ఏంటో ఈ కాలం స్కూల్ పిల్లలు, మరీ పుస్తకాల పురుగుల్లా, అవే పుస్తకాలను మోసే రోజు కూలీల్లా తయారవుతున్నారు పాపం. స్కూల్ Managementలు పిల్లల చేత బండెడు ఎందుకు మోయిస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళకో logic ఉందండోయ్. అదేనండి, పిల్లాడికి suppose చదువు ఎక్కలేదనుకోండి, కనీసం మూటలు మోయడానికైనా practice ఉండాలి కదా, అదన్న మాట. ముందు చూపు అంటుంటారు కదా... అదే ఇది. శైశవాన్ని చేయాల్సిన వయసులో జీవంలేని శవాల్లా, ఇంతేసి బూతద్దాలు తగిలించేసుకొని, వాళ్ళకంటే బరువైన పుస్తకాలు మీదేసుకుని, ఒకటే రెండు రాళ్ళ రుబ్బినట్టు, లో బట్టల్లాగా, వాడిపోయిన మొఖాలతో, incubator లో ఈము గుడ్లలాగా …అబ్బొ.... ఇక చెప్పుకుంటూ పోతే, ఇదొక మహాయుద్ధం. పుస్తకాలను చీల్చేసే యోధులు వేరే అయినా, బాల్యాన్ని కోల్పోయి ఓటమి చెందే విగతజీవులు వీరే. ఈ కాలం పిల్లలకు కాళీ స్థలాలు, కాలనీ లు పైనterrace లు ఆట స్థలాలగా మారిపోతున్నాయి. కొందరికి పాపం అది కుడా లేదండి. వాళ్ళు online లోనే cricketలు, footballలు ఆడుకోవాల్సిన దుస్థితి. Smart ప్రపంచం చేస్తున్న విడ్డూరమైన వింతలు ఇవేనండి బాబు. ఇలాగైతే 30 ఏళ్లకే B.Pలు, Diabetesలు Ulcerలు వామ్మో వామ్మో. ఏళ్ళు కష్టపడితే సంపాదించబోయే డబ్బులతో మాంచి super speciality హాస్పిటల్ లో మరో 40 ఏళ్ళు treatment. అదన్నమాట.
పెద్దయ్యాక సంపాదించే డబ్బులకోసం, అంతకంటే విలువైన చిన్నతనాన్ని కోల్పోతున్నారు. అస్సలు చదవకూడదు, గాలికి తిరగాలి అని నేను అనట్లేదండి. ఒక స్కూల్ లో వేస్తే classroom లు బాగున్నాయా లేదా అని చూస్తూనే, అసలు ఆ schoolకి ఒక పెద్ద playground ఉందా? ఉన్నా పిల్లలకు P.E.T క్లాసులు ఉన్నాయా లేవా అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేనండి, ఆటలు, పాటలు, essay-writing లు, public-speakingలు, విహారయాత్రలు, ఇలా పిల్లల్లో mathsలు, physicsలే కాకుండా creativity అనే కోణాన్ని తట్టి లేపాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, M.S. సుబ్బలక్ష్మి, సచిన్ టెండూల్కర్, ఇలా గొప్పవాళ్ళు ఎందరున్నా అందరికి childhood లోనే మంచి పునాదులు పడ్డాయి. వారి భవిష్యత్తును తయారు చేసుకునే విధంగా వారికి ఆలోచనా పరిధికి భీజాలు చిన్నతనంలోనే పడ్డాయి అనటంలో ఏ మాత్రం లేదు. కల్మషంలేని ఆ చిట్టి చిట్టి బుర్రల్ని మరీ అలా చిట్టిrobotల లాగ తయారు చేసి అసలైనఆనందాలనువాళ్లకు అందకుండా చేయకండి,please." సుఖాన మానలేని వికాసమెందుకని" అన్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. అలాగే “శైశవం అనుభవించలేని జీవితమెందుకని” నాకనిపిస్తోంది. ఈ topic మీద ఇంకొక 100 pageలు రాసినా సరిపొదు. రాద్దామన్న ఓపికకూడా నాకు లేకపోయింది. సరేనండి ఇక ఉంటానే! పిల్లలు జాగ్రత్త! :)