ప్రకృతి సిద్ధంగా Natural గా ఏర్పడ్డ ప్రదేశాలంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి.. మానవ నిర్మితంగా నిర్మించబడిన నిర్మాణాలు ఇంకోరకంగా అందంగా కనిపిస్తాయి. ప్రకృతి సిద్ధంగా అందంగా ఏర్పడ్డ ప్రదేశంలో మానవ నిర్మితమైన కట్టడాలు ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి అలాంటి కట్టడాలలో చాలా అందమైనది కొండవీడు ఫోర్ట్. ఈ కోటకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. వీరత్వానికి ప్రతీకగా నిలిచిన రెడ్డిరాజుల రాజధాని ఈ కొండవీడు కోట. గుంటూరు నుండి సుమారు 30కిలోమీటర్ల దూరంలో ఈ కోట నెలకొని ఉంది. ఇది రెడ్డి రాజులు నిర్మించి, ఏర్పాటు చేసుకున్న రాజధాని. పూర్వం స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి మొదట అద్దంకి రాజధానిగా పరిపాలన సాగించిన కాని ఆ తర్వాత అదే వంశానికి చెందిన రాజు అనవేమారెడ్డి అద్దంకి నుండి కొండవీడుకి మార్చారు. ఈ కోటను వందల సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికి కోట చాలా వరకు ఇప్పటికి ధృడంగా ఉండడం నాటి వారి శ్రమకు, నేర్పరితనంకు ప్రతీక ఈ కోట.




సాధారణంగా కోట అంటే అక్కడ కేవలం రాజు ఉండడం కోసం ఒక భవనాన్ని నిర్మించి ఉంచుతారు కాని ఈ కోట అలా కాదు.. మొత్తం 42 కొండలను కలుపుకుని ఈ కోట నిర్మితమై ఉంది. ఈ కోట మీద 18 దేవాలయాలు, 3 మంచినీటి చెరువులతో కోట మీద ఒక సువిశాల ఊరుని నిర్మించినట్టుగా ఉంటుంది. ఈ కొండ మీద ఉన్న మూడు చెరువులలో నీరు ఎప్పటికి ఇంకిపోదు. ఈ కొండ మీద వైష్ణవ, శైవ దేవాలయాలు మాత్రమే కాదు ముస్లిం సోదరుల కోసం రెండు మసీదులు కూడా ఉన్నాయి. సరిగ్గా గుర్తించాలే కాని మన తెలుగు రాష్ట్రాలలో గొప్ప Tourist Places ఉన్నాయి కాని వాటిని గుర్తించలేకపోతున్నాం.. ఒకవేళ గుర్తించిన గాని వాటిని సరిగ్గా అభివృద్ధి చేయలేకపోవడంతో మంచి ప్రదేశాలు కూడా Fade Out అవుతున్నాయి. కాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సమీపంగా ఈ ప్రాంతం ఉండడంతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు అధికారులు.. ఏది ఏమైనా కాని మన తెలుగువారి చరిత్రను తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా మంచి Safe Adventurous Tourist Place అంటే కొండవీడు ఫోర్ట్ ది బెస్ట్ ఛాయిస్ గా చెప్పుకోవచ్చు.




Check out some more glimpses from this historic fort





Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.