నేను మళ్ళీ వచ్చేసానండి.. అదేనండి మీ గోదారోడ్ని.. ఎప్పుడో మొన్న సంక్రాంతికి కలిశాం... మీరు మా గోదావరి జిల్లాలకి వచ్చినప్పుడు. అదేనండి కనుమ రోజు నోరూరించే వంటల వ్యాసంతో... మళ్లీ ఇన్నాల్లకు వచ్చా... మనల్ని మళ్లీ కలిపింది, మనం మనసారా మాట్లాడుకోవటానికి కారణం అయ్యింది.. మన గోదారి కుర్రోడు మహేష్ పితాని.. ఎవరీ బాబు.. అనుకుంటున్నారా..? అయ్ బాబోయ్ అయితే మీకు శానా సెప్పాలండి.. ఈ బాబుది పాలకోడేరు మండలం, కొండెపూడి గ్రామం. అదేనండి మన భీమవరం ఉందిగా.. ఆ పక్కనే. మనోడికి ముందునుంచి మన గోదావరి గడ్డ అంటే చెప్పలేనంత మక్కువ.. మరి ఉండదా అండి.. ఇక్కడి మనుషులు, ప్రకృతి, సంప్రదాయాలు అబ్బా అసలు మాటల్లో వర్ణించగలమా..! ఇక్కడ ఉద్యోగం చేస్తూనే.., సమయం కుదిరినప్పుడల్లా గోదావరి అందాలని తన కెమెరా కన్నుతో బందిచి, పల్లెటూర్లనీ, ఇక్కడి పచ్చని పైర్లని, మంచిగా పలకరించే మనుషుల్ని మిస్ అవుతున్న వాళ్లతో, తను మొదలెట్టిన "మన పల్లెటూరు అందాలు" అనే ఫేస్బుక్కూ, ఇన్స్టాగ్రాము పేజీలతో తాను తీసిన చిత్రాలను పంచుకుంటున్నారు... ఇక మనోడి ఫోటోగ్రఫీనీ ఇష్టపడే వాళ్ల సంగతైతే సరే సరి... తన పనితనాన్ని ఇష్టపడే వాళ్ళలో ఒకతను చెప్పిన మాటల్లో చెప్పాలంటే...
మనిషి జీవిత చరిత్ర రాస్తే అది బయోగ్రఫీ... మన చరిత్ర మనమే రాసుకుంటే అది ఆటో బయోగ్రఫీ.. అదే ప్రకృతికి ప్రతిరూపం అయిన మన పల్లెటూరి అందాలకి చిత్ర రూపం ఇస్తే అదే మహేష్ పితాని ఫోటోగ్రఫీ... మరి ఏమనుకున్నారు... మనోడి గురించి ఆయ్.. సూసేద్దామా మనోడు తీసిన ఫోటోలని...
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.
27.
28.
29.
30.
31.
32.
33.
34.
35.
36.
37.
38.
39.
40.
41.
42.
43.
44.
45.
46.
47.
48.
49.
50.
51.
52.
ఇంకా కావాలా అండీ..? ఇంకెందుకు ఆలస్యం ఈ కిందున్న లింక్ పై నొక్కేయండీ... సరేనండి మరి ఉంటాను.. ఉంకో గోదావరి ఆర్టికల్ తో మళ్లీ కలుద్దాం... టాటా!! You can follow him @manapalletooru_andhalu