Contributed by Sravya Gudipati
నన్ను ముద్దుగా పిలిచే పిలుపు ఏ స్వరంలో వెతికినా ఇంక వినిపించదు!! నాకోసం నువ్వు దాచి ఇచ్చే రూపాయలో ఉన్న సంతోషం నేను సంపాదించే రూపాయలో కలగదు!! సెలవల్లో నీ దగ్గరికి వచ్చినప్పడు పెట్టె ముద్దు, రేపు వెలుదువు మళ్ళీ ఎప్పిటికి వస్తావో అనీ ప్రేమగా కసిరే నువ్వు ఇంక కనిపించవు!! ఇంక నీ జ్ఞాపకాలని చిత్రీకరించుకోలేను!!చిత్రీకరించినవి నువ్వు గుర్తుకువచ్చినప్పుడు చూసుకుంటూ !! నువ్వు మాతో ఇంక కొన్ని సంవత్సరాలు ఉండి వుంటే బాగుండు అని తలచుకుంటూ ఉంటాను!!
నీతో గడిపింది తక్కువ సమయమే అయిన నా జీవితంలో నీది ఒక ప్రత్యేక స్థానం!!నీ చివరి రోజుల్లో నువ్వు చెప్పిన మాటలు చిన్న పిల్లల మాటలుగా భావించి మేము నవ్వుకున్న క్షణాలు తిరిగిరాలేనివి!! నీ కథ విన్నప్పుడు కలిగిన అనుభూతి !!నీ పాత్రలో నన్ను ఉహించుకొని నేను నీ అంత బాధ్యతగా, నిస్వార్ధంగా, ఇచ్చిన మాట మీద నిలబడి ఉండలేను ఎవరు ఉండలేరు అనిపించి నీ మీద పెరిగిపోయిన గౌరవం!! నాన్నమ్మ!!! నీ కల్లాకపటం లేని తిట్లు! నీ కల్మషం లేని ప్రేమ!! మర్చిపోలేనిది ఇంక ఎప్పటికీ దొరకలేనిది!! నీ తొంబైయేళ్ల జీవితంలో కష్టసుఖాలని ఓర్పుగా నేర్పుగా ఎదురుకుని పండువు అయి రాలిపోయి స్వర్గాన్ని చేరుకున్నావు అని ఆసిస్తూ అశృనివాళి!!