరిగింది?: పరీక్షల కోసమే లేదా మార్కుల కోసమే చదివే వారు చాలామంది ఉన్నారు. పరీక్షలు పూర్తీ అయ్యాక కూడా విద్యార్థులకి ఎంతగుర్తుంది? ఎంత నేర్చుకున్నారు? అనేది పోటీల వలన తెలుసుకోవచ్చు. • చర్యప్రణాళిక(ACTION PLAN): విద్యార్థులకు పరీక్షల తరువాత explanation session నిర్వహించడం వలన వారు చేసిన తప్పులను తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మనకి ఎప్పుడు తప్పుల నుంచి నేర్చుకున్నపాఠం-గుణపాఠం కాబట్టి ఎక్కువగా గుర్తుంటుంది. మా పోటీల నమూనా ద్వారా విద్యార్థులకు స్వీయవిశ్లేషణ(self evaluation) చేసుకోవడం, తప్పులని సరిదిద్దుకోవడం అలవాటు అవుతుంది. • విద్యార్థులకు భవిష్యత్తులో వారు రాయబోయే పోటీపరీక్షల నమూనా ఏలా ఉండబోతుంది? decesion making skills ఏలా ఉన్నాయి? వారు టీం ప్లేయర్ ఉండగలుగుతున్నారా లేదా? ఇలాంటి విషయాలు అన్నినిర్వహించే పోటీల ద్వారా తెలుసుకోవచ్చు. • Fundukate ప్రోగ్రాం వల్ల స్కూల్స్, విద్యార్థులు, fundukate టీంముగ్గురుకి ప్రయోజనం., ఆవిధంగా స్ట్రాటజీ తయారుచేయబడినది.
ఇప్పటి వరకు 25 పాఠశాలలో నిర్వహించిన ఈ ప్రత్యేక శిక్షణ తరగతుల వల్ల 99.8% విద్యార్ధులకు మేలు కలిగిందని నివేదికల ఆధారంగా తెలుస్తున్నది. ఈ శిక్షణ అంతా కూడా విద్యార్ధి ప్రాయంలోనే ఇవ్వడం మూలంగా ఉన్నత చదువులు చదివిన తర్వాత కూడా ఏ కోచింగ్ సెంటర్ల వెంబడి వెంటా పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఈ టీం చేస్తున్న మరో గొప్ప కార్యక్రమం "ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి పోటీ పరీక్షలు పెట్టి అందులో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్ధులను మరింత ప్రోత్సహించడానికి గిఫ్ట్స్, ట్రోఫీలు ఇవ్వడం వీరికున్న మరో గొప్ప ప్రత్యేకత.