Article Info Source: Eenadu
కోగంటి కౌశిక్ స్వచ్ఛమైన అచ్చ తెలుగు కుర్రాడు. మన విజయవాడనే కౌశిక్ స్వగ్రామం. చిన్నప్పటి నుండి మనోడు భోజన ప్రియుడు, అది కూడా మన తెలుగు సాంప్రదాయ వంటలంటే చాలా ఇష్టం. పై చదువుల కోసం 2008లో ఎం.ఎస్ చేయడానికి జి.ఆర్.యి రాసి ఒక మంచి కాలేజిలో Join అయ్యాడు. ఇదంతా బానే ఉంది. కాని ఇక్కడే వచ్చింది సమస్య అంతా.. చిన్నప్పటి నుండి తెలుగు వంటలంటేనే ఇష్టపడే కౌశిక్ కు అమెరికా స్థానిక వంటలంటే అంతగా రుచించక పోయేది. తెలుగు, భారతీయ రెస్టారెంట్ల కోసం వెతికి అక్కడ భోజనం చేసేవారు. ఇందుకోసం వందల కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు. 'ఈ ప్రయాణం నేనొక్కడిని మాత్రమే చేయడం లేదు వందలమంది చేస్తున్నారు' అని గుర్తించారు.. తెలుగు రుచుల కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారో అర్ధమయ్యింది.

ఈ Realisation లోనే కౌశిక్ కు ఓ బ్రహ్మండమైన ఆలోచన వచ్చింది అదే 'గోదావరి'. మన తెలుగు రాష్ట్రాలలో గోదావరి వంటలకు మంచి పేరు ఉంది అలా 'గోదావరి రెస్టారెంట్' ప్రారంభించారు. ఏ వ్యాపారమైన స్థాపించిన తొలిరోజుల్లోనే లాభాలు రావు కొన్ని ఒడిదొడుకులుంటాయి అవ్వి దాటి రాటుదేలుతూనే విజయం లభిస్తుంది.. మొదట ఇద్దరు కలసి ప్రారంభించిన ఈ రెస్టారెంట్, కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు.

ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు ఉన్నారు.. కౌశిక్ కి మాత్రం ఉద్యోగం చేస్తున్నగాని మనసంతా గోదావరి మీదనే ఉండేది. ఇలా ఆలోచించి బాధ పడటం కన్నా గోదావరిని ప్రారంభించాలని ఫిక్స్ అయ్యాడు. ముందు చేసిన తప్పిదాలు చేయకుండా ప్రతి వాటిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్నేహితుడు తేజతో కలిసి మొదట బోస్టన్ లో 'గోదావరి రుచులు' ప్రారంభించారు. ప్రారంభం ఆనందంతో సాగినా మనసులో భయం అలాగే ఉంది గోదావరిని మిగిలిన వాటి కన్నా ఉన్నతంగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు పగలు రాత్రి అన్న తేడా లేకుండా విపరీతంగా కష్టపడ్డారు ఆకరికి భార్య గర్భిని అయినా కూడా అదే అంకిత భావంతో కష్టపడ్డారు..

ఈ విపరీతమైన కష్టానికి ప్రతి ఫలంగా గోదావరి ఇప్పుడు ప్రతి తెలుగు వారికి ఇష్టమైన రెస్టారెంట్ అయ్యింది. వాషింగ్ టన్, న్యూయార్క్, షికాగో, కాలిఫోర్నియా, నార్త్ కరోలినా,డల్లాస్, ఫ్లోరిడా లలో విస్తరించి 130 కోట్ల టర్నోవర్ తో దూసుకుపోతుంది. ఈ ఘనతకు గౌరవంగా కౌశిక్ చదివిన కాలేజి(వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VIT) నుండి 'Young Achiever' గా అవార్ఢు కుడా అందుకున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.