This Short Story Of A Guy Whose Ultimate Life Aim Is To Grow A Small Plant In Life Is ROFL

Updated on
This Short Story Of A Guy Whose Ultimate Life Aim Is To Grow A Small Plant In Life Is ROFL

Contributed by Sudhakar K

ఉదయాన్నే నిద్రలేవగానే ఓ ప్రశ్న నన్ను తొలవడం మొదలు పెట్టింది.... గత వారంరోజుల నుండీ ప్రదీప్ గాడు, "మొక్కను కొనుక్కుందాం.. రూమ్ లో పెంచుకుందాం" అంటున్నాడు కదా! అంత సులభమైన పనేనా అని ఆలోచిత్తా పడుకున్నా..అందుకే పొద్దున్నే ఈ ఆలోచన్ల బడ్డ.... మొక్కను పెంచుకున్నకాడ్నించి దానికి నీళ్ళుబొయ్యాల (నేను చిన్నపిలగాడప్పుడు, నీళ్లు బోసుకోవడం అంటే తానం సెయ్యడం...సబ్బుల్లేవ్..సాంపూల్లేవ్.. గబా గబా గుమ్మరిచ్చుకొనుడు..ఇంట్లకు ఉరుకుడు.." ఏరా !! అయిపొయిందా ఇంతలోకే... ఆ కాళ్లకు మట్టే పోలేదు..మళ్ళి బో.. అని అమ్మంటే(గద్దిస్తే) మళ్లీ గాబుకాడికురుకుడు..అట్టా రెండుసార్లు తానం జెయ్యాల్సొచ్చేది...." బళ్ళో మాస్టోరు.. " రోజుకు రొండుసార్లు స్నానం చెయ్యాలర్రా " అంటే, " నేను జేత్తానండీ" అని జెప్పేటోన్ని..పాపం ఆయనేమో ఉదయం ఒకసారి.. సాయంత్రం ఒకసారి చేస్తున్నాడేమో అనుకొనేవాడు....) ఆ మొక్కకి ఎండ తగుల్తొందో లేదో చూడాల...బోల్డంత తతంగం ఉంటది. ఏం జెయ్యాలబ్బా అని ఆలోసించతా ఉన్న.... అయినా..మొక్కల్ని నాటడం అంతకష్టమైన పనయితే !! అశోకుడు ఎట్లా జేసినాడబ్బా!!.. అశోకుడంటే గుర్తొచ్చింది... " అశోకుడు రోడ్డుకిరువైపులా చెట్లను నాటించెను " అని చదివినప్పుడల్లా, అయితే గియితే మెక్కలు నాటించాలి గానీ, చెట్లెట్టా నాటించాడబ్బా!! అని ఆశ్చర్యం పోతావుండేవోన్ని...అట్టా పోతావుంటే.. ఒక రోజు దార్లో ఓ యాపచెట్టు(చెట్టు అంటే చెట్టే.. మొక్క కాదు) కనిపించింది..ఓ యబ్బ.. నేన్ గూడా ఓ చెట్టు మాఇంట్ల నాటదామని ఆలోచన జేసిన...అనుకొన్నదే ఆలస్యం... యాపసెట్టు కాడికి బోయి,దాన్ని వాటేసుకొని...బూమిల్లోంచి బైటకు లాగతా వున్నె...అట్ట సానాసేపు లాగినలే.. అయినా అది వస్తేగదూ...ఇంగ మనవల్లగాదురబ్బాయ్ అనుకొని ఇంటికొచ్చిన.. ఇంట్లోకి బొతావుంటే దూరంనుండి యెవురో కేకేసినట్టు అనిపించి యెనక్కి దిరిగిన. మా శంకరం మావ.. " ఏం చేసినావ్ రా! చెమట్లు బట్టినయ్?" అని అడిగిండు.. దానికి సమాదానమైతే ఇయ్యలే నేను .. "మామా! నువ్వెప్పుడన్న చెట్లను నాటినవా"? అని అడిగిన.. "హయ్యో... రా..మ.. యెన్ని చెట్లను నాటితే నేనింత వాన్నయ్యాను" అన్నాడాయన..ఇంతలో టీ.వీ.లో అదేదో కామెడీ డాన్స్ ప్రొగ్రామ్ వస్తుంటే లోనికి పరిగెత్తాన్నేను... ఈ రొజు శనివారం... మొక్కను నాటాల్సిందే...