Contributed by Pravarsh Malladi
నా గడ్డంతో ఏంటయ్యా నీ కొచ్చిన అడ్డం…..అన్నాడు శర్మ ఆదివారం రోజున మంగళాడు గడ్డం గీయమంటారా…?? అసహ్యం గా ఉంది …అనగా…. గబుక్కున కత్తెరను చంపల నుండి మళ్ళిoచాడు మంగళగాడు. నిత్యం రెండు పూటలా సంధ్యావందనం , స్నాన పానాలు ఆచరించి ప్రతి నెల క్షవరసాలకు వెళ్ళి పరిశుభ్రంగా ఉండడం అలవాటైన శర్మ నోట ఇటువంటి మాట వినడం ఇదే మొదటిసారి అనుకున్నాడు మంగళాడు (శశి). నెల గడిచింది……సరిగ్గా ప్రతి నెల క్రమం తప్పకుండా 7వ తేదిన….క్షవరసాలకు వచ్చే శర్మ కోసం ఉదయం నుండి వేచి చూసి అలిసిపోయాడు శశి.సాయంత్రం ఐదు అవుతోంది ఇంకా శర్మ రాలేదని చూసి సంధ్యా సమయం అయ్యాక ఇక రాడని నిర్ధారణ కొచ్చి ఇంటికి చేరి భోజనం చేసుకుని శర్మ ఎందుకు రాలేదు అని ఆలోచించడం మొదలు పెట్టాడు…….కొంపతీసి గడ్డం బాలేదు అన్నానని కోప్పడి రాలేదా….. లేదులే ఎదో పనిలో పడి మరిచి ఉంటాడని తనలో తాను అనుకుని నిద్రలోకి జారుకుంటాడు. ఇంతలో గుబురుగా పెరిగిన గడ్డం చూసి ఇంట బయట అంతా శర్మను “సులేమాన్ శర్మ” అని పిలవసాగారు. చుట్టూ ఉన్న వారి పోరు రోజు రోజుకు పెరుగుతున్నా పట్టించుకోకుండా గడ్డం పెంచసాగాడు…ఎందరు ఎగతాళి చేసినా పట్టించుకోలేదు…అలా 2వ నెల గడిచింది……
ఎప్పటిలాగే శర్మ కోసం శశి ఉదయం నుండి ఎదురుచూసాడు….కాని శర్మ రాలేదు. అప్పటికే అరా కోరా వచ్చే బేరాలతో శిథిలావస్థలో ఉన్న క్షవరసాలను మెల్లగా సాగిస్తుంటే ఇలా ప్రతి నెల వచ్చే శర్మ కూడా మనేసాడని బాధపడ్డాడు……కచ్చితంగా శర్మకు తన మీద కోపం వచ్చి ఉంటుందని అనుకున్నాడు. నిజానికి శర్మ రాకపోడానికి గల కారణం వేరే ఉంది. ఆర్ధికంగా బలహీనుడైన శశి పరిస్థితి తెలిసే తన వల్ల శశి కి ఆ నెల నాలుగు డబ్బులు వస్తాయని శశి దగ్గరే క్షవరానికి వెళ్ళే శర్మ అంత చిన్న మాటకి కోప్పడ్డాడు అని శశి చాలా బాధపడ్డాడు . ఈ నెల కూడా క్షవరానికి పోకపోడం తో గడ్డం మరింత పెరిగింది.
సరిగ్గా 2 రోజుల తరువాత శర్మ వాళ్ళ బంధువులంతా ఇంట్లో ఎదో శుభకార్యం ఉందని వచ్చారు ……..వచ్చిన వారు కుదురుగా ఉండరు కదా…… వాళ్ళ బాబాయ్ వచ్చి …ఎరా శర్మ నీకు క్షవరం చేసేవాడు పోయాడా …ఏంటి ఆ గడ్డం అంత ఉంది …. లేక ఇంక ఎవడు దొరకలేదా అంత తక్కువ ధరకు చేసేవాడు….?? శర్మకు వెంటనే ….. నా గడ్డం తో ఏంటయ్యా నీ కొచ్చిన అడ్డం అని అనాలనిపించింది …….
బాబాయ్ మాటలకు తోడుగా మావయ్య.. పిల్లికి బిచ్చం పెట్టని వీడు మంగళాడికి సాయం చేయాలని ఆ ఒక్క క్షవరసాలలొనే చేయించుకుంటాడు…..అయినా నీకు క్షవరం చేస్తున్నడంటే వాడు ఎలాంటివాడో ….. అర్ధమవుతోంది. వీరి మాటలకు తోడుగా తండ్రి….. అదేమయ్యుండదు ఎవరో అమ్మాయిని ప్రేమించి ఉంటాడు దేవాదాసులా అయ్యాడు….రాత్రి నిద్రలో కత్తర తెచ్చి మనమే కత్తిరిద్దామని చమత్కరించగా….. అంతటా ఒక్కసారిగా శర్మ………
“నా గుబురు గడ్డం మీకేంటి అడ్డం…… కత్తెరలు వేయండి నా గడ్డానికి కాదు నువ్వు అడిగే లంచాలకు బాబాయ్….. కత్తెరలు వేయండి నా గడ్డానికి కాదు మనుషుల మధ్య ను పెట్టె చిచ్చులకు మావ…. కత్తెరలు వేయండి నా గడ్డానికి కాదు మీ స్వార్ధనికి పిన్ని …… కత్తెరలు వేయండి నా గడ్డానికి కాదు అమ్మ మీద చేయలేపే ముందు మీ కోపానికి నాన్న…. కత్తెరలు వేయి నా గడ్డానికి కాదు మీ స్వార్ధానికి పిన్ని …. కత్తెరలు వేయండి నా గడ్డానికి కాదు మీ చాదస్థానికి…తాతయ్య….. కత్తెరలు వేయండి వృత్రి ధర్మం పాటించే మంగళాడు నిజాయితీ మీద కాదు క్రమం తప్పి ప్రవర్తించే మీ నిజస్వరూపాలకు ….పెదనాన్న…. మీరంతా ఇన్ని చర్యలకు పాల్పడగా రాని అడ్డం , నా గడ్డం వలన ఎందుకొచ్చింది అమ్మమ్మ……..
నా గుబురు గడ్డం మీకేంటి అడ్డం…….!!! “ అంటూ కోపంగా బయటకు వచ్చేస్తాడు శర్మ….. 2 నెలలుగా తనకి ఆప్తుడైన శశి ని కలవల్లేదని గ్రహించి …. అసలు తన గడ్డం పెంచుటకు గలా కారణము ఎవరికి చెప్పుకోడదని నిర్ణయించుకున్నా…. శర్మకు సాయం చేయగల వ్యక్తి కేవలం శశి ఒక్కడే అని తన బాధను పంచుకోడానికి క్షవరసాలకు వెళ్తాడు…… శర్మ చేరుకుని ఆ పాడుబద్ద క్షవరసాల తాళం వేసి ఉండగా…సరే అని శశి ని వెత్తుకుంటూ తన ఇంటికి వెళ్తాడు…
అసలే అరా కోరా బేరాలతో నడిపే క్షవరసాలకు జనాలు రాడం తగ్గడంతో ఆదాయం తగ్గిన శశికి క్రమంగా ఆరోగ్యం కూడా బాధపడుతున్న శశిని శర్మ చూడగానే…… తనని చూసేందుకు శర్మ వచ్చాడని శశి ఆనందంగా ఆహ్వానించి…..లోపలకు తీసుకెళ్లాడు…. శర్మకు జరిగిన కధ తెలిపి నా బాధ నేతో పంచుకోడానికి వచ్చా అనగా ….. చెప్పు శర్మ నీవెందుకు ఈ గడ్డం కత్తిరించుట లేదు…. అంటాడు శర్మ కు తన మీద కోపం లేదని ఊపిరి పేల్చుకుంటాడు……
శర్మ మొదలు పెడుతూనే……. నా చుట్టూ ఉన్న మనుషులంతా మనసులకు గడ్డం ఉంచారు …….చంపలకు కత్తిరించారు …. నేను మనసుకు కత్తిరించి చంపలకు పెంచాను…. ఆ మాటలలో నుండి గతాన్ని గుర్తుచేకుంటు…….
“ నీ గుబురు గడ్డం అదేనోయి నీ మన్మధ బాణం మరియు సహన చిహ్నం…” అనేది అమల నవ్వుతూ ….. నన్ను ఎల్లప్పుడూ గడ్డంలో చూడాలనుకున్న తన ఆశను తను బ్రతికుండగా నేను తీర్చలేకపోయాను…. అందుకే ఆమె జ్ఞాపకాలతో తనకు నచ్చిన విధంగా బ్రతుకుతూ…..నేను మరణించినా నా దేహాన్ని నా గడ్డం తొలగించకుండానే అంత్య క్రియలు జరగాలని ఆనాడు అమల మరణించిన రోజు అనుకున్నాను ….అని చెబుతూ కంటతడి పెట్టి…..తన బాధను పంచుకున్నాడు……ఆ విషయం ఎవరికి చెప్పదని ప్రమాణం తీసుకున్నాడు…..ఆనాటి నుండి ప్రతిసారి క్షవరనికి వచ్చినా గడ్డం పూర్తిగా తీయించుకొడు శర్మ…..అప్పటినుండి క్షవరసాలకు వచ్చే ఇద్దరు ముగ్గురిని కూడా గడ్డం గురించి అడిగేవాడు కాదు శశి…..వాళ్ళు గీయమంటే గీసేవాడు….
ఇలా జరిగిన 10 రోజులకి సరిగ్గా …..పని మీద పట్నం వెళ్లి తిరిగి వచ్చేదారిలో బస్సు ప్రమాదంలో శర్మ తన ప్రాణాలను కోల్పోతాడు….. మరుసటి రోజున ఇలా ఒక సవానికి శిరోజాలు , గోళ్లు కత్తిరించవల్సిందిగా కబురు రాగా , ఇటువంటి బేరం నాకు ఎన్నడూ రాలేదు సరేలే నాలుగు డబ్బులు వస్తాయని వెళ్లగా అక్కడ ఉన్న శవం శర్మదని చూసి కనుల నుండి జాలువారే సోకాజాలములను ఆపుకుని తానిచ్చిన మాటలను గుర్తుచేకుంటు బాధపడ్డాడు…..
తాను మరణించిన పిమ్మట అంత్యక్రియలు సమయంలో శశినే పిలిపించమని తన డైరీ లో శర్మ రాసుకున్న విషయం సోదరి కి తెలియడంతో శశి ని పిలిపించారని తెలిసి మరింత కన్నీరు శర్మ పాదలయందు కారుస్తూ…. తన కురులను , గోళ్లను కత్తిరించి ఇచ్చిన మాట ప్రకారం గడ్డం మీద కత్తర వేయకపోడం చూసి బంధువులు శర్మ అన్న మాటలు చూస్తూ చేస్కుని చింతూస్తుండగా……
బాబాయ్ తాను నిజాయితీగా సంపాదించిన డబ్బులతో 10000 తీసి శశి కి ఇచ్ఛి క్షవరసాలకు ఉపయోగించమని చెప్పి…తాను అక్రమంగా సంపాదించిన డబ్బును శర్మ దేహంతో పాటు మట్టిలో పూడ్చేశారు.. .
ఇక ఏ గుబురు గడ్డం, మాకు రాదిక అడ్డం అంటూ శర్మను కోల్పోయిన సోకాన్ని దిగమింగుకోలేక ఎవరికి వారు మనసులో అనుకున్న మాటలివి…..
ఇక ఏ గుబురు గడ్డం, మాకు రాదిక అడ్డం ఇక ఏ గుబురు గడ్డం, మాకు రాదిక అడ్డం…..!!!!