తెలుగు సినిమా గాయకుల పేర్లు, ఘంటసాల గారి గొంతు తోనే మొదలవుతుంది. కొన్ని దశాబ్దాలు తన గానామృతం తో తెలుగు సినిమా ప్రేక్షకుడిని మైమరింప చేసిన మహానుభావులు ఘంటాసాల గారు. చల్లని రాత్రివేళ లోనో, పొద్దున్న వేడి వేడి కాఫీ తాగుతూనో, ఆయన పాటలే చక్కని సహచరులు. మనస్సు కుదుటపడటానికో, కొంత ఆహ్లాదాన్ని పొందటానికో, ఆయన పాటలే ఏ డాక్టర్ రాయని మందులు. అలాంటి కొన్ని పాటలని ఇక్కడ సంకలనం చేస్తున్నాను..
1. సుందరి నీ వంటి దివ్య స్వరూపము
2. ప్రతి రాత్రి వసంత రాత్రి (బాలు గారు, ఘంటసాల గారు కలిసి పాడిన పాట)
3. నా హృదయం లో నిదురించే చెలి
4. పాడుతా తీయగా
5. అందమే ఆనందం
6. శేష శైల వాసా
7.హాయి హాయిగా ఆమని సాగే
8. నన్ను దోచుకుందువటే
9. లేచింది నిద్ర లేచింది
10. ముద్దబంతి పూలు పెట్టి
ఇవి కేవలం కొన్ని పాటలు మాత్రమే, ఇవి విన్నాక ఈరోజు మొత్తం ఘంటాసాల గారి పాటలు విందాం అనుకుంటే..
ఈ రోజు ఘంటాసాల గారి పుట్టినరోజు. ఉద్యోగం వల్లో, చదువు వల్లో విసిగి వేసారిన రోజుని ఈయన పాటలతో కాసేపైనా ఆనందపరుస్తూ ఆయన్ని కాసేపు స్మరించుకుందాం..