మొత్తం ఏ.బి.సి.డి లను ఒక్క నిమిషంలో చెప్పమంటే ఎన్ని సార్లు చెప్పగలం.? ప్రాక్టీస్ చేస్తే ఓ పది సార్లు చెప్పగలమేమో... ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ రంగాచారి ఎన్నిసార్లు చెప్పాడో తెలుసా 37 సార్లు అది కూడా వెనుకనుండి.. ఇంతకుముందు మథ్యేవ్ జాక్సన్ అనే వ్యక్తి ఒక్క నిమిషంలో 26సార్లు చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఉన్న రికార్డ్ ను మనోడు బద్దలు(37 సార్లు) కొట్టేశాడు. ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టే వేటలో నిమగ్నమయి ఉన్నాడు. ఇంతకు ముందు నిమిషానికి 37 సార్లు రివర్స్ లో జెడ్ నుండి ఏ వరకు చెబితే ఈసారి నిమిషానికి 50 సార్లు చెప్పే ప్రదర్శన త్వరలో ఇవ్వబోతున్నాడు.
ఇందులోనే శ్రీకాంత్ మొదటి చివరి రికార్డ్ కాదు.. ఎవ్వరి ఊహకందని ఓ కొత్త లిపినే తయారుచేసి ప్రపంచంలో లిపి లేని భాషలకు అందించాడు. దేశంలో లిపి ఉన్న భాషలే కనుమరుగు అయ్యే పరిస్థితికి వచ్చింది అదే లిపి లేని భాష పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. చిన్నతనం నుండి సైంటిస్ట్ అవ్వాలని కలలు కని ఆర్ధిక ఇబ్బందుల వల్ల కాలేకపోయిన శ్రీకాంత్ ఏదైనా సమాజానికి ఉపయోగపడేది కనుగొనాలని తపన ఉండేది. ఆ తపనే లిపిలేని భాషల కోసం లిపిని తయారుచేసేలా చేసింది.
ఇందుకోసం ఓ కొత్త అక్షరాలను, ఆకారాలను తయారు చేయలేదు అందరికి తెలిసిన మ్యాథ్స్, ఫోన్ లోని స్పెషల్ క్యారెక్టర్స్, వివిధ దేశాల కరెన్సీ సింబల్స్ మొదలైనవాటిని ఉపయోగించాడు. లిపిలేని ఎన్నో ప్రాంతీయ భాషలకు ఈ లిపి సరిపోయేలా దీనిని రూపొందించాడు. ఇందుకోసం ఎంతో పరిశోధన చేసి, దాదాపు రెండు సంవత్సరాల పాటు శ్రమించి ఈ లిపిని అభివృద్ది చేశాడు. దీనికి "కరెన్సీ స్క్రిప్ట్" అని నామకరణం చేశాడు. ముఖ్యంగా మాతృభాష చెప్పగలిగినంతగా మన భావాలను ఇతర భాషలలో చెప్పలేము. కరెన్సీ లిపితో అలాంటి లిపి లేని ఎన్నో భాషలను బ్రతికించగలుగబోతున్నాడు మన తెలుగు యువకుడు..