ఇదొక మంచి ఆశయం కోసం రూపొందించబడిన సంస్థ. చెడు ఆలోచనలతో వేరే విధంగా వాడుకోవాలని ప్రయత్నించాలనుకునేవారు దయచేసి మరోసారి ఆలోచించండి, మీ వల్ల నిజమైన వ్యక్తికి అందాల్సిన సహాయం అందకపోవచ్చు.
ప్రమాదం, అవసరం ఎటునుంచి ఎలా వస్తుందో చెప్పలేము. కుటుంబ సభ్యులు హాస్పిటల్ బెడ్ మీద బాధ పడుతుంటే వారి దగ్గర ఉండాల్సిన సమయంలోనూ వారికి దూరంగా వెళ్లి డబ్బు కోసం వెతకడం అత్యంత బాధాకరం. ఐతే ఈ బాధలకు ఉపశమనం లభించే రోజులొచ్చాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఎడ్యుకేషన్ ఫీజు కావచ్చు. మన అవసరాన్ని GoodClap టీం వారికి చెబితే వెంటనే స్పందించి ప్రజల సపోర్ట్ ద్వారా మన అవసరాలకు కావాల్సిన డబ్బును సమకూరుస్తారు. Goodclap మన తెలుగువాడైన శశాంక్ గారు గొప్ప ఉద్దేశ్యంతో ప్రారంభించారు. దాదాపు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటికి ఎంతోమంది అవసరాలను తీర్చగలిగారు.
గుడ్ క్లాప్ కు రూపాయి నుండి లక్షరూపాయలు సహాయం చేసిన దాతలు ఉన్నారు.
ఎలా పనిచేస్తుంది.?
ప్రాణాంతకర జబ్బులు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. మన దగ్గర లేనప్పుడు, బంధువులు తెలిసినవారు ఇంతకుమించి సహాయం చెయ్యలేరు అనుకున్న సమయాన GoodClap వారిని సంప్రదించవచ్చు. భార్గవ, రాజు, పావని, అనురాగ్, ఫణి కలిసిన టీం సభ్యులకు మన కష్టాన్ని అవసరాన్ని తెలియజేస్తే వారు మన కష్టాన్ని ఒక స్పష్టమైన ఆర్టికల్ రూపంలో పొందుపరిచి, ఫొటోలు, హాస్పిటల్ రిపోర్ట్ మొదలైనవి వెబ్ సైట్ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఈ లింక్ ట్విట్టర్, వాట్సాప్, ఫేస్ బుక్ వివిధ రకాల సోషల్ మీడియాలలో ఎలా ఎక్కువమందికి రీచ్ చెయ్యాలి లాంటి ప్రాధమిక అంశాలను కూడా బంధువులకు వివరిస్తారు.
మోసం చేస్తారేమో.?
ప్రేమ, బాధ్యత మంచి మనుషులుంటే వారిని సులభంగా మోసం చెయ్యవచ్చు అనే ఆలోచనలతో కొందరు మా బంధువుల ఆరోగ్యం బాలేదు, కాలేజి ఫీజు కట్టాలి అనే ముసుగులో అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావం నిజమైన బాధితులపై అలాగే సహాయం చెయ్యాలనుకునేవారిపై కూడా పడుతుంది. శశాంక్ ఇంకా వారి టీం ఇటువంటి వాటిని సమర్ధవంతంగా ఎదుర్కుంటారు. గుడ్ క్లాప్ ను అప్రోచ్ అయిన బాధితుల వివరాలు వివిధ రకాలుగా పరిశీలించి అన్ని రకాలుగా వెరిఫై చేసిన తర్వాతనే వారి కథను వైబ్ సైట్ లో పొందుపరుస్తారు. బాధితుల అకౌంట్ డిటైల్స్ ఇక్కడ పొందుపరచరు, ముందుగా గుడ్ క్లాప్ అకౌంట్ లోకి చేరుతుంది. దాని నుండి నేరుగా బాధితుల హాస్పిటల్ దగ్గరికి వెళ్లి సహాయం అందజేస్తారు.
సహాయమనేది డబ్బు రూపంలోనే కాదు వ్యక్తుల కష్టాలను కొంతమందికి తెలియజేసినా అది సహాయమే.
మనిషికి మనిషే సహాయం:
మనం ఎదుటి వ్యక్తికి ఏది ఇస్తామో అదే మనకు తిరిగివస్తుంది. ప్రేమను పంచితే ప్రేమ, గౌరవాన్ని చూపిస్తే గౌరవం, మోసం చేయాలనుకుంటే మనకు మోసమే ఎదురవుతుంది. గుడ్ క్లాప్ ద్వారా సహాయం పొందిన వారు ఎందరికో సహాయం చెయ్యాలని కోరుకుంటున్నారు, సమాజం పట్ల గల వారి బాధ్యత కూడా మరింత పెరిగింది. కల్యాణి(పేరు మార్చాము) గారు ఆరోగ్య కారణాల వల్ల ప్రజల నుండి సహాయం పొందారు. నేను ఒకరి నుండి సహాయం పొందాను నా లాగే ఎందరో ఎదురుచూస్తూ ఉంటారు అనే ఆలోచనతో తనకు కుదిరిన సందర్భాలలో వీలైనంత డబ్బును టీం కు అందజేస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఇక్కడ చాలామంది ఉన్నారు.
సమస్య తెలుసుకోకుండానే గుడ్ క్లాప్ కు ప్రతి నెల 150 మంది దాతలు ఆర్ధిక సహాయం పంపిస్తూ ఉంటారు.
ఫండ్ రైజింగ్ కోసం కాలేజీలకు, కార్పొరేట్ సంస్థలకు:
ప్రతి వారం రెస్టారెంట్స్ లో, గేమింగ్ క్లబ్ లలో వివిధ చోట్ల డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాము, అక్కడ వెచ్చించేది మంచి నోబుల్ కాజ్ కోసం వినియోగించండి అని గుడ్ క్లాప్ టీం కాలేజీలకు, వివిధ సంస్థల దగ్గరికి వెళ్తుంటాయి. అక్కడ Fun Activities, చిన్నపాటి Games ఆడిస్తూ ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. బయట ఖర్చు చేసి కన్నా ఇలా అత్యవసర అవసరాలకు వెచ్చిస్తున్నామన్న తృప్తి విద్యార్థులలో, ఉద్యోగస్థులలో కలుగుతుంది.
GoodClap గురించిన మరింత సమాచారం, ఇంకా సహాయం చెయ్యాలనుకున్నా పొందాలనుకున్నా క్రింద సంప్రదించవచ్చు.
Website: https://goodclap.com/ Phone: 7702065511, 9849856213