సరిగ్గా నెల రోజుల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతం నుండి ఒక రైతు Go Farmz(https://www.gofarmz.com/) రాము కు కాల్ చేశారు.
"రాము గారు అటు రైతులకు ఇటు కస్టమర్స్ కు ఉపయోగపడేలా మంచి యాప్ క్రియేట్ చేశారు, నేను కూడా ఆర్గానిక్ కూరగాయలను పండిస్తున్నాను, నేను కూడా నా భూమిలో పండుతున్న కూరగాయలను మీ ద్వారా అమ్మదలుచుకుంటున్న!! ప్రాఫిట్ ఎలా ఉంటుంది.?" రాము: తప్పకుండా ప్రాఫిట్ గురుంచి తర్వాత మాట్లాడుకుందాము.. మీ పొలం ఎక్కడుందో చెప్పండి, మా టీం వస్తుంది మీ దగ్గరకు..


"నలుగురు సభ్యులు గల టీం రైతు చెప్పిన పొలం దగ్గరికి వెళ్లారు. దూరం నుండి చూడగానే పంట మామూలుగా కన్నా ఎక్కువ గ్రీనరీగా ఉంది. రెగ్యులర్ గా చేసేలానే రీసెర్చ్ మొదలుపెట్టారు. రీసెర్చ్ మొదలుపెట్టిన కాసేపటికే తెలిసిన విషయం ఏంటంటే ఆ రైతు ఆ పంట కోసం DAP వాడారు అని". రైతు కావాలని మోసం చెయ్యాలని అనుకోలేదు "ఆర్గానిక్ వ్యవసాయం అంటే DAP కూడా వాడకూడదు అని అతనికి తెలియదు". ఇదే విషయాన్ని ఆ రైతుకు వివరించి అక్కడి నుండి తిరిగి వచ్చారు. "డబ్బు కన్నా గౌరవం కాపాడుకోవడం ప్రధానం".. మనం తింటున్న ఫుడ్ ఎక్కడ కొన్నామో తెలుసు కాని ఎవ్వరు పండించారో మనకు తెలియదు. ఫుడ్ బాగోలేకపోతే కొన్నచోట అడుగుతాము కాని రైతు అడ్రెస్ కనుక్కొని అతన్ని అడగడం కష్టం. Go Farmz లో కస్టమర్స్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ స్థాయి రీసెర్చ్, జాగ్రత్తలు తీసుకుంటారు రాము (8106670757 )".


ఎలా స్టార్ట్ అయ్యింది.? "షార్ట్ టర్మ్ లో వచ్చేదేది లాంగ్ టర్మ్ లో ఉపయోగపడదు" అందుకే కదా త్వరగా పంట కోతకు రావాలి అని రకరకాల పెస్టిసైడ్స్ వాడుతూ ఒక స్లో పాయిజన్ ని తింటున్నాము. ఇప్పుడు ఆవేర్నెస్ పెరుగుతుంది టేస్టీ ఫుడ్ కన్నా హెల్దీ ఫుడ్ తినడానికే జనం ఇష్టపడుతున్నారు. డబ్బు సంపాదించడం మన లక్ష్యమైతే దాని దారి పది మందికి ఉపయోగపడాలి అని భావించే రాము ఒక పక్క సాఫ్ట్ వేర్ కంపెనీని రన్ చేస్తూనే మరో పక్క "Go Farmz" ను మొదలుపెట్టారు. ఇక్కడ పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండిన పంటలను మాత్రమే అమ్ముతారు. రైతులు తమ పంటలను నేరుగా ఇక్కడ అమ్మవచ్చు. కస్టమర్స్ నేరుగా ఇక్కడ నచ్చిన తాజా కూరగాయలు, పండ్లు, మిల్లెట్స్ కొనుక్కోవచ్చు.


హోమ్ డెలివరీ: "సెలెక్ట్ చేసుకున్న vegetables, fruits ఒక్క రోజుల్లో ఇంటికి చేరుస్తాము రెండు రోజుల్లో చేస్తాము" అనే వారిలో చాలా వరకు హోమ్ డెలివరీ చేస్తున్న వారు ఫ్రిడ్జ్, కోల్డ్ స్టోరేజ్ వాడుతున్నవారే. ఇలా చెయ్యడం కస్టమర్స్ ను ఒక రకంగా మోసం చేస్తున్నట్టుగానే భావిస్తాడు రాము. Go Farms లో మనం బుక్ చేసుకున్నవాటిని వారం లోపల నేరుగా పొలం నుండి కోతలు జరిగి వెంటనే కస్టమర్స్ కు అసలైన తాజా పంటను అందిస్తారు.


వివిధ రాష్ట్రాల నుండి కూడా: కొన్ని రకాల పంటలు మన వాతావరణంలో పండలేవు. అదీకాక మంచి క్వాలిటీ గల ఫుడ్ ఒక ప్రత్యేక వాతావారణంలోనే పండుతాయు. యాపిల్స్ ను హిమాచల్ ప్రదేశ్ నుండి, క్యారెట్ ఊటీ నుండి, ఆరెంజ్ కోసం నాగ్ పూర్ ఇలా కొన్ని పంటల కోసం వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడి రైతులతో అనుసంధానమయ్యారు. మిల్లెట్స్, వెజిటేబుల్స్ కోసం లక్షణంగా మన దగ్గరే తీసుకుంటున్నారు.


ఆర్గానిక్ అందరిది: జనాభాలో 85 శాతానికి పైగా ఉన్న మధ్య తరగతి కుటుంబాలు ఆరోగ్య కరమైన భోజనం తినాలనే ఉద్దేశ్యంతో రైతులతో మాట్లాడి బయట ఒక కేజీ ఆర్గానిక్ టమాట రూ.100 వరకు ఉంటే రాము రూ.35 కే ఇస్తున్నారు. రాము అమ్మ నాన్నలు, ఇతర బంధువులు వ్యవసాయమే చేసేవారు. ప్రస్తుతం శంకర పల్లి లో 35 ఏకరాలలో ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. అంతే కాదు ఇక్కడ ఆర్డర్ చేసే vegetables, fruits, millets ఎక్కడ పండిస్తున్నారు, ఏ రైతు పండిస్తున్నారు అనే డిటెల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. కేవలం ఒకే ఒక్క ఆవుతో రూపాయి పెట్టుబడి లేకుండా పాలేకర్ గారు ప్రతిపాదించిన జీరో బడ్జెట్ ఫార్మింగ్ పద్దతులను రాము రైతులకు వివరిస్తూ వారి అభివృద్ధికి కారణం అవుతున్నారు. కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ కాల్స్ కస్టమర్స్ నుండి కాక రైతుల దగ్గరి నుండే ఎక్కువ వచ్చాయి. దీనికి కారణం బాగా చదువుకున్న వారు కూడా వ్యవసాయం లోకి అడుగుపెడుతుండడమే.. "ప్రకృతికి మనం ఏది ఇస్తే అదే మనకూ ఇస్తుంది" ఈ చిన్ని లాజిక్ తో రాము తను ఎదుగుతూ ప్రకృతిని ఆరోగ్యవంతం చేస్తున్నారు..
Go farmz లో ఆర్గానిక్ కూరగయాలు, పండ్లు కొనాలనుకున్నా అమ్మాలనుకున్న ఇక్కడ ప్రయత్నించవచ్చు: 8106670757 Android App link: CLICK HERE IOS App Link: CLICK HERE