గిరిధర్ గారి కోసం రంగులలోని ఒక్కో కణం ఆసక్తిగా ఎదురుచూస్తాయి తాము ఓ రూపంలో అందంగా ఒదిగిపోవాలని. ఈ ప్రపంచాన్ని ప్రేమే నడిపిస్తుందని బలంగా విశ్వసించే గిరిధర్ గారు తాను గీసే ప్రతి వ్యక్తినీ మనస్పూర్తిగా ప్రేమిస్తారు. తన ప్రేమ అ చిత్రంలో ప్రస్పుటంగా కనిపిస్తుంది. నాన్న గారు కూడా గొప్ప చిత్రకారుడు అవ్వడంతో వాటిపై మనసుమళ్లడానికి అట్టే సమయం పట్టలేదు. గిరిధర్ గారు అందమైన బొమ్మలు మాత్రమే కాదు ఆలోచనను రేకెత్తించేలా ఎన్నో పుస్తకాలకు కవర్ డిజైన్ లను రూపొందించారు. ఇప్పటివరకు ఆయన ఎన్ని పుస్తకాలకు డిజైన్ చేశారో తెలుసా అక్షరాల 10,000 పుస్తకాలకు పైగానే. గిరిధర్ గారి చిత్రాల గురుంచి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నవ్వు ఎంత అందంగా ఉంటుందో ఆయన గీసిన బొమ్మలు కూడా అంతే అందంగా ఉంటాయి ఒక్కసారి గమనించి చుడండి.
1. ఆపిల్ మనిషికి ఆరోగ్యకరం ఆపిల్ టెక్నాలజీ సమాజానికి ఉపయోగకరం.
2. ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి గారు రామాయణ శ్లోకాలు వల్లెవేస్తుంటే నేను ఈ ప్రపంచంలోనే ఉన్నానని తెలియదు. -మహాత్మ గాంధీ.
3. పెన్ను పట్టినా, కెమెరా ముందు నిలబడినా, మెగాఫోన్ పట్టినా, మైకు పట్టినా.. అన్నింటిలోనూ ప్రధముడే..
4. సగటు భారతీయుడు లాంటి సామాన్యి.
5. భారతరత్నం.
6. పదాల గని వేటూరి.
7. "మరో" బాలచందర్ పుట్టరు.
8. తెలుగు అక్షరం తెలిసిన వారు ఉన్నంతకాలం బుచ్చిబాబు గారుంటారు
9. రాజేంద్ర ప్రసాదుని నవ్వుల ప్రసాదం.
10. విశ్వనాథుని సంగీతం విశ్వానికి పాకింది.
11. సత్యం నిరంతరం మారుతూ ఉంటుంది. -ఓల్గా.
12. మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలుస్తుంది. పోదాం పోదాం పై పైకి.
13. మంచిది!!
14. ఓ బాపు నిన్ను ఓడించాలంటే నువ్వే మళ్ళీ రావాలి.
15. మనము విశ్వనాథుని కాలానికి చెందినవారం.
16. ఓ విశ్వంభర.
17. మంచుముత్యం దర్శకరత్నం.
18. టన్నులలో పవర్.
19. జ'గన్ను'
20. ఎప్పటికి నిండుకొని జ్ఞాన సంపద.
21.స్వర కోకిలమ్మ.
22. ఆస్కార్ శిఖరాన్ని అందుకున్న ఖ్యాతి.
23. దివికి తిరిగి పయనమైన దేవి.
24. రామసక్కని రామలచ్చిమి.