Contributed By Kalki Thota
కరోనా ఎఫెక్ట్ వల్ల వచ్చిన హాలిడేస్..హైదరాబాద్ నుండి కాకినాడ కి వచ్చేసాను..రోజంతా టీవీ లో కరోనా గురించి వచ్చే న్యూస్..మొబైల్స్ లో ఫార్వర్డ్ మెస్సేజెస్..బయటకి వెళ్లకూడని సిట్యువేషన్..అంత కలిసి మైండ్ లో ఒక గందరగోళం నడుస్తుంది.ఆ గందరగోళం లో ఫ్యూచర్ గురించి థాట్స్,ఏవేవో సెల్ఫ్ ఫిలోసిఫీస్..ఆలోచనలతో నిద్ర వచ్చేసింది..సడన్ గా ఉదయం మూడు గంటలకి పవర్ పోవడం తో మెలకువ వచ్చేసింది.అసలే సమ్మర్ బాగా ఉక్కపోతగా ఉండడం తో మేడ మీదకి వెళ్ళాను..దూరంగా ఫెర్టిలైజర్ కంపెనీ చిమ్నీస్ నుండి వచ్చే పొగ ఆకాశం లోకి కలుస్తున్న దృశ్యం.. ఇంకోవైపు సముద్రం నుండి తడి చలిగాలి వీస్తున్నది..ఆ చలి గాలి మైదానాలు దాటుతూ, వీధుల మీదగా వీస్తూ నా మీద దాడి చేస్తుంటే శరద్రాత్రి చీకటి లో ఎడమ పక్క అనంతమైన మైదానం ,కుడి పక్క అవధి లేని సముద్రం మధ్యలో నేనునట్టు గా అనిపిస్తుంది..గాలి విసురుకు ఎదురుగా ఉన్న ఎండిపోయిన పసుపు రంగు ఆకులు అలా ఒక వైపు ఎగురుతుంటే ఇంకో వైపు ఒడ్డుకి తగిలి చింది పడే అలల సంగీతం దూరం నుండి వినిపిస్తుంటే ,తన జ్ఞాపకం నాకు దగ్గర గా చేరింది.. కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి చల్ల గాలి నన్ను పలకరించిన రోజు..
10th క్లాస్ 1st పబ్లిక్ ఎగ్జాం రోజు..ఎగ్జాం సెంటర్ బయట గాలి లేక చెమటలు పడుతుంటే కర్చీఫ్ తో తుడుచుకుంటూ ప్రిపేర్ అయ్యింది రివైజ్ చేస్తున్న..ఎగ్జాం బెల్ ఎప్పుడు కొడతారో అని చిన్న టెన్షన్,సడన్ గా ఒక చల్లటి గాలి పలకరించింది ,చూస్తే ఎదురుగా ఒక స్కూటర్ వచ్చి ఆగింది, స్కూటర్ మీద ఒక అమ్మాయిని తన ఫాదర్ డ్రాప్ చేసి వెళ్తున్నారు..ఆ అమ్మాయి ఎలా ఉంది అనేది నేను వివరించలేను,ఖచ్చితంగా తనని చూడగానే చందమామ కనిపించలేదు గుర్తుకురాలేదు..ఆ అమ్మాయి తనలానే కనిపించింది..జెన్యూన్ గా ఒకే ఒక్క ఫీలింగ్..బెల్ ఎప్పుడు రింగ్ అవుతుందో అన్న టెన్షన్ పోయి ఈ అమ్మాయి కూర్చునే క్లాస్ లో నాకు ప్లేస్ వస్తే ఎంత బాగుండేదో అని అనిపించింది..ఆలోచనలని బ్రేక్ చేస్తూ సడన్ గా బెల్ రింగ్ అయ్యింది.అందరూ స్టూడెంట్స్ లోపలకి వెళ్ళే హడావిడి లో ఉన్నారు..ఆ అమ్మాయి మిస్ అయ్యింది.నేను నా హాల్ టికెట్ నెంబర్ ఉన్న క్లాస్ ని వెతుకుతూ ఫైనల్ గా ఒక క్లాస్ లో కూర్చున్నాను.చుట్టూ చూసా ఆ అమ్మాయి లేదు ,మిస్ అయిన ఫీలింగ్ కలిగింది కాని అదేంటో వెంటనే మిస్ అయిన ఇప్పుడు చేసేది ఏమి లేదు అని మళ్ళీ పాడ్ మీద హెడ్ పెట్టి తెలుగు పద్యం రివైజ్ చేస్తున్నా..మైండ్ లో తెలుగు సార్ క్లాసు లో పాడుతున్న పద్యం రివైండ్ అవుతుంటే మళ్ళీ సడన్ గా గాలి తగులుతుంది లేచి చూస్తే ఇన్విజిలేటర్ ఫ్యాన్ ఆన్ చేసాడు..ఇన్విజిలేటర్ హాల్ టికెట్ నంబర్స్ చదువుతుంటే రిలేటెడ్ పర్సన్ ఎస్ సార్ అని చెప్తున్నారు..ఇన్విజిలేటర్ ఒక నెంబర్ చదివితే ఎస్ సార్ అని ఒక అమ్మాయి వాయిస్ వినిపించింది,పక్కకి తిరిగి చూస్తే నా బెంచ్ పక్క బెంచ్ లో విండో సైడ్ నేను బయట చూసిన అమ్మాయి కుర్చుని ఉంది.. మిస్ అయ్యి మళ్ళీ క్లాస్ లో తను నాకు కనపడగానే అర్ధం కాని ఒక కొత్త ఫీలింగ్ ప్రతి రోజు నాలో...
తన రూపం తో పరిచయం క్షణం, కాని తర్వాత క్షణం లోనే నా మనసే తనదయ్యే ఎలా? క్వశ్చన్ పేపర్ నాకు ఇచ్చేంత వరుకు నన్ను నేను వదిలేసుకోవడం అంటే ఏంటో తెలుసుకున్న వేళ..
మరుసటి రోజు తన రాక కోసం నిరీక్షిoచిన కొన్ని నిమిషాల తరువాత తను కనిపించిన క్షణం లో తెలియని ఆనందం అనే ఎమోషన్ కి దగ్గర గా ఉన్న ఫీలింగ్, ఎవరెస్ట్ కన్నా ఎత్తైన నా ఊహల్లో ఉన్న శిఖరమంత..
క్వశ్చన్ పేపర్ ఈజీ గా వచ్చినప్పుడు ,ఇన్విజిలేటర్ ముందుకి వెళ్ళినప్పుడు పక్క వాడి ఆన్సర్ షీట్ చూడాల్సిన అవసరం లేకుండా ధీమాగా ఆన్సర్స్ రాస్తూ తన వైపు చూసే వీలు కలిగినప్పుడు వచ్చే మాధుర్యం ముందు ఏ సంతోషాలైన వృధా సదా..
కాని మాథ్స్ క్వశ్చన్ పేపర్ చూసిన మరు క్షణం పేపర్ లో ప్రశ్నల కన్నా వాటికి ఆన్సర్స్ ఎలా రాయాలన్న నా మైండ్ లో ప్రశ్నలే ఎక్కువ..అప్పుడు తనని కాకుండా పక్క వాడి ఆన్సర్ షీట్ చూడాల్సి వచ్చినప్పుడు ,ఎవరెస్ట్ కన్నా ఎత్తైన నా ఊహల్లో శిఖరం నుండి కిందకి పడటం ఎలా ఉంటుందో నాకు తెల్సింది..
ఇలా రోజులు గడుస్తుండగా ,ఏ రోజు కూడా తన కోట దాటి బయటికి రాని తన చూపు కోసం ఎదురు చూసి ,నిర్లిప్తంగా నేను వెళ్లిపోతునప్పుడు తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఒంటరి పడవ లాంటి భావం నాలో.. లాస్ట్ డే ఎగ్జాం ఎండ్ అయ్యింది.. వేకువున తారని వదిలేసి మాయమవుతున్న చీకటిలా తను క్లాస్ నుండి వెళ్లిపోతుంటే ,చీకటిని వదలలేక చూసే తారలా నేను వెళ్ళిపోతున్న తనని చూస్తుండగా శూన్యం తో ఎదో అంతులేని ఆలోచన నాలో సాగిపోతుంది.. ఆన్సర్ షీట్ ఇచ్చేసి నేను ఎగ్జాం సెంటర్ బయటికి వచ్చే టైం కి తను వాళ్ళ ఫాదర్ తో పాటు స్కూటర్ మీద వెళ్ళిపోతుంది, అదే తనని నేను చివరి సారిగా చూడడం..
వీచే గాలి నన్ను తాకుతుంటే తన రూపం ని అందుకోలేని నా కళ్ళకి ఆశ ఆశగా మిగిలిపోయింది.. నా మనసులో ఉండే సముద్రానికి అవతల ఒడ్డుకి తను ఒక జ్ఞాపకం లా చేరిపోయింది.. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత బయట ఉన్న ఈ సముద్రం నుండి వీచే గాలి నన్ను తాకగానే తన జ్ఞాపకం నన్ను చేరింది.. ఆ జ్ఞాపకాన్ని కలయ చూడగా చివరిలో మళ్ళీ తన రూపాన్ని అందుకోవాలని నా కళ్ళకి కలిగిన ఆశకి చివరికి మిగిలే నిశబ్దం సమాధానం గా మిగిలింది...
వేకువని ఉండే చీకటి నెమ్మదిగా మాయం అయ్యింది కాని ...ఆ 11 రోజులు తనకి చేరువలో గడిచిన క్షణాలు జ్ఞాపకాలు గా మారి ప్రతి గ్రీష్మ ఋతువులో ఒక చల్లటి గాలి లా నన్ను పలకరిస్తూనే ఉంటాయి