ఒకరోజు గౌతమ బుద్ధుడు తన సేవకులతో కలసి ఒక గ్రామాన్ని సందర్శించారు. బుద్ధుడి పై ఉన్న గౌరవపూర్వకమైన నమ్మకంతో వారి ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం దొరుకుతుందని ఆశిస్తూ ముగ్గురు వ్యక్తులు వేరు వేరు సంధర్భాలలో బుద్ధుడిని దర్శించి వారి అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకున్నారు. ఉదయం ఒక వ్యక్తి వచ్చాడు.. అసలు దేవుడు ఉన్నాడా..? బుద్ధుడు: లేడు.. అస్సలు లేడు.! మధ్యాహ్నం ఇంకో వ్యక్తి వచ్చాడు. స్వామి.. అసలు దేవుడు ఉన్నాడంటారా ? బుద్ధుడు: ఉన్నాడు.. ఖచ్చితంగా ఉన్నాడు. సాయంత్రం మరో వ్యక్తి వచ్చాడు గురువర్య అసలు భగవంతుడు ఉన్నాడా..? ఈసారి బుద్ధడు కాసేపు ఏమి మాట్లాడకుండా కళ్ళుమూసుకున్నాడు. బుద్ధుడు ఇలా చేయడాన్ని చూస్తున్న ఆ వ్యక్తి కూడా ఏమి మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాడు. "ఆ నిశ్శబ్ధంలో ఏదో తెలియని శక్తి అతని హృదయంలోకి ప్రసరించినట్టుగా జ్ఞానోదయ భావం పొంది కన్నీరులో వచ్చిన ఆనందానికి పరవశించిపోయాడు. నిజం అర్ధమైన ఆ వ్యక్తి బుద్ధుని పాదాలకు వినయంగా నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు". "ఉదయం నుండి ఈ వేర్వేరు సమధానాలను చూసి శిష్యుడు 'ఆనందుడికి' ఏమి అర్ధం కావడం లేదు.. "సత్యమనేది ఎప్పటికి సత్యమే ఆ సత్యాన్ని వివరించకుండా ప్రతి ఒక్కరికి ఒక్కో విధంగా చెప్పడమేంటి ? అని ధీర్ఘంగా ఆలోచిస్తు సమాధానం కోసం ఆనందుడు బుద్ధుడిని ఆశ్రయించాడు".. దానికి బుద్ధుడు ఇలా చెప్పాడు.. బుద్ధుడు: "మొదట వచ్చిన వ్యక్తి ఆస్తికుడు(theist) అతనికి దేవుడు లేడు అని చెప్పాను". "రెండవ వ్యక్తి నాస్తికుడు(atheist) అతనికి దేవుడు ఉన్నాడు అని అన్నాను". "ఇక మూడవ వ్యక్తి దేవుడు గాని, ఇంద్రియాతీతమైన శక్తిగాని లేదని విశ్వసించే వ్యక్తి(Agnostic) అందుకే అతనికి ఏ సమాధానం ఇవ్వకుండా నిశ్శబ్ధంగా ఉండిపోయా".. 'ఎవడైతే దేవుడిని నమ్ముతున్నాడో(theist) అతనికి దేవుడు లేడు అని చెప్పాను'. అతను ఇంతవరకు దేవుడి ఉనికిని చూడలేదు.. చూస్తే నన్ను అలా అడిగేవాడే కాదు, ఎవరో చెప్పినదాన్ని నమ్ముతున్నాడు. ఎవరైతే దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఉంటుందో అతనికి దేవుని ఉనికి మీద ఏ అనుమానం ఉండదు. అతనేమి ఇతరుల అభిప్రాయం కోసం ఎదురుచూడరు. ఒకవేల నిజమైన భక్తుడు దేవుడి ఉనికిని చూడకపోయినా కనీసం చూడటానికైనా ప్రయత్నిస్తాడు.. అనుమానంతో ఉన్నవారికే అలా చెప్పాను. ""ఎందుకంటే నమ్మకాలు అనేవి సత్యాన్ని తెలుసుకోవడానికి ఉన్న అడ్డుగోడలు"". ఎవడైతే దేవుడిని నమ్మడో(atheist) అతనికి "దేవుడు ఉన్నాడు" అని చెప్పాను, ఎందుకంటే అతని నమ్మకాల అడ్డుగోడలను కూల్చడానికి అలా చెప్పాను. లేకుంటే అతను నిజాన్ని ఎప్పుడు తెలుసుకోలేడు. నా సమాధానంతో ప్రశ్న అడిగినవారిలో ఒక ఆలోచన పుట్టాలి తద్వారా నిజమైన సత్యాన్ని వారంతట వారే తెలుసుకోవాలి. "నమ్మకాల అడ్డుగోడలను కూల్చాలనే వీరిద్దరికీ అలా చెప్పాను". ఇక మూడవ వ్యక్తి దగ్గర నేను నిశ్శబ్దంగా ఉండటానికి కారణం, అతనికి వేటిమీద నమ్మకం లేకపోవడం. అతనిలో ఉన్న ఏ నమ్మకాల అడ్డుగోడలను కుల్చాల్సిన అవసరం లేదు. అందుకే ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాను. కాని నేను అతనికి నా నిశ్శబ్ధంతో సమాధానం ఇచ్చాను.. "నేను మాట్లాడకుండా ఉంటే అతను ఏమి మాట్లాడలేదు, నేను కళ్ళు మూసుకోగానే అతను కళ్ళు మూసుకున్నాడు, నన్ను సరిగ్గా అనుసరించాడు". "ఆ నిశ్శబ్ధంలో ఏదో తెలియని శక్తి అతని హృదయంలోకి ప్రసరించినట్టుగా జ్ఞానోదయ భావం పొంది కన్నీరులో వచ్చిన ఆనందానికి పరవశించిపోయాడు". ఈ ఒక్క సంఘటనతో అతనికి నిజం తెలిసింది. అతనేం నా దగ్గర నుండి తెలివైన జవాబు కోసం రాలేదు నేను కూడా ఏ తెలివైన సమాధానం చెప్పలేదు. తెలివైన సమాధానాలు ఉచితంగా వస్తాయి అవి ఎక్కడైనా దొరుకుతాయి, మూడవ వక్తికి కావలిసినది కేవలం దేవుడు గురుంచి మాత్రమే.. దేవుడు చేసే మాయలు, మంత్రాల గురుంచి కాదు. అందుకే అతనికి సత్యం త్వరగా తెలిసిపోయింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.