గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, భారత దేశ క్రికెట్ చరిత్ర లో అత్యున్నత ఓపెనర్స్ లో మొదట్లో లో ఉంటారు. చివరి 90 దశకం లో పుట్టిన మనలో చాలా మందికి ఓపెనర్స్ అంటే గుర్తొచ్చేది వాళ్ళే.... వాళ్ళ తరువాత టీం ఇండియా లో వాళ్లంతటి ఓపెనర్ జంట లేరని చెప్పడం అతిశయోక్తి కాదు.
2011 ప్రపంచ కప్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ధోని కొట్టిన సిక్స్ గురించి ఎంత మాట్లాడాడుకుంటామో గౌతమ్ గంభీర్ కొట్టలేక పోయిన ఆ షాట్ గురించి కూడా అంతే మాట్లాడుకుంటాం. గౌతీ కొట్టలేక పోయిన ఆ ఒక్క షాట్ అతన్ని ఆ రోజుకి హీరో ని కాకుండా చేసింది. ఓడిపోతుందేమో అని భయపడిన మన ఆశల పునాదులని గట్టి పరిచిన ఆ 97 పరుగులను మర్చిపోయేలా చేసింది. కానీ అతను తనపై తనకున్న విశ్వాసం కోల్పోకుండా ఆ మరుసటి సంవత్సరం తన సారథ్యం లో కేకేఆర్ టీం ఐపీఎల్ ట్రోఫీ గెలిచేలా చేసారు . కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలని, తాను గా ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్సీ ని వద్దనుకున్నారు. అలా తన 15 ఏళ్ల క్రికెట్ ప్రయాణం లో పడుతూ లేస్తూ ఎక్కడ తన ఆటపై నిబద్ధత ని కోల్పోకుండా సాగిన అతను తన క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికాడు.
ఈ సందర్భం లో తన వృత్తి జీవితం గురించి తన మనో గతాన్ని వివరిస్తూ ఈ ప్రయాణం లో తన వెంట నిలిచినా గ్రౌండ్ క్యురేటర్స్ దగ్గర్నుండి తన కుటుంబ సభ్యుల వరకు అందరికి కృతఙ్ఞతలు చెపుతూ చేసిన ఈ వీడియో క్రికెట్ అభిమానులను కచ్చితంగా కదిలిస్తుంది.
ఒక ముగింపు మరో ప్రారంభానికి మొదలు. క్రికెటర్ గా విరమించిన, గౌతమ్ లో ఉన్న ఒక గురువుకి ఇదొక నాంది అవ్వచ్చు.అతను సాధించాలనుకున్న ఎన్నింటినో తన శిష్యుల ద్వారా సాధించాలని ఆశిస్తున్నాం. It's not over gauti... It's an opening for new story..