This Story Of A Girl Who Failed In Love And Wants To End Her Life Has A Twist In The End

Updated on
This Story Of A Girl Who Failed In Love And Wants To End Her Life Has A Twist In The End

Contributed by Vamshi Gajendra

జూన్ 2 , ఆది వారం

సమయం : రాత్రి 11 :24 ని ||

డైరీ రాయటం పూర్తయినా ఆగని ఆలోచనలతో కిటికీ అవతల కటిక చీకటిలోకి చూస్తోంది దివ్య ... తన ఆలోచనల నిండా ఉద్వేగం దాగుంది. పర్వతారోఅహానాకుడు చివరి మలుపు దగ్గర పొందే ఉద్వేగం లాంటిది.. చాలా ఏళ్ళ తన కలకి, కొన్నేళ్ల త్యాగానికి ఒక రూపం కొద్ది గంటల్లో రాబోతోందని ..తను House surgeon గా charge తీసుకుబోతోంది రేపు . జీవితం లో అన్నీ ఊహించినట్లే కాకుండా అస్సలు ఊహించనివి కూడా జరుగుతాయని.. కాలం మరో సారి గుర్తుచేస్తుందని అప్పుడు తాను ఊహించలేదు..

జూన్ 3

సమయం : ఉదయం 9 : 00 గ ||

మొదటి రోజే major departments లో ఒకటైన జనరల్ మెడిసిన్ పోస్టింగ్ పడింది... దివ్య కి చాలా సంతోషం గా ఉన్నా.. కంగారు తో చమటలు పడుతున్నాయి.. తను మొదటి సారి treatment చెయ్యబోతోందని.. ward లో కి నడుచుకుంటూ వెళ్ళింది .. casuality ward కావటం తో అక్కడ అన్నీ రకాల patients ఉన్నారు.. వాళ్లలో చాలా మంది తన వైపు దీనం గా చూస్తున్నారు..కొంత మంది చూసే పరిస్థితిలో కూడా లేరు. కొంత మంది వయసులో పెద్దవారైనా చేతులెత్తి నమస్కరిస్తున్నారు .. వాళ్ళు గౌరవిస్తున్నది సృష్టి కి ప్రతి సృష్టి చెయ్యగల వైద్య వృత్తినని దివ్య కు తెలుసు.

దివ్య ఒక్కొక్కరి దగ్గరకి వెళ్లి పరీక్షించటం మొదలు పెట్టింది.. ఏమైనా డౌట్స్ ఉంటే సీనియర్స్ ని అడుగుతూ.. చాలా చురుగ్గా పని చేస్తోంది.. అందర్నీ study చేస్తూ.. emergency cases కి first -aid చేస్తూ మధ్యాహ్నం ఎపుడయిందో కూడా తెలీలేదు...

మధ్యాహ్నం 1:15 ని ||

త్వరగా భోజనం ముగించుకుని ward కి వచ్చింది దివ్య.. "cases ఏమైనా వచ్చాయా ?" నర్స్ ని అడిగింది.. ఆ.. ఓ suicide case.. ఇప్పుడే తీసుకెళ్ళారు అంటూ ICU వైపు చూపించింది నర్స్.. దివ్య కంగారు గా ICU వైపు నడిచింది... వెళ్లే సరికి సీనియర్ డాక్టర్ ఇంకా రాకపోవటం తో పేషెంట్ ఉన్న బెడ్ దగ్గరకు వెళ్ళింది... తనకి ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అనిపించింది.. బెడ్ పై అపస్మారకంగా పడి ఉంది తన పాత స్నేహితురాలు విద్య. దివ్య కు విద్య ని చూడగానే వాళ్ళ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయ్య్.. అంతకంటే ముందే తన బాధ్యత గుర్తొచ్చి తన పని చేసుకుంటూ పోతోంది.. ఎడమ చేతి మణికట్టు కి కట్టి ఉన్న గుడ్డను విప్పి చూసింది.. కాటు బాగా లోపలకి దిగి చాలా రక్తం పోయింది.. తెగింది Artery.. గుండె నుండి మిగతా శరీరభాగాలకు రక్త సరఫరా చేసే నాడి. పరిస్థితి చాలా విషమం కాబోతోందని దివ్య గ్రహించింది.. డాక్టర్ కోసం ఇంకా వెయిట్ చెయ్యకుండా చక చక పనిచేస్తోంది.. ముందుగా గాయానికి డ్రెస్సింగ్ చేసి.. స్టెత్ తీసుకుని పరీక్షించటం మొదలు పెట్టింది ..విద్య ఊపిరి కూడా కష్టం గా తీసుకుంటోంది .. ఫ్లూయిడ్స్ ఎక్కించమని నర్స్ ని ఆదేశించి.. surgeon కోసం బైటకి వచ్చింది ...

దూరంగా.. ఒంటరి గా కూర్చొన్న ఆయన్ని చూసి.. దగ్గరకు వెళ్లి "విద్య కేం పర్లేదు అంకుల్ " అంది కన్నీళ్లు నిండిన అయన కళ్ళు కృతజ్ఞత తో చూశాయి.. "uncle , నేను దివ్య నాలుగేళ్ల క్రితం వైజాగ్ లో కలిసి చదువుకున్నాం.. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా తన గురించి ఏమి తెలియలేదు... కానీ తనని మళ్ళీ ఇలా చూస్తానని ఊహించలేదు.. అస్సలు తను ఎందుకిలా చేసింది ?" అని అడిగింది.

ఆయన చాలా క్లుప్తంగా చెప్పాడు.. ఆ టైం లో ఆయన్ని ఇంకా ఇబ్బంది పెట్టలేక అక్కడనుండి వచ్చేసి.. విద్య దగ్గరకు వెళ్ళింది.. surgeon వచ్చారు.. సర్జరీ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. "చాలా బ్లడ్ పోయింది.. సర్జరీ కి blood transfusion అవసరం అవుతుంది " అన్నాడు surgeon . చాలా కాలం తరువాత కలిసిన స్నేహితురాలి గొంతు కాకుండా గుండె చప్పుడు వినటం, జ్ఞాపకాలు కాకుండా రక్తాన్ని పంచుకోవడం ఎక్కడ జరగదేమో..

సాయంత్రం 4 : 00 గ ||

సర్జరీ Successful గా అయ్యింది.. దివ్య విద్య దగ్గరకు వెళ్లి చేతిని పరీక్షించింది.. స్టిచెస్ వేసి డ్రెస్సింగ్ చెయ్యబడి ఉంది.. విద్య ఇంకా కళ్ళు తెరవలేదు.. దివ్య అలాగే విద్యని చూస్తూ కూర్చుంది.. కాసేపటికి విద్య మెలకువ లోకి రావటం గమనించింది కానీ అప్పుడు అక్కడ తనతో మాట్లాడటం కరెక్ట్ కాదని అక్కడనుండి వెళిపోవాలనుకుంది వెళుతూ పక్కన ఉన్న నర్స్ తో " patient పూర్తిగా స్పృహ లోకి వచ్చాక .. తనకి blood donate చేసిన అమ్మాయి కలవడానికి పైన wait చేస్తోందని చెప్పండి " అని చెప్పి terrace పైకి వెళ్ళింది దివ్య కు చాలా ఇష్టమైన ప్లేస్ అది.. అక్కడ్నుండి దూరంగా కొండల మధ్య సూర్యాస్తమయాన్ని చూడటం తన దినచర్య లో ఒక భాగం .. కొంత సేపటికి విద్య పైకి వచ్చింది.. థాంక్స్ అనబోతుండగా అక్కడ దివ్య ని ఆశ్చర్యపోయినా.. విద్య నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు... తన మౌనానికి కారణం తాను చేసిన పని గురించిన Guilt అని అర్ధం చేస్కోగల్గింది దివ్య.. "ఎందుకిలా చేసావ్ ?" అడిగింది దివ్య. సమాధానం లేదు..

అసలు ఎలా చేసావ్ ఇంత పిరికి పని ? ఏమంత కష్టం వచ్చిపడింది చావు మాత్రమే పరిష్కారం అనిపించేంత ?? " విద్య కళ్ళ నిండా నీళ్లు... "అస్సలు ఇన్ని రోజులు ఏమైపోయావ్.. ఎంత ట్రై చేసిన నిన్ను reach కాలేకపోయా.. మళ్ళి ఇలాంటి పరిస్థితి లో కలుస్తామని అస్సలు ఊహించలేదు .." చాలా సేపటి నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ.. బలహీనమైన గొంతు తో మొదటి సారి మాట్లాడింది విద్య.. "నాలుగేళ్ళ క్రితం అంతా బాగానే ఉండేది.. సడన్ గా మా నాన్న కి వ్యాపారం లో నష్టం రావటం తో.. చిన్నప్పటినుండి పెరిగిన ఊరిని, ఫ్రెండ్స్ వదిలేసి మా అమ్మమ్మ వల్ల ఊరికి వెళ్లిపోవాల్సి వచ్చింది..అమ్మ నాన్న శ్రీకాకుళం లోనే ఉండేవాళ్ళు అమ్మమావాళ్లది మారుమూల పల్లెటూరు... అక్కడి దగ్గర టౌన్ లో నే డిగ్రీ join అయ్యాను...college కి వెళ్ళడానికి 18 కిలో మీటర్లు బస్సు ప్రయాణం చెయ్యాల్సి వచ్చేది.. నేను అక్కడి జీవితానికి త్వరగా అలవాటుపడలేకపోయాను.. చాలా ఒంటరి గా అనిపించేది.. కొద్ది రోజులకే college లో అశోక్ అనే అతని తో పరిచయం ఏర్పడింది.. ఒకే bus కావడం తో. రోజు చాలా సేపు మాట్లాడకునేవాళ్ళం.. సరదాగా అనిపించేది.. 1st year అయిపోయాక తను propose చేసాడు.. నేను తన మీద నమ్మకం తో accept చేశా.. కొంత కాలానికే అర్ధం అయింది వాడు నన్ను ప్రేమిచటం కంటే పెత్తనం చెలాయిస్తున్నాడు అని.... ఎవరితో మాట్లాడాలి.. ఎలాంటి బట్టలు ఏసుకోవాలి ఇలా ప్రతి దానికి ఆంక్షలు పెట్టేవాడు.. కానీ commitment కి విలువిచ్చి అన్నిట్లో నన్ను నేను మార్చుకున్నా.. ఒకరోజు తెలిసింది వాడికి నేను కాకుండా చాలా మందితో ప్రేమ పరిచయాలు ఉన్నాయని .. మొదట నమ్మలేకపోయినా.. చూసాక నమ్మి తీరాల్సి వచ్చింది.. ఆ క్షణం నా మీద నాకే చాలా కోపం, అసహ్యం కలిగాయి..

అవే ఆలోచనలతో.. డిప్రెషన్ లో కి వెళ్ళిపోయా.. కాలేజీ మానేసి అమ్మ నాన్నలతో పాటు ఇక్కడే ఉందాం అని వచ్చేసా .. ఇక్కడికి వచ్చాక కూడా ఆ చేదు గతం అంత easy గా వదలలేదు.. ఈ process లో నాకో ఫ్రెండ్ లా suggest చేసేది అమ్మ.. నేను కోలుకుంటుండగా సడన్ గా ఓరోజు అమ్మ చనిపోయింది... మళ్ళి నేను పాతాళం లో పడ్డట్లు అయ్యింది... ఎంత divert చేసుకున్న.. ఈ ఆలోచనలు నన్ను వదలట్లేదు.. అందుకే నన్ను నేనే వొదిలేద్దాం అని డిసైడ్ అయ్యి...." "అందుకని చనిపోదాం అనుకున్నావా " అంది దివ్య... "మరేం చేయమంటావ్.. మరచిపోవడం చాలా కష్టం గా ఉంది .." "ఎవరు చెప్పారు మరచిపోవడం కష్టం అని ? " "కాదా మరి ?" "మరచిపోవటం కష్టం కాదు..అసాధ్యం .. తలకు ఏదైనా బలమైన గాయం అయితే తప్ప మరచిపోవడం సాధ్యం కాదు.. ప్రేమించి మర్చిపోలేకపోతే చనిపోవాలా ? ఆలా అయితే మీ అమ్మను మీ నాన్న గారు ప్రేమించలేదా.. ఆలా అని మర్చిపోయారా.. లేదే నీకోసం ఇంకా బ్రతికే ఉన్నారు.. నువ్వు అయన గురించి ఆలోచించలేదా ?? " అడిగింది దివ్య. విద్య నుండి సమాధానం లేదు..

దివ్య చెప్పుకు పోతోంది " ఐదేళ్ల కిందట మన పరిచయం ఎలా జరిగిందో.. నాకు ఇప్పటికి గుర్తుంది.. పల్లెటూరి నుండి కొత్తగా పట్నం వచ్చి.. ఈ కొత్త జీవితానికి అలవాటు పడలేక తిరిగి వెళ్ళిపోదాం అని అనుకుంటుండగా.. నువ్వు చొరవ తీసుకుని నా ఆలోచన ఎంత తప్పైనదో తెలియచెప్పావ్.. అప్పుడు అంత అమాయకం లో ఉన్న నాకు.. ఈ కొత్త పరిస్థితుల్లో ఎలా మసులుకోవాలో నేర్పించావ్.. నా బలాన్ని నాకు గుర్తు చేసావ్.. అప్పుడు నువ్వు చెప్పిన మాటలు.. ఇచ్చిన పుస్తకాలు.. ఇప్పటికి నాతోనే ఉన్నాయి.. అవే నాకొక కొత్త దృక్పధాన్ని ఇచ్చాయి.. నాకొక స్పష్టమైన గమ్యాన్ని ఏర్పర్చాయ్యి.. ఇప్పుడు నా గమ్యం చేరుకోగలిగాను అంటే మూలకారణం ఒకప్పటి నీ సన్నిహిత్యమే. నేను నీకు blood ఇచ్చిన donor ని మాత్రమే కాదు.. first aid చేసిన doctor కూడా.. నువ్వెప్పుడో ఇచ్చిన ప్రేరణ నను ఇంత దూరం తీసుకొస్తే.. అదే నువ్వు అనుసరించివుంటే నువ్వెక్కడ ఉండేదానివి ? "

అప్పటి దాకా వింటున్న విద్య ముఖం లో డాక్టర్ అన్న పదానికి ఒక సంతోషకరమైన ఆశ్చర్యం కలిగింది... "నీ జీవితం లో కష్టాలు వచ్చినపుడు నువ్వు నాకు చెప్పిన మాటలు, ఇచ్చిన సలహాలు అమలు చెయ్యలేదేందుకు ?? వేదాలు , సూక్తులు చెప్పడానికే బావుంటాయి..అనుకరించటానికి కాదు అని ప్రూవ్ చేసిన నిను చూసా నేను inspire అయ్యాను అని నా మీద నాకే సిగ్గేస్తోంది..." కోపం గా అంది దివ్య.. విద్య చూపు నేల వంక చూస్తున్నాయి. "నా కష్టాల్లో కేవలం నీ మాటలే నాకు ఎంతో తోడ్పాటు కలిగించాయి.. అటువంటిది నీతో నువ్వే ఉన్న ఎటువంటి చలనం కలిగించలేదా ? కష్టాలు అందరికి వస్తాయి.. ఎవరి కష్టం వారికీ పెద్దదే .. కానీ కష్టం వచ్చినపుడు కంగారు పడకుండా.. మన అనుభవాలు నుండి నేర్చున్న పాఠాలతో ఎదుర్కోవటానికి సిద్ధం గా ఉంటే ఎంత పెద్ద కష్టమైన ఒక అనుభవం మిగిల్చి వెళ్ళిపోతుంది.. నువ్వు ఎక్కడో చదివావని నాకు చెప్పిన ఆ మాటలు నాకు ఎప్పటికపుడు గుర్తొస్తూనే ఉంటాయి..

"అనుకున్నాం అని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేదంతా మన మంచికని అనుకోవడమే మనిషి పని"

నీ జీవితం లో నీకు నచ్చనివి కొన్ని జరిగాయి.. కానీ నీ తప్పు వల్ల కాదు.. నీ తప్పు లేనపుడు శిక్ష మాత్రం నీకెందుకు పడాలి ?? నీ గురించి ఆలోచిస్తుంటాడో లేదో కూడా తెలియని వాడి కోసం నీ జీవితం అర్ధమతరంగా ముగిసిపోవాలా ??

దివ్య మాటలు సూదుల్లా మెదడుని పొడుస్తున్న బయటకి విద్య చిన్న నవ్వు ఊరుకుంది..

సాయంకాలం 6 :12 ని ||

ఆరోజు అస్తమించింది ..సూర్యుడు మాత్రమే కాదు.. విద్య ఆలోచనల్లోని అంధకారం కూడా..