Meet The Couple Behind The 'Green Walls' & Dream Gardens In Telugu States!

Updated on
Meet The Couple Behind The 'Green Walls' & Dream Gardens In Telugu States!

ఇద్దరి వ్యక్తుల ఆలోచనలు, అభిరుచులు ఒకే విధంగా ఉంటే వారి అనుబంధం ధృడంగా ఉంటుంది. సోనాలి గారి ఇష్టాలు, శ్రీకాంత్ గారి ఆలోచనలు సరిగ్గా ఒకే విధంగా ఉండడంతో 1995లో వివాహం చేసుకున్నారు. లక్ష్యం డబ్బు సంపాదనే ఐతే అందుకు గల మార్గం సమాజానికి ఉపయోగపడేలా ఉంటే ఆ వృత్తి జీవితంలో ఎంతో తృప్తి ఉంటుంది. అలా ఇద్దరికి చెట్లన్నా, పచ్చని ప్రకృతి అన్నా ఎంతో ఇష్టం.. మనకు నచ్చిన రంగంలోనే వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించకూడదు అనే ఉద్దేశ్యంతో మొదట ఆర్టిఫీషియల్ ప్లాంట్స్ వ్యాపారం మొదలుపెట్టారు.

మొదటి వాల్: మనం చేస్తున్న పనిలో నిజాయితీ, నమ్మకం ఉంటే అది ఖచ్చితంగా సక్సెస్ సాధింస్తుంది. ఆర్టిఫీషియల్ ప్లాంట్స్ అచ్చం అసలైన మొక్కలులా ఉండడంతో విదేశాలకు ఎగుమతి చేసేంత స్థాయికి వారి సంస్థ ఎదిగింది. ఇదిలా ఉండగా ఓ ప్రైవేట్ ఆర్టిటెక్చర్ వారు సోనాలి గారిని సంప్రదించి గ్రీన్ వాల్ తయారు చేయాలగలరా అని అడిగారు. సోనాలి గారికి(9885018616) ఇలాంటి వాటిపై అవగాహన లేదు "If we want to do anything new we don't need any experience except vision" అన్నట్టుగా గ్రీన్ వాల్ తయారు చేస్తానని అంగీకరించారు. వినియోగదారులు ఆశించినది మాత్రమే కాదు వారు ఊహించిన దాని కన్నా ఎక్కువ అందించినపుడే వారు మరింత సంతృప్తి చెందుతారు. అలా మొదటి గ్రీన్ వాల్ కోసం ఎంతగానో రీసెర్చ్ చేసి గ్రీన్ వాల్ ని అందించారు. అది వారికి మాత్రమే కాదు దానిని చూసిన మిగితావారికి కూడా అద్భుతంగా నచ్చడంతో ఒక సంస్థ నుండి మరో సంస్థకు విస్తరించి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ విమానాశ్రయంతో పాటు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, జి.హెచ్.ఎం.సి కార్యాలయానికి, కొన్ని వందల ఇళ్ళకు Green Wall (https://www.greenwallindia.in/) విస్తరించింది.

గ్రీన్ వాల్ ఉపయోగం: మనం చూస్తున్నాం దేశ రాజధానిలో పొల్యూషన్ ప్రమాధకర స్థాయిలో ఉండడంతో ఎంతటి ఇబ్బందులు పడుతున్నారు అని.. గ్రామాలలో ఇబ్బందులు లేవు గాని ఈ నగరాలలో మాత్రం ఒకటి రెండు మొక్కలను పెంచాలన్నా స్థలం లేక ఇబ్బందులు పడుతున్నాం. కుండీలలో పెంచుతున్నా కాని అది అంతగా సౌకర్యవంతంగా ఉండడం లేదు. ఈ గ్రీన్ వాల్ ను ఇంటి లోపల కాని, ఇంటి బయట కాని అమర్చుకోవచ్చు. వీటికి నీటిని అందించడం కూడా చాలా సులభం. ట్రే లో నీటిని అందించే పంప్స్ కూడా అమర్చడంతో చిన్న ట్యాప్ తిప్పితే నీటిని తీసుకుంటుంది. ఇలా ప్రతిరోజు 5నిమిషాల పనితో సహజ సిద్ధమైన ఆక్సిజన్ ను మనం గ్రహించవచ్చు.

జూబ్లీహిల్స్ రోడ్ నెం10లో ఉన్న వీరి నర్సరీ ఎన్నో వేల మొక్కలతో అందంగా అలంకరించబడి ఉంటుంది. మొక్కలను పసి పాపలా పెంచి పెద్ద చేయడానికి 12మంది వర్కర్స్ సహాయంతోనిర్వహించబడుతున్నది. ఈ మొక్కలన్నీ పెస్టిసైడ్స్ కాకుండా పూర్తిగా సాంప్రదాయ ఎరువులు వాడడంతో మొక్కలలో స్పష్టమైన జీవం ఉట్టిపడుతుంటుంది. ప్రతి ఇంటిలో ఓ గ్రీన్ వాల్ ఉండాలి అనే లక్ష్యంతో ఈ దంపతులు ముందుకు సాగిపోతున్నారు.