మిగిలిన దేశాల మట్టిలో పాళీ క్లోరినేటెడ్ బైఫినైల్స్ గ్రాముకు 6 నానో గ్రాములు ఉండగా మన దేశంలో అది 12నానో గ్రాములు ఉంది. మన దేశ మట్టిలో ఇంతటి కాలుష్యం పెరిగిపోవడానికి గల ప్రధాన కారణాలలొ ఎలక్ట్రానిక్ వ్యర్ధాల పాత్ర కూడా చాలా కీలకం. ఈ- వ్యర్ధాలను సరైన పద్దతిలో నాశనం చేయకపోవడం వల్ల మట్టి కూడా విషతుల్యమయ్యి చావుకు వేగంగా పరిగెడుతున్నాము.
మన భారత దేశంలో సంవత్సరానికి ఎన్ని టన్నుల ఈ-వ్యర్ధాలు ఉత్పత్తి అవుతున్నాయో తెలుసా "అక్షరాల 19 టన్నులు". ఇంతటి స్థాయిలో ఉత్పత్తి అవుతున్న వ్యర్ధాలలో కనీసం కొంతవరకు రిసైకిల్ చేసినా కానీ సమాజానికి ఉపయోగపడడమే కాకుండా తన భవిషత్తుకు ఉపయోగపడుతుందని భావించిన అనిల్ విశాఖపట్నంలో "గ్రీన్ వేవ్స్"(7093351666)ను స్టార్ట్ చేశారు. అనిల్ ప్రతిష్టాత్మక సి.బి.ఐ.టి లో ఇంజినీరింగ్ పూర్తిచేసి, రొటీన్ గా కాకుండా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కంప్లీట్ చేసి తర్వాత ఈ- వేస్ట్ రీసైక్లింగ్ చేస్తున్న కంపెనీలో సంవత్సరం పాటు పనిచేశాడు.
ఈ-వేస్ట్ రీసైక్లింగ్ చేసే సంస్థలు మనదేశంలో సుమారు పదికిమించి గాని లేవు. మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం అసలే లేవు. రాబోయే డిమాండ్ ను ముందుగానే పసిగట్టిన అనిల్ 2016లోనే గ్రీన్ వేవ్స్ సంస్థ కార్యక్రమాలను మొదలుపెట్టారు. మన ఇంట్లో పాడై పోయిన పవర్ కేబుల్ దగ్గరినుండి మొబెల్స్, కంప్యూటర్ మొదలైన అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా వీరు కొనుగోలు చేసి అందులో పనికి వచ్చే వాటిని తీసుకుని అమ్మకాలు చేస్తుంటారు. అలాగే వీటి ద్వారా మన ఇంట్లో డెకరేటింగ్ ఐటమ్స్ కూడా అందంగా తయారుచేస్తారు.
ప్రజలలో ఈ వ్యర్ధాల గురించి అంతగా అవగాహన లేదు. ఇంట్లో ఏవైనా పనిచేయకపోతే వాటిని స్క్రాప్ షాప్ లో అమ్ముతుంటారు. వారికి కూడా అవగాహన లేకపోవడం వల్ల పవర్ సప్లై వైర్లను కాపర్ కోసం తగులబెట్టి కాలుష్యాన్ని పెంచుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఈ సంస్థ ముందు ప్రజలలో అవగాహన కల్పించి ఆ తర్వాత సమాజం కోసం వారిని భాగం చేస్తున్నారు ఏ నష్టం లేకుండా.